విజయవాడలో వరదలతో అల్లాడుతున్న ప్రజలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ప్రస్తుతం వరదలతో పూర్తిగా నాశనమైన ఇళ్లను శుభ్రం చేసుకోవడంతోపాటు పాడైన వస్తువులు, వాహనాలను ఎలా సాధారణ స్థితికి తీసుకురావాలన్న దానిపై బాధితులు తీవ్రంగా మధనపడుతున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం వరదలు వల్ల దెబ్బతిన్న వాహనాలు, విద్యుత్ పరికరాలు, ఇళ్ల ఇన్సురెన్స్ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
వరద నీటిలో మునిగిన వాహనాలు
విజయవాడలో వరదలతో అల్లాడుతున్న ప్రజలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ప్రస్తుతం వరదలతో పూర్తిగా నాశనమైన ఇళ్లను శుభ్రం చేసుకోవడంతోపాటు పాడైన వస్తువులు, వాహనాలను ఎలా సాధారణ స్థితికి తీసుకురావాలన్న దానిపై బాఽధితులు తీవ్రంగా మధనపడుతున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం వరదలు వల్ల దెబ్బతిన్న వాహనాలు, విద్యుత్ పరికరాలు, ఇళ్ల ఇన్సురెన్స్ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే బాధితులకు సింగిల్ విండోలో బీమా క్లెయిమ్‌లు పొందేందులా సీఎం చంద్రబాబు నాయుడు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు ఇన్సురెన్స్ సంస్థలతో మంగళవారం రాత్రి ఆయన సమావేశమయ్యారు. ఈ మేరకు బాధితులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సింగిల్ విండోలో క్లెయిమ్‌లు పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. దీనివల్ల వారం నుంచి పదిరోజుల్లోపే దరఖాస్తు చేసుకున్న వారికి సెటిల్ అయ్యే అవకాశం ఉంది.
భీమా చేయించుకున్న వాళ్లు వాట్సాప్ నెంబర్ 81066 02976 నెంబర్‌కుగానీ, టోల్ ఫ్రీ నెంబర్ 92400 21400 నెంబర్‌కుగానీ సంప్రదించి వివరాలు పొందేలా ఏర్పాట్లు చేశారు. వరదల వల్ల అతలాకుతలం అయిన బాధితులకు ఇది ఎంతగానో మేలు చేకూరుస్తుందని పలువురు పేర్కొంటున్నారు. ద్విచక్ర వాహనాలకు రూ.7 వేలు లోపు, ఆటోలు, ఫోర్ వీలర్స్‌కు రూ.15 వేలు లోపు అయితే వెంటనే సెటిల్ చేస్తామని బీమా సంస్థలు చెబుతున్నాయి. రూ.10 లక్షలుపైన ఇన్సురెన్స్ చేయించుకున్న వారితో మాట్లాడి వారు ఓకే అంటే కొంచెం అటు, ఇటుగా సెటిల్మెంట్ చేయించేందుకు సిద్ధంగా ఉన్నట్టు బీమా సంస్థలు చెబుతున్నాయి. ఏది ఏమైనా వాహనాలు, ఇతర వస్తువులకు బీమా చెల్లించేలా ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తుండడం బాధితులకు మేలు కలుగుతుందని చెబుతున్నారు.