గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పలు పార్టీల నుంచి వారసులు బరిలోకి దిగారు. ఈ ఎన్నికల్లో కూటమి నుంచి, మరి ముఖ్యంగా టిడిపి నుంచి పోటీ చేసిన పలువురు ముఖ్య నేతల వారసులు విజయాన్ని సాధించి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెడుతుండగా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన పలువురు ఘోర పరాజయాన్ని మూటగట్టుకుని ఇంటికి పరిమితం అవ్వాల్సిన పరిస్థితి నెలకొంది.
అధితి విజయలక్ష్మి, జెసి అస్మిత్ రెడ్డి
గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పలు పార్టీల నుంచి వారసులు బరిలోకి దిగారు. ఈ ఎన్నికల్లో కూటమి నుంచి, మరి ముఖ్యంగా టిడిపి నుంచి పోటీ చేసిన పలువురు ముఖ్య నేతల వారసులు విజయాన్ని సాధించి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెడుతుండగా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన పలువురు ఘోర పరాజయాన్ని మూటగట్టుకుని ఇంటికి పరిమితం అవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసిన ఏడుగురు ముఖ్య నాయకుల వారసులు తొలిసారి అసెంబ్లీలో అడుగుపెడుతుండగా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన ఆరుగురు వారసులు ఓటమి పాలయ్యారు. టిడిపి నుంచి పోటీ చేసిన మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు కుమార్తె అధితి విజయలక్ష్మి గజపతిరాజు, తూర్పుగోదావరి జిల్లా నుంచి పోటీ చేసిన మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల దివ్య, అనంతపురం జిల్లా నుంచి మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి కోడలు పల్లి సింధూర రెడ్డి, మాజీ మంత్రి దివంగత గాలి ముద్దు కృష్ణమ నాయుడు కుమారుడు గాలి భాను ప్రకాష్, మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి కుమారుడు బొజ్జల సుధీర్ రెడ్డి, టిడిపి సీనియర్ నేత వర్ల రామయ్య కుమారుడు వర్ల కుమార్ రాజా, మాజీ ఎమ్మెల్యే జెసి ప్రభాకర్ రెడ్డి కుమారుడు జెసి అస్మిత్ రెడ్డి ఆయా నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ నుంచి బరిలోకి దిగి అద్భుత విజయాన్ని దక్కించుకున్నారు. అధికార వైసీపీ నుంచి బరిలోకి దిగిన పలువురు వారసులు దారుణ పరాభవాన్ని మూటగట్టుకున్నారు. ఈ జాబితాలో మాజీ మంత్రి పేర్ని నాని కుమారుడు పేర్ని కృష్ణమూర్తి, మాజీ ఎమ్మెల్యే ముస్తఫా కుమార్తె నూర్ ఫాతిమా, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, టీటీడీ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు భూమున అభినయ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కరణం బలరామ్ కుమారుడు కరణం వెంకటేష్, మాజీ ఎమ్మెల్యే నెల్లూరు నారాయణస్వామి కుమార్తె కళత్తూరు కృపాలక్ష్మి పరాభవాన్ని దక్కించుకున్నారు.