శ్రీవారి ఆలయ శుద్ధిపై తర్జనభర్జన.. ఆగమ సలహా మండలి భేటీలో నేడు నిర్ణయం

తిరుపతి లడ్డు కల్తీ వ్యవహారం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంపై ఇటువైపు భక్తులు, ధార్మిక సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. కల్తీ జరిగితే మాత్రం కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందంటూ స్పష్టం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే శ్రీవారి ఆలయంలో మహాపచారం జరిగిందంటూ పండితులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో శ్రీవారి ఆలయ శుద్ధికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. లడ్డు ప్రసాదం కల్తీ తరువాత శ్రీవారి ఆలయాన్ని సంప్రోక్షణ చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించిన నేపథ్యంలో అర్చకులు, ఆగమ సలహా మండలి సభ్యులతో టీటీడీ ఈవో శ్యామలరావు సమావేశాన్ని నిర్వహించారు.

Tirupati Temple, Laddu

తిరుపతి ఆలయం, లడ్డూ

తిరుపతి లడ్డు కల్తీ వ్యవహారం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంపై ఇటువైపు భక్తులు, ధార్మిక సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. కల్తీ జరిగితే మాత్రం కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందంటూ స్పష్టం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే శ్రీవారి ఆలయంలో మహాపచారం జరిగిందంటూ  పండితులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో శ్రీవారి ఆలయ శుద్ధికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. లడ్డు ప్రసాదం కల్తీ తరువాత శ్రీవారి ఆలయాన్ని సంప్రోక్షణ చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించిన నేపథ్యంలో అర్చకులు, ఆగమ సలహా మండలి సభ్యులతో టీటీడీ ఈవో శ్యామలరావు సమావేశాన్ని నిర్వహించారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో నిర్వహించిన సమావేశంలో ఆగమ సలహా మండలి సభ్యులు వేణుగోపాల దీక్షితులు, వైఖానస ఆగమ పండితులు మోహన రంగాచార్యులు, సీతారామాచార్యులు, పలువురు అర్చకులు పాల్గొన్నారు. ఆలయాన్ని సంప్రోక్షణ చేయాలనే అభిప్రాయాలు వస్తున్నాయని, దీనిపై ఆగమశాస్త్రంలో ఎలాంటి చర్యలు చేపట్టాలని ఉందనే అంశాలపై చర్చించారు. నెయ్యిలో కల్తీ జరిగిన నేపథ్యంలో పరిహారం కింద ఎలాంటి చర్యలు తీసుకోవాలని ఈవో ప్రశ్నించారు. ఆగమ సలహా మండలి సభ్యులు స్పందిస్తూ అనుమానాలు తలెత్తిన క్రమంలో శుద్ధి చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, ఆగమ సలహా మండలి సభ్యులతోపాటు ఇతర ప్రధాన అర్చకులు, అర్చకులు, సీనియర్ పండితులతో సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకునేందుకు సమయం ఇవ్వాలని కోరారు. ఆదివారం మధ్యాహ్నంలోగా శుద్ధి నిర్వహణపై పూర్తిస్థాయి ప్రణాళిక ఇవ్వాలని ఈవో కోరారు. ఈ నేపథ్యంలో ఆగమ సలహా మండలిలోని ఐదుగురు సభ్యులతోపాటు వైఖానస ఆగమ శాస్త్ర పండితులు, అర్చకులు ఆదివారం సమావేశం కానున్నారు. ఇందులో సంప్రోక్షణ చేయాలా.? మహా శాంతి యాగం చేయాలా.? చేస్తే ఏఏ ప్రాంతాల్లో ఎన్ని రోజులు చేయాలి, ఎలా చేపట్టాలనే అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. మూడు రోజులు, వారం రోజులు 27 రోజుల శాంతి విధానాల్లో ఏది చేస్తే పరిహారం జరుగుతుందని విషయాలను ఆగమ శాస్త్రం ప్రకారం నిర్ణయించనున్నారు. సాధారణంగా ప్రతి బ్రహ్మోత్సవానికి ముందు వచ్చే మంగళవారం రోజు కోయిల్ ఆల్వార్ తిరుమంజనం (ఆలయ శుద్ధి) నిర్వహిస్తారు. దీనికంటే ముందుగానే శాంతి హోమాన్ని నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. స్వామి వారికి కైంకర్యాలు, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. ఆ నివేదికను ప్రభుత్వానికి పంపి శుద్ధి కార్యక్రమాలు చేపట్టాలని యోచిస్తున్నారు. శ్రీవారి ఆలయాన్ని సంప్రోక్షణతో శుద్ధి చేయడంపై మరింత లోతుగా విస్తృతంగా సంప్రదింపులు జరిపి తుది నిర్ణయానికి రావాలని టీటీడీ అధికారులు యోచిస్తున్నారు. 

ఇదిలా ఉంటే తిరుమల లడ్డు ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడటంపై ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు. కలియుగ ప్రత్యక్ష దైవం బాలాజీకి జరిగిన ఈ ఘోర అపచారానికి సనాతన ధర్మాన్ని ప్రతి ఒక్కరూ ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిందేనని పేర్కొన్నారు.  అమృత తుల్యంగా పరమ పవిత్రంగా భావించే తిరుమలలో ప్రసాదం గత పాలకుల వికృత పోకడల ఫలితంగా అపవిత్రమైనదని, జంతు అవశేషాలతో మలినమైందన్నారు. విషయం తెలిసినప్పటి నుంచి తన మనసు కలత చెందిందని, అపరాధ భావానికి గురైంది అన్నారు. ఈ ఘోర అపచారానికి సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిందేనని వెల్లడించారు. అందులో భాగంగానే తాను ప్రాయశ్చిత్త దీక్ష చేయాలని సంకల్పించినట్లు పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఈ నెల 22వ తేదీ ఉదయం గుంటూరు జిల్లా నంబూరు లోని శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయంలో దీక్ష చేపడతానన్న పవన్ కళ్యాణ్.. 11 రోజులు పాటు దీక్ష కొనసాగించిన అనంతరం తిరుమల శ్రీవారిని దర్శించుకుని దేవ, దేవా నీ పట్ల గత పాలకులు చేసిన పాపాలను ప్రక్షాళన చేసే శక్తిని ఇవ్వమని వేడుకుంటూనని పేర్కొన్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్