ప్రపంచంలోను అత్యుత్తమ దేశం స్విస్‌.. మూడో ఏడాది అగ్రస్థానంలో స్విట్జర్లాండ్‌

ప్రపంచంలోనే బెస్ట్‌ దేశంగా నిలవాలంటే అనేక అత్యుత్తమ పరిస్థితులు ఉండాలి. ఏటా ఒక్కో దేశం ఈ టాప్‌ ప్లేస్‌ కోసం పడుతుంటాయి. అటువంటి వరుసగా మూడేళ్లపాటు ఒకే దేశం ప్రపంచంలోనే అత్యుత్తమ దేశంగా నిలుస్తూ వస్తోంది. అదే స్విట్జర్లాండ్‌. ఈ దేశం పేరు వినగానే చాలా మందికి సకల సౌకర్యాలతో విరాజిల్లే దేశంగానే కాకుండా.. బ్లాక్‌ మనీ దాచుకునే కేంద్రంగానూ చాలా మందికి గుర్తుకు వస్తుంది.

switzerland

స్విట్జర్లాండ్‌

ప్రపంచంలోనే బెస్ట్‌ దేశంగా నిలవాలంటే అనేక అత్యుత్తమ పరిస్థితులు ఉండాలి. ఏటా ఒక్కో దేశం ఈ టాప్‌ ప్లేస్‌ కోసం పడుతుంటాయి. అటువంటి వరుసగా మూడేళ్లపాటు ఒకే దేశం ప్రపంచంలోనే అత్యుత్తమ దేశంగా నిలుస్తూ వస్తోంది. అదే స్విట్జర్లాండ్‌. ఈ దేశం పేరు వినగానే చాలా మందికి సకల సౌకర్యాలతో విరాజిల్లే దేశంగానే కాకుండా.. బ్లాక్‌ మనీ దాచుకునే కేంద్రంగానూ చాలా మందికి గుర్తుకు వస్తుంది. అయితే, అటువంటి ఈ దేశమే ప్రపంచంలోనే అత్యుత్తమ దేశంగా నిలిచింది. ఈ దేశంలో అందమైన ఆల్ప్ప్‌ పర్వతాలు, ప్రకృతి సోయగాలు కళ్ల ముందు కదలాడుతుంటాయి. వీటన్నింటికీ మించి పర్యాటకులకు స్వర్గదామంగా నిలిచే ఈ చిన్న దేశానికి వెళ్లాలని, అక్కడ కొన్నాళ్లపాటు ఉండాలని కలలు కంటుంటారు. అటువంటి దేశం ప్రపంచంలోనే అత్యుత్తమ దేశంగా నిలిచింది. యూఎస్‌ న్యూస్‌ అండ్‌ వరల్డ్‌ రిపోర్ట్‌ విడుదల చేసిన బెస్ట్‌ కంట్రీస్‌ ర్యాంకింగ్స్‌-2024లో స్విట్జర్లాండ్‌ అగ్రస్థానాన్ని దక్కించుకుంది. గడిచిన రెండేళ్లు కూడా ఈ దేశమే టాప్‌లో నిలిచింది. సాహసం, వారసత్వం, వ్యాపార అవకాశాలు, జీవన నాణ్యత పరిణామాలు, సంస్కృతి, సాంప్రదాయాలు తదితర అంశాలు ఆధారంగా చేపట్టి ఈ ర్యాంకింగ్స్‌ను విడుదల చేశారు. మొత్తం 89 దేశాలతో జాబితాను రూపొందించి విడుదల చేశారు. అత్యధిక విభాగాల్లో ఉన్నతంగా స్విట్జర్లాండ్‌ నిలిచింది. ఇప్పటి వరకు మొత్తంగా ఏడుసార్లు ఈ దేశం బెస్ట్‌ కంట్రీగా నెంబర్‌ వన్‌ ర్యాంక్‌ సాధించింది. 

33వ స్థానంలో నిలిచిన భారత్‌.. 

89 దేశాలతో విడుదల అయిన ఈ జాబితాలో భారత్‌ 33వ స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో శరవేగంగా అభివృద్ధి చెందిన జపాన్‌, మూడో స్థానంలో అమెరికా, నాలుగో స్థానంలో కెనడా, ఐదో స్థానంలో ఆస్ర్టేలియా నిలిచాయి. గతేడాదితో పోలిస్తే భారత్‌ మూడు స్థానాలకు కిందకు పడిపోయింది. గతంలో ఏడాది 30వ స్థానంలో నిలువగా, ఈ ఏడాది 33వ స్థానానికి దిగజారింది. ఆసియా నుంచి జపాన్‌, సింగపూర్‌, చైనా, దక్షిణ కొరియా మాత్రమే ఇప్పటి వరకు టాప్‌ 25లో స్థానాన్ని దక్కించుకున్నాయి. 


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్