స్పిరిట్‌లో మెగాస్టార్.. సందీప్ రెడ్డి క్లారిటీ
ప్రతీకాత్మక చిత్రం
టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తన తర్వాతి సినిమాను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా ఈ సినిమా నుంచి ఓ ఆడియో టీజర్ రిలీజ్ చేసి సినిమాపై భారీ బజ్ ను క్రియేట్ చేశారు సందీప్ రెడ్డి వంగా. స్పిరిట్ టీజర్ తో కేవలం టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా మంచి హైప్ ను అందుకోగలిగారు. స్పిరిట్ సినిమా ఇంకా సెట్స్ పైకి కూడా వెళ్లుకుండానే భారీ అంచనాలు నెలకొనగా, గత కొన్నాళ్లుగా ఈ సినిమా పై ఓ క్రేజీ రూమర్ నెట్టింట వినిపిస్తోంది. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి స్పిరిట్ సినిమాలో నటించనున్నారని, ఈ సినిమాలో ఆయన ప్రభాస్ కు తండ్రి పాత్రలో కనిపిస్తారని వార్తలు రావడంతో స్పిరిట్ పై ఉన్న హైప్ ఇంకాస్త పెరిగింది. అయితే ఈ వార్తలపై రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో సందీప్ రెడ్డి వంగా క్లారిటీ ఇచ్చారు. స్పిరిట్ మూవీలో చిరంజీవి ప్రభాస్ తండ్రిగా చేయడం లేదని, అసలు స్పిరిట్ సినిమాలో చిరంజీవి గారు ఏ పాత్రలోనూ కనిపించబోవడం లేదని, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నీ పుకార్లేనని చెప్పారు. అయితే తాను చిరంజీవితో కలిసి వేరే సినిమా చేస్తానని సందీప్ క్లారిటీ ఇచ్చారు.