సమాచార కమిషన్లలో ఖాళీల భర్తీ ఇంకెన్నడు.. కేంద్రం, రాష్ట్రాలపై సుప్రీం కోర్టు ఆగ్రహం

evarthalu
ప్రతీకాత్మక చిత్రం

||సుప్రీం కోర్టు||

కేంద్రం, రాష్ర్టాల ప్రభుత్వాలు కేంద్ర సమాచార కమిషన్, రాష్ట్ర సమాచార కమిషన్లలోని ఖాళీలు భర్తీ చేయడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయా ప్రభుత్వాలను సుప్రీం కోర్టు ఆదేశించింది. లేకపోతే సమాచార హక్కు చట్టం నిర్వీర్యమైపోతుందని వెల్లడిస్తూ, ప్రభుత్వాలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఐసీ, ఎస్‌ఐసీల్లో మంజూరైన పోస్టులు, ఖాళీగా ఉన్న పోస్టులు, పెండింగ్ కేసుల సంఖ్య తదితర వివరాలను సేకరించాలని కేంద్ర వ్యక్తిగత, శిక్షణ శాఖను కోరింది. జార్ఖండ్, త్రిపుర లాంటి రాష్ర్టాల్లో సీఐసీలు నిర్వీర్యమైపోయాయని వ్యాఖ్యానించింది. 3 వారాల్లోగా తాము అడిగిన సమాచారం ఇవ్వాలని కేంద్రం, రాష్ర్టాలను ఆదేశించింది. నిర్ణీత కాల వ్యవధిలోగా సీఐసీ, ఎస్‌ఐసీల్లో ఖాళీలను భర్తీ చేయాలని సుప్రీంకోర్టు 2019లో ఇచ్చిన తీర్పును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయడం లేదన్న పిటిషన్‌పై ఈ మేరకు సుప్రీం పై వ్యాఖ్యలు చేసింది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్