గడిచిన కొన్నాళ్లుగా అనేక అనారోగ్య సమస్యలు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ముఖ్యంగా మహిళలను క్యాన్సర్ వంటి మహమ్మారులు భయపెడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మహిళలకు ఆరోగ్య భీమాను కల్పించేందుకు సరికొత్త స్కీం అందుబాటులోకి వచ్చింది. ఈ పథకం ద్వారా క్యాన్సర్ సహా 60 క్రిటికల్ అనారోగ్యాలకు కవరేజీ లభించేలా బజాజ్ అలయంజ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రత్యేక పాలసీని ప్రవేశపెట్టింది. దీని పేరు బజాజ్ అలయంజ్ లైఫ్ సూపర్ ఉమెన్ టర్మ్ (ఎస్డబ్ల్యూటి) ప్లాన్. ఇది సాంప్రదాయ జీవిత బీమా పరిధికి మించి ధర్మ ఇన్సూరెన్స్ ప్రయోజనాలను, మహిళలకు మాత్రమే పరిమితమయ్యే తీవ్రమైన అనారోగ్యాలకు సంబంధించిన బెనిఫిట్స్ అందించనుంది.
ప్రతీకాత్మక చిత్రం
గడిచిన కొన్నాళ్లుగా అనేక అనారోగ్య సమస్యలు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ముఖ్యంగా మహిళలను క్యాన్సర్ వంటి మహమ్మారులు భయపెడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మహిళలకు ఆరోగ్య భీమాను కల్పించేందుకు సరికొత్త స్కీం అందుబాటులోకి వచ్చింది. ఈ పథకం ద్వారా క్యాన్సర్ సహా 60 క్రిటికల్ అనారోగ్యాలకు కవరేజీ లభించేలా బజాజ్ అలయంజ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రత్యేక పాలసీని ప్రవేశపెట్టింది. దీని పేరు బజాజ్ అలయంజ్ లైఫ్ సూపర్ ఉమెన్ టర్మ్ (ఎస్డబ్ల్యూటి) ప్లాన్. ఇది సాంప్రదాయ జీవిత బీమా పరిధికి మించి ధర్మ ఇన్సూరెన్స్ ప్రయోజనాలను, మహిళలకు మాత్రమే పరిమితమయ్యే తీవ్రమైన అనారోగ్యాలకు సంబంధించిన బెనిఫిట్స్ అందించనుంది. అలాగే ఆప్షనల్ చైల్డ్ కేర్ బెనిఫిట్ మొదలైన వాటితో ఆర్థిక భద్రతను ఇది అందిస్తుంది. ఈ హెల్త్ ఇన్సూరెన్స్ లో భాగంగా సమగ్ర హెల్త్ చెకప్ లు, ఓపిడి కన్సల్టేషన్లు, ఎమోషనల్ వెల్నెస్ ప్రోగ్రాములు, న్యూట్రిషన్ ఈస్ట్ గైడెన్స్ మొదలైనవన్నీ కవర్ అయ్యేలా ఈ పథకంలో ఉపయోగాలు ఉన్నాయి. హెల్త్ మేనేజ్మెంట్ సర్వీసులను కాంప్లిమెంటరీగా అందించనుంది.
మహిళలకు ఆరోగ్య భద్రతను కల్పించే ఉద్దేశంతో ఈ స్కీంను బజాజ్ సంస్థ తీసుకువచ్చింది. గడిచిన కొన్నాళ్లుగా మహిళలు వివిధ రకాల అనారోగ్య సమస్యలతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా క్యాన్సర్లు మహిళలను తీవ్రంగా వేధిస్తున్నాయి. రొమ్ము క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ వంటివి మహిళల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయి. ఎంతోమందికి బీమా సదుపాయం లేకపోవడంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇటువంటి ఇబ్బందుల నుంచి ఉపశమనం కలిగించేలా బజాజ్ సంస్థ ఈ ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని తీసుకువచ్చింది. తక్కువ మొత్తం చెల్లించి ఈ స్కీం ద్వారా ప్రయోజనాలను పొందవచ్చు. మహిళలు ఈ స్కీంను సద్వినియోగం చేసుకోండి మరి.