||ప్రతీకాత్మక చిత్రం||
ఈవార్తలు, నేషనల్ న్యూస్: వేసవికాలం వచ్చేసింది. ఉష్ణోగ్రత రోజురోజుకు పెరిగిపోతుంది. వేసవికాలంలో ఉష్ణోగ్రత వల్ల డీహైడ్రేషన్ గురవకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కేంద్రం అని కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. మధ్యాహ్న సమయంలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. కావున మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల వరకు బయటకు రాకూడదు. ఉష్ణోగ్రత వల్ల డీహైడ్రేషన్ కి గురవకుండా నిమ్మరసం, మజ్జిగ తాగడం మంచిది. అలాగే నిలిపి ఉన్న కార్లలో పిల్లలను వదిలేయకూడదు. దీనివల్ల ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండడం వలన ప్రమాదం సంభవించే అవకాశాలు ఉంటాయి. వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మూత్ర విసర్జన తగ్గిపోవడం, విపరీతమైన దాహం, తలనొప్పి, యూరిన్ పచ్చగా రావడం వంటి లక్షణాలు ఉన్నట్లయితే వడదెబ్బకు దారితీస్తుంది. అత్యవసర పరిస్థితిలో బయటకు వెళ్ళవలసి వస్తే గొడుగు క్యాప్ ను ధరించి బయటకు వెళ్లడం మంచిదని కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.