నియోజకవర్గాల పునర్విభజనపై స్టాలిన్ పోరు.. దక్షిణాది రాష్ట్రాల నేతలకు పిలుపు

జనాభా ప్రాతిపదికన నియోజకవర్గం కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్న నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పోరుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే నియోజకవర్గాల పునర్విభజన అంశంపై చర్చించేందుకు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, 29 పార్టీల అధినేతలకు ఆహ్వానాన్ని పంపించారు. ఇటీవల నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో చేసిన తీర్మానం మేరకు ఉమ్మడి కార్యాచరణ కమిటీ ఏర్పాటు చేసి తగిన నిర్ణయం తీసుకోవాలని భావించారు. ఈ నేపథ్యంలో ఈనెల 22న చెన్నైలో సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి హాజరుకావాలని కోరుతూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేరళ సీఎం విజయన్, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, పశ్చిమబెంగాల్ సీఎం మమత, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, ఒడిశా సీఎం మోహన్ చంద్రలకు ఆయన ఆహ్వాన లేఖలు పంపించారు.

Tamil Nadu Chief Minister MK Stalin

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్

జనాభా ప్రాతిపదికన నియోజకవర్గం కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్న నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పోరుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే నియోజకవర్గాల పునర్విభజన అంశంపై చర్చించేందుకు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, 29 పార్టీల అధినేతలకు ఆహ్వానాన్ని పంపించారు. ఇటీవల నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో చేసిన తీర్మానం మేరకు ఉమ్మడి కార్యాచరణ కమిటీ ఏర్పాటు చేసి తగిన నిర్ణయం తీసుకోవాలని భావించారు. ఈ నేపథ్యంలో ఈనెల 22న చెన్నైలో సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి హాజరుకావాలని కోరుతూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేరళ సీఎం విజయన్, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, పశ్చిమబెంగాల్ సీఎం మమత, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, ఒడిశా సీఎం మోహన్ చంద్రలకు ఆయన ఆహ్వాన లేఖలు పంపించారు. ఉమ్మడి కార్యాచరణ కమిటీ ఏర్పాటుకు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆమోదం తెలపాలని, అదే సమయంలో ఆయా రాష్ట్రాలకు చెందిన రాజకీయ పార్టీలు ఈ కమిటీలు తమ తరఫున ప్రతినిధులను సభ్యులుగా నియమించేందుకు ప్రతిపాదనలు పంపించాలని స్టాలిన్ విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించబోయే నియోజకవర్గాల పునర్విభజన ఫెడరల్ రాజ్యాంగ విధానానికి వ్యతిరేకమైందని, ఈ వ్యవహారాన్ని రాజకీయపరంగా, చట్టపరంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. 2021 లో జరగాల్సిన జనగణన ఆలస్యం కావడంతో నియోజకవర్గాల పునర్విభజన 31 లో జరగనున్న జనగణన ప్రకారం జరుగుతుందని భావించామని, అయితే అంతకంటే ముందే పునర్విభజన చేపట్టను ఉండడంతో దక్షిణాది రాష్ట్రాలకు నష్టం వాటిల్లడం ఖాయమని ఆయన పేర్కొన్నారు. 

కుటుంబ నియంత్రణ పథకాలను సమర్ధవంతంగా అమలు చేసి జనాభా పెరుగుదలను నియంత్రించిన రాష్ట్రాలకు తీరని నష్టం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పునర్విభజనకు తాము వ్యతిరేకం కాదని, అయితే అప్రదా స్వామికంగా చేపడుతున్న పునరువ విభజన వ్యతిరేకిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. జనాభా నియంత్రణను సమర్ధవంతంగా పాటించినందుకు మనకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ కూర్చోకూడదు అని స్టాలిన్ వ్యాఖ్యరించారు. స్టాలిన్ లేక రాసిన వారిలో మాజీ సీఎం జగన్, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్, పుదుచ్చేరి సీఎం ఎన్ రంగస్వామి, ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి శివకుమార్, జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బిజెపి తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా ఉన్నారు. వీరితోపాటు కర్ణాటక, కేరళ, పశ్చిమబెంగాల్, ఒడిశా, పంజాబ్ తదితర రాష్ట్రాలకు చెందిన వివిధ పార్టీల నేతలు కూడా స్టాలిన్ ఆహ్వాన లేఖలు రాశారు. మరి ఈ లేఖలపై ఆయా నేతలు ఎలా స్పందిస్తారు అన్నది చూడాల్సి ఉంది. సమావేశానికి ఎన్ని పార్టీలకు చెందిన నేతలు హాజరవుతారన్న దానిపై కూడా సర్వత్ర ఆసక్తి నెలకొంది. ఈ లేఖ రాసిన వారిలో ఎక్కువమంది ఎన్డీఏ పక్ష పార్టీలకు చెందిన వారు ఉన్నారు. వారంతా బిజెపికి వ్యతిరేకంగా ఈ నిర్వహిస్తున్న ఈ సమావేశంలో పాల్గొంటారా లేదా అన్నది ఆసక్తిగా నెలకొంది. భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకం కాకపోయినప్పటికీ ఆ పార్టీ తీసుకోబోతున్న నిర్ణయానికి వ్యతిరేకంగా నిర్వహిస్తున్న సమావేశం కావడంతో ఆయా పార్టీలకు చెందిన నేతలు హాజరపై సర్వత్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్