మన పూర్వికులు జొన్నలు, మక్కలు, రాగులు, సజ్జలు వంటి మిలెట్స్‌ను ఎక్కువగా తీసుకొనేవారు. అన్నం అనేది చాలా తక్కువ. అందుకే వాళ్లు అంత ధృడంగా ఉండేవారు. అయితే, ఆహారంపై ఈ జనరేషన్ ఎక్కువగా దృష్టి పెట్టకపోవడం వల్ల తరచూ అనారోగ్యానికి, రోగాలకు గురవుతున్నారు.
ప్రతీకాత్మక చిత్రం
మన పూర్వికులు జొన్నలు, మక్కలు, రాగులు, సజ్జలు వంటి మిలెట్స్‌ను ఎక్కువగా తీసుకొనేవారు. అన్నం అనేది చాలా తక్కువ. అందుకే వాళ్లు అంత ధృడంగా ఉండేవారు. అయితే, ఆహారంపై ఈ జనరేషన్ ఎక్కువగా దృష్టి పెట్టకపోవడం వల్ల తరచూ అనారోగ్యానికి, రోగాలకు గురవుతున్నారు. అయితే, కరోనా తర్వాత చాలామందిలో ఆరోగ్యం, ఆహారంపై శ్రద్ధ మొదలైంది. దాంతో మిలెట్స్‌వైపు దృష్టి సారిస్తున్నారు. అందులో జొన్నలవి ప్రధాన భాగం. ఎక్కడ చూసినా జొన్న రొట్టెలు అమ్మకాలు ఎక్కువయ్యాయి. ఇంట్లో చేసుకుందామంటే చేసుకోవడం రాదు. అయితే, జొన్నలతో జొన్న రొట్టెలకు బదులు.. ఇతర అనేక రకాల స్నాక్స్ చేసుకోవచ్చు. వాటిని ఎలా చేసుకోవచ్చో తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు
జొన్నపిండి, చిన్న అల్లం ముక్క, 3 పచ్చి మిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ జిలకర, హాఫ్ టేబుల్ స్పూన్ వాము, 3 టేబుల్ స్పూన్ పెరుగు, అర స్సూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, అర స్పూన్ గరం మసాల పొడి,అర స్పూన్ వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, ఇంగువ, 1 టేబుల్ స్పూన్ చక్కెర, నూనె, వంటసోడా, సొరకాయ తురుము, కొత్తిమీర, శనగపిండి, పసుపు
తయారు చేసే విధానం
ముందుగా మిక్సీ గిన్నెలోకి ఒక చిన్న ముక్క అల్లాన్ని, మూడు పచ్చి మిరపకాయలను, అర టీస్పూన్ జీలకర్ర, అర టీస్పూన్ వాము వేసి గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పిండి కలపటానికి ఒక బౌల్‌ని తీసుకొని అందులోకి ఒక మూడు టేబుల్ స్పూన్‌ల పెరుగు, అర టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, అర టీస్పూన్ జీలకర్ర, అర టీస్పూన్ వాము, అర టీ స్పూన్ ఇంగువ, 2 టేబుల్ స్పూన్ల నువ్వులను, 1 టీ స్పూన్ చక్కెరను వేసుకొని ముందుగా మిక్సీ చేసుకున్న తురుమును కూడా వేసి మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇందులోనే ఒక అర టీ స్పూన్ నూనె, అర టీ స్పూన్ వంట సోడా వేసుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమంలో తురుమిన సొరకాయ ఒక కప్పు, ఒక కప్పు కొత్తిమీర, ఒక కప్పు జొన్నపిండి, ఒక అర కప్పు శనగపిండి, ఒక పావు టీ స్పూన్ పసుపు వేసి చపాతి పిండిలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని చిన్న చిన్న ముద్దలుగా తీనుకొని పక్కన పెట్టుకోవాలి. ముద్దలుగా పిండిని తయారుచేసుకున్న తర్వాత ఆ పిండి ముద్దలను ఆవిరిపై ఉడికించడానికి స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలోకి ముడు కప్పుల నీళ్లను తీసుకోండి. తీసుకున్న నీళ్లు మరగడం స్టార్ట్ అయినప్పుడు ఆయిల్ రాసిన స్టీమర్ గిన్నెను పెట్టి ఆ గిన్లోనె ముందుగా చేసుకున్న పిండి ముద్దలను ఉంచి మూత పెట్టుకొని ఆవిరికి 20 నుండి 22 నిమిషాలు ఉడకనివ్వాలి. ఆ తర్వాత చల్లారనిచ్చి వాటిని నచ్చిన ఆకారంలోకి కట్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే.