ఆరేళ్లలోపు పిల్లలకు ప్రీమిటివ్ ట్రైబల్ గ్రూప్ (పివిటిజి)లకు ఆధార్ నమోదు ప్రక్రియ చేపట్టేందుకు ప్రత్యేక ఆధార్ క్యాంపులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ నిర్ణయాలకు అనుగుణంగా ప్రత్యేక ఆధార్ క్యాంపులు ఏర్పాటు చేసేందుకు గ్రామ / వార్డు సచివాలయ శాఖ అధికారులు కలెక్టర్లకు లేఖలు రాశారు. ఇప్పటికే మార్చి నెలలో ఆధార్ క్యాంపులు ఏర్పాటు చేశామని ప్రభుత్వానికి వెల్లడించడంతోపాటు.. ఏప్రిల్ 3 నుంచి 5 వరకు, 8 నుంచి 11 వరకు ఈ ప్రత్యేక క్యాంపులను నిర్వహిస్తామని వెల్లడించింది. ఈ క్యాంపులను ఆయా అంగన్వాడీ కేంద్రాలు, స్కూల్ వద్ద ఏర్పాటు చేయనున్నారు.
ప్రతీకాత్మక చిత్రం
ఆరేళ్లలోపు పిల్లలకు ప్రీమిటివ్ ట్రైబల్ గ్రూప్ (పివిటిజి)లకు ఆధార్ నమోదు ప్రక్రియ చేపట్టేందుకు ప్రత్యేక ఆధార్ క్యాంపులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ నిర్ణయాలకు అనుగుణంగా ప్రత్యేక ఆధార్ క్యాంపులు ఏర్పాటు చేసేందుకు గ్రామ / వార్డు సచివాలయ శాఖ అధికారులు కలెక్టర్లకు లేఖలు రాశారు. ఇప్పటికే మార్చి నెలలో ఆధార్ క్యాంపులు ఏర్పాటు చేశామని ప్రభుత్వానికి వెల్లడించడంతోపాటు.. ఏప్రిల్ 3 నుంచి 5 వరకు, 8 నుంచి 11 వరకు ఈ ప్రత్యేక క్యాంపులను నిర్వహిస్తామని వెల్లడించింది. ఈ క్యాంపులను ఆయా అంగన్వాడీ కేంద్రాలు, స్కూల్ వద్ద ఏర్పాటు చేయనున్నారు. 1.95 లక్షల మంది పిల్లలు పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం కలిగి ఉన్నారు. వారందరికీ ఆధార్ నమోదు పెండింగ్లో ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈ ప్రత్యేక ఆధార్ నమోదు క్యాంపులు ద్వారా వీటికి సంబంధించిన పెండింగ్లో ఉన్న ఆధార సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అలాగే పది జిల్లాలకు సంబంధించిన 34, 995 మంది పివిటిజీలకు ఆధార్ కార్డులో లేవని గిరిజన సంక్షేమ శాఖ డేటా ఇచ్చింది.
గతంలో ఆధార్ కార్డులు లేని పివిటిజీలకు, పిల్లలకు ఆధార్ కార్డులు ఇవ్వాలని సీఎం ఆదేశించినట్లు పేర్కొన్నారు. తాజా నిర్ణయం వల్ల లక్షలాది మంది చిన్నారులకు మేలు చేకూరుతుంది. ఆధార్ లో మార్పులు చేర్పులకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా వేలాదిమంది చిన్నారులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికీ ప్రైవేటు కేంద్రాలకు వెళ్లి చాలామంది మార్పులు చేయించుకుంటున్నారు. కొన్నిచోట్ల అనేక ఇబ్బందులు వారికి ఎదురవుతున్నాయి. అటువంటి వాటిని పరిష్కరించే దిశగా ప్రభుత్వం ఆధార నమోదుకు సంబంధించి ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇది అనేక రకాల ఇబ్బందులకు పరిష్కారాన్ని ఇస్తుందని పలువురు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఆధార్ లో ఉన్నటువంటి కొన్ని రకాల మార్పులు, ఆధార్ కార్డుల నమోదు ప్రక్రియకి సంబంధించిన కొన్ని రకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ ప్రత్యేక క్యాంపు ల ద్వారా వీటికి పరిష్కారాన్ని చూపించేందుకు అవకాశం కలుగుతుంది.
ఈ ప్రక్రియతో ఎంతో మేలు..
ప్రభుత్వం ఆధార నమోదుకు సంబంధించి ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేయాలని తీసుకున్న నిర్ణయం వల్ల రాష్ట్రవ్యాప్తంగా లక్షలాదిమంది చిన్నారులకు మేలు చేకూరుతుంది. అప్పుడే పుట్టిన చిన్నారులకు కొత్తగా ఆధార్ కార్డులు మంజూరు చేయడంతో పాటు కొన్నిరకాల మార్పులను ఈ ప్రత్యేక క్యాంపుల్లో చేసుకునే అవకాశం కల్పిస్తోంది ప్రభుత్వం. ఇందుకోసం ప్రత్యేకంగా గ్రామ వార్డు సచివాల శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల మూడు నుంచి ఐదు వరకు మూడు రోజులు పాటు, ఆ తర్వాత ఎనిమిది నుంచి 11 వరకు నాలుగు రోజులు పాటు ఈ ప్రత్యేక క్యాంపులు నిర్వహించనున్నారు. ప్రతిరోజు ఆయా గ్రామ వార్డు సచివాలయ పరిధిలోని కనీసం 10 నుంచి 20 మంది చిన్నారులకు ఈ క్యాంపు ల ద్వారా లబ్ధి చేకూర్చే ప్రయత్నాన్ని చేయాలని ప్రభుత్వం సూచించింది. అందుకు అనుగుణంగానే గ్రామ వార్డు సచివాల శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు..