||ప్రతీకాత్మక చిత్రం||
నిరుద్యోగులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) శుభవార్త తెలిపింది. 5,369 ఉద్యోగుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు మార్చి 27 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఇన్వెస్టిగేటర్ గ్రేడ్-2, డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్, లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, అకౌటెంట్, రీసెర్చి ఇన్వెస్టిగేటర్, టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు వివిధ విద్యార్హతలతో పోస్ట్లు ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ లో విద్యార్హత, వయసు, ఎంపిక విధానం, పరీక్ష విధానాన్ని తెలిపింది.
మొత్తం ఉద్యోగాలు : 5,369
పోస్టుల వివరాలు :
ఇన్వెస్టిగేటర్ గ్రేడ్-II, డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్, లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, హిందీ టైపిస్ట్, సౌండ్ టెక్నీషియన్, అకౌంటెంట్, ప్లానింగ్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్, టెక్స్టైల్ డిజైనర్, రీసెర్చ్ ఇన్వెస్టిగేటర్, రీసెర్చ్ అసిస్టెంట్, లాబొరేటరీ అసిస్టెంట్, జూనియర్ కంప్యూటర్, లైబ్రరీ-కమ్-ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్లాంట్ ప్రొటెక్షన్ ఆఫీసర్, జూనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్, డ్రాఫ్ట్స్ మాన్, ప్రాసెసింగ్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్, అసిస్టెంట్ వెల్ఫేర్ అడ్మినిస్టేటర్, నావిగేషనల్ అసిస్టెంట్.
దరఖాస్తు ప్రారంభం : మార్చి 6వ తేదీ,
దరఖాస్తు చివరి తేదీ : మార్చి 27వ తేదీ,
దరఖాస్తుల్లో పొరపాట్లు : ఏప్రిల్ 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు సరిదిద్దుకొనేందుకు అవకాశం కల్పిస్తోంది.
దరఖాస్తు విధానం : ఆన్ లైన్
దరఖాస్తు ఫీజు : 100
విద్యార్హత : మెట్రిక్యులేషన్, హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్, గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత పోస్టును బట్టి విద్యార్హత ఉంటుంది.
వయస్సు : 18-30 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం :
స్కిల్ టెస్ట్/ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్/ డేటా ఎంట్రీ టెస్ట్/ కంప్యూటర్ పరీక్ష ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
అధికారిక వెబ్‌సైట్ : https://ssc.nic.in/