హైదరాబాద్ నుంచి విమానంలో అయోధ్య వెళ్లాలనుకునే తెలుగు యాత్రికులకు బ్యాడ్ న్యూస్

అయోధ్య శ్రీరాముడి దర్శనం కోసం హైదరాబాద్ నుంచి అయోధ్యకు విమానంలో వెళ్లాలనుకునే తెలుగు యాత్రికులకు బ్యాడ్ న్యూస్. హైదరాబాద్ నుంచి అయోధ్యకు గతంలో ప్రారంభించిన విమాన సేవలను రద్దు చేసినట్లు స్పైస్‌జెట్ యాజమాన్యం ప్రకటించింది.

spicejet ayodhya

హైదరాబాద్-అయోధ్య విమానం రద్దు

హైదరాబాద్, ఈవార్తలు : అయోధ్య శ్రీరాముడి దర్శనం కోసం హైదరాబాద్ నుంచి అయోధ్యకు విమానంలో వెళ్లాలనుకునే తెలుగు యాత్రికులకు బ్యాడ్ న్యూస్. హైదరాబాద్ నుంచి అయోధ్యకు గతంలో ప్రారంభించిన విమాన సేవలను రద్దు చేసినట్లు స్పైస్‌జెట్ యాజమాన్యం ప్రకటించింది. హైదరాబాద్ నుంచి అయోధ్యకు వెళ్లేవారు ఎక్కువగా లేకపోవడం వల్లే ఈ విమానాన్ని రద్దు చేసినట్లు వెల్లడించింది. తగిన డిమాండ్ లేకపోవడం వల్ల జూన్ 1 నుంచే ఈ సేవలు నిలిపివేసినట్లు తెలిపింది. అయితే, చెన్నై- అయోధ్య విమాన సేవలు మాత్రం కొనసాగిస్తున్నామని వివరించింది. వాస్తవానికి.. ఏప్రిల్‌లో వారానికి మూడు రోజుల చొప్పున హైదరాబాద్ నుంచి అయోధ్యకు స్పైస్ జెట్ నాన్ స్టాప్ విమాన సేవలను ప్రారంభించిన సంగతి తెలిసిందే.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్