Happy Retirement | దక్షిణ మధ్య రైల్వే గుంటూరు డివిజన్ సీటీఐ స్క్వార్డ్‌గా ఎస్ఎమ్ సుభానీ పదవీ విరమణ

evarthalu
ప్రతీకాత్మక చిత్రం

||ఎస్ఎమ్ సుభానీ సీటీఐ స్క్వార్డ్- ఎస్‌సీఆర్ గుంటూరు డివిజన్||

ఈవార్తలు, గుంటూరు: భారతీయ రైల్వే శాఖలోని దక్షిణ మధ్య రైల్వే(ఎస్‌సీఆర్)-గుంటూరు డివిజన్‌లో సీటీఐ స్క్వార్డ్‌గా పనిచేస్తున్న ఎస్ఎమ్ సుభానీ బుధవారం పదవీ విరమణ చేశారు. టికెట్ చెకింగ్ స్టాఫ్‌లో వివిధ హోదాల్లో పనిచేసిన ఆయన ఎంతో నిబద్ధతతో విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం ఆయన సీటీఐ స్క్వార్డ్‌గా పనిచేస్తున్నారు. బుధవారం (31 మే 2023) తన ఉద్యోగంలో చివరి రోజు విధులను విజయవంతంగా నిర్వర్తించారు. ఆయన చేసిన సేవలను కొనియాడుతూ తోటి ఉద్యోగులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సుభానీకి, ఆయన కుటుంబసభ్యులు అమర్ జహా, అస్లాం, సనా, మొబిన్, నీలోఫర్, అక్రమ్ శుభాకాంక్షలు తెలిపారు. పదవీ విరమణ సందర్భంగా సుభానీ మాట్లాడుతూ.. తన వృత్తి జీవితంలో కుటుంబసభ్యుల పాత్ర ఎనలేనిదని వెల్లడించారు. విధి నిర్వహణలో తోడుగా నిలిచిన తోటి సిబ్బంది, ఉన్నతాధికారులకు ధన్యవాదాలు తెలిపారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్