నామినేటెడ్ పోస్టుల భర్తీపై టిడిపి కసరత్తు.. విడతల వారీగా అవకాశాలు

రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ నామినేటెడ్ పోస్టులు భర్తీపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నామినేటెడ్ పోస్టుల వివరాలను ప్రభుత్వం ఇప్పటికే సేకరించింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో నియమితులైన కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లతోపాటు ఇతర నామినేటెడ్ పోస్టుల్లో ఉన్న వారితో ప్రభుత్వం రాజీనామా చేయించింది. ఆయా పోస్టులను ప్రస్తుతం కూటమి నాయకులతో భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.

Telugu Desam Party workers

తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు 

రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ నామినేటెడ్ పోస్టులు భర్తీపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నామినేటెడ్ పోస్టుల వివరాలను ప్రభుత్వం ఇప్పటికే సేకరించింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో నియమితులైన కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లతోపాటు ఇతర నామినేటెడ్ పోస్టుల్లో ఉన్న వారితో ప్రభుత్వం రాజీనామా చేయించింది. ఆయా పోస్టులను ప్రస్తుతం కూటమి నాయకులతో భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. తెలుగుదేశం పార్టీ ప్రధానంగా గడిచిన ఐదేళ్లపాటు పార్టీ కోసం కష్టపడిన వారికి ఈ నామినేటెడ్ పోస్టుల్లో అవకాశాలను కల్పించాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే ప్రభుత్వం సేకరించిన సమాచారం ప్రకారం ముఖ్యమైన కార్పొరేషన్లు వందకుపైగా ఉన్నట్లు తేలింది. కుల వృత్తులకు సంబంధించిన ఫెడరేషన్లు మరో 60 వరకు ఉన్నాయి. ఇవి కాకుండా కింది స్థాయిలో నీటి సంఘాలు, ఆహార సలహా సంఘాలు తదితర మొదలుకొని పై స్థాయిలో ఉన్న పదవులు పరిగణలోకి తీసుకుంటే డైరెక్టర్లతో కలిపి వేల సంఖ్యలో పదవులు ఉన్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం మొదలుకొని కిందిస్థాయిలో చిన్న దేవాలయాల వరకు పాలక మండల్ల నియామకానికి కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. వీటిలో కూడా పెద్ద సంఖ్యలో పార్టీ నేతలను సర్దుబాటు చేసే దిశగా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మిత్రపక్షాలుగా ఉన్న జనసేన, బిజెపిలకు కూడా అవకాశాలు కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. మిత్రపక్షాలకు ఏ ఏ పదవులు ఇవ్వాలి, టిడిపి నేతలతో వేటిని భర్తీ చేయాలన్న దానిపై కూడా అంతర్గతంగా కసరత్తు జరుగుతోంది.

అన్నిటిని ఒకేసారి కాకుండా విడతల వారీగా భర్తీ చేసే యోచనలో పార్టీ నాయకత్వం ఉంది. ముందు రాష్ట్ర స్థాయిలో ముఖ్యమైన పదవులను భర్తీ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్ణయించినట్లు చెబుతున్నారు. కొన్ని కార్పొరేషన్ల అధ్యక్ష పదవులు, కొన్ని సలహాదారు పదవులు, కొన్ని ముఖ్య సంస్థలు డైరెక్టర్ల పదవులు ఇందులో ఉండే అవకాశం ఉంది. మొదటి విడతలో భర్తీ చేయాల్సిన పదవులు, వాటిలో చోటు కల్పించాల్సిన నేతల ఎంపికపై ప్రస్తుతం టిడిపి నాయకత్వం దృష్టిసారించింది. ఇప్పటికే పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉన్న కొంత సమాచారాన్ని సేకరించారు. దీంతోపాటు మరికొంత సమాచారాన్ని ఎన్నికల సమయంలో పనిచేసిన వారి నుంచి తీసుకుంటారు. వీటిలో సామాజిక సమీకరణాలు, ప్రాంతీయ సమీకరణాలను కూడా పరిగణలోకి తీసుకుంటారని చెబుతున్నారు. ఎన్నికల సమయంలో కీలకంగా పని చేసిన వారు, క్షేత్రస్థాయిలో కష్టబడిన వారు, పార్టీ అధ్యక్షుని తరఫున బ్యాక్ ఆఫీస్ లో వివిధ బాధ్యతలో పనిచేసిన వారి జాబితాలను ముందు పెట్టుకొని వారిలో ముందుగా ఎవరికి అవకాశం ఇవ్వాలన్న దానిపై కసరత్తు జరుగుతోంది. ఏది ఏమైనా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన వెంటనే నామినేటెడ్ పదవులను భర్తీ చేసేందుకు ప్రయత్నిస్తుండటం పట్ల కేడర్ లో ఆనందం వ్యక్తం అవుతోంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్