తెలంగాణ కేబినెట్‌ విస్తరణ దిశగా అడుగులు.. ముహూర్తం ఎప్పుడంటే.?

తెలంగాణలో రేవంత్‌ రెడ్డి తన మంత్రి వర్గాన్ని విస్తరించేందుకు సిద్ధమవుతున్నారు. పార్టీ అధికాంరలోకి వచ్చినప్పటి నుంచి మంత్రివర్గ విస్తరణకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ సాధ్యం కావడం లేదు. ఆశావహులు కూడా మంత్రి వర్గ విస్తరణకై కోటి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 15 నెలలు పూర్తయింది. ఈ నేపథ్యంలో మంత్రి వర్గ విస్తరణ జరుగుతుందన్న ఊహాగానాలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. సీఎం రేవంత్‌ రెడ్డి ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారి మంత్రివర్గ విస్తరణ జరుగుతుందంటూ వార్తలు షికారు చేస్తున్నాయి. అయితే, ఇప్పటి వరకు మంత్రి వర్గ విస్తరణ కాలేదు.

Revanth Reddy's cabinet

రేవంత్ రెడ్డి మంత్రి వర్గం

తెలంగాణలో రేవంత్‌ రెడ్డి తన మంత్రి వర్గాన్ని విస్తరించేందుకు సిద్ధమవుతున్నారు. పార్టీ అధికాంరలోకి వచ్చినప్పటి నుంచి మంత్రివర్గ విస్తరణకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ సాధ్యం కావడం లేదు. ఆశావహులు కూడా మంత్రి వర్గ విస్తరణకై కోటి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 15 నెలలు పూర్తయింది. ఈ నేపథ్యంలో మంత్రి వర్గ విస్తరణ జరుగుతుందన్న ఊహాగానాలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. సీఎం రేవంత్‌ రెడ్డి ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారి మంత్రివర్గ విస్తరణ జరుగుతుందంటూ వార్తలు షికారు చేస్తున్నాయి. అయితే, ఇప్పటి వరకు మంత్రి వర్గ విస్తరణ కాలేదు. అయితే, కొద్దిరోజుల్లో మంత్రి వర్గ విస్తరణ ఖాయమంటూ ఆ పార్టీలోని ముఖ్య నాయకులు చెబుతున్నారు. మంత్రిత్వశాఖలు భర్తీకి ఏఐసీసీ పచ్చజెండా ఊపినట్టు చెబుతున్నారు. అదే సమయంలో కొందిర మంత్రి పదవుల్లో మార్పులు కూడా చేస్తారని చెబుతున్నారు. ఇప్పటికే కొందరు మంత్రులు మంత్రి వర్గ విస్తరణ ఎప్పుడు జరిగినా తమ శాఖలను మార్చాలంటూ అధిష్టానం వద్ద డిమాండ్‌ను పెట్టినట్టు తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణతోపాటు పనిలో పనిగా మంత్రులశాఖల్లో మార్పులు కూడా చేయనున్నట్టు తెలుస్తోంది. 

తెలంగాణ మంత్రివర్గంలో భారీ మార్పులు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. 18 మంది మంత్రులు ఉండాలి. ప్రస్తుతం ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. వీటి కోసం దాదాపు డజను మంది నేతలు పోటీ పడుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటై 15 నెలలు పూర్తవుతున్న నేపథ్యంలో వారంతా ఎప్పుడెప్పుడు విస్తరణ చేస్తారా.? అని ఆశగా ఎదురు చూస్తున్నారు. గడిచిన కొన్ని నెలలు నుంచి సీఎం రేవంత్‌ రెడ్డి మంత్రి వర్గ విస్తరణకు సంబంధించి జోరుగా చర్చలు జరుపుతున్నారు. తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జ్‌ మీనాక్షీ నటరాజన్‌ కూడా రాష్ట్రంలోని కీలక నేతలతో వ్యక్తిగతంగా భేటీ అవుతూ పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. దీంతో మంత్రివర్గ విస్తరణ విషయంలో అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చినట్టు చెబుతున్నారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న కేబినెట్‌ బెర్త్‌లు ఎవరెవరికి కేటాయించాలన్న దానిపై హైకమాండ్‌ ఒక నిర్ణయానికి వచ్చినట్టు చెబుతున్నారు. కొద్దిరోజుల్లోనే దీనిపై ఒక కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. అలాగే, కొందరు మంత్రుల పదవుల్లోనూ మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. కొందరు మంత్రులు తమకు సంబంధించిన శాఖలపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు చెబుతున్నారు. ముఖ్యంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా తనశాఖ పట్ల అసంతృప్తిగా ఉన్నారని చెబుతున్నారు. కోమటిరెడ్డి తన సీనియారిటీతో పనులు పరుగులు పెట్టించాలని భావిస్తున్నా.. ఆర్‌అండ్‌బీ శాఖలో అధికారులు సహకరించడం లేదన్న అభిప్రాయంలో ఆయన ఉన్నారు. అందుకే తన శాఖ మార్చమని ఆయన కోరుతున్నట్టు చెబుతున్నారు. మరోవైపు సుదర్శనరెడ్డి హోంమంత్రి పదవి లభిస్తుందన్న లీకులు ఢిల్లీ నుంచి వస్తున్నాయి. పార్టీలో సీనియర్‌ కావడం, వివాద రహితుడిగా ఉన్న పేరు, గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉండడంతో హైకమాండ్‌ ఆయన వైపు మొగ్గు చూపుతున్నట్టు చెబుతున్నారు. చూడాలి మరి ఎవరికి మంత్రి పదవులు దక్కుతాయా..? ఎవరి మంత్రి పదవుల్లో మార్పులు చోటుచేసుకుంటాయో చూడాలి.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్