భారతీయుల్లో స్మార్ట్ ఫోన్ వ్యసనం పెరుగుతోంది. గత కొన్నాళ్లుగా స్మార్ట్ఫోన్ ఎక్కువ సమయం వినియోగిస్తున్న వారి సంఖ్య పెరుగుతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా స్మార్ట్ ఫోన్ ను అన్ని వర్గాల ప్రజలు వినియోగిస్తున్నారు. ఒకప్పుడు యువత, ఉద్యోగులకు మాత్రమే పరిమితమైన స్మార్ట్ ఫోన్స్. ఇప్పుడు అన్ని వర్గాల వారికి అందుబాటులోకి వచ్చాయి. అయితే భారతీయుల్లో పరిమితికి మించి వినియోగిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు స్మార్ట్ ఫోన్ లేకుండా ఉండలేకపోతున్న పరిస్థితి ఉంది. అయితే భారతీయుల్లో ఇది మరింత ఇబ్బందికరంగా ఉన్నట్లు చెబుతున్నారు. భారతీయులు గంటలు తరబడి స్మార్ట్ ఫోన్ తో గడుపుతున్నట్లు పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
ప్రతీకాత్మక చిత్రం
భారతీయుల్లో స్మార్ట్ ఫోన్ వ్యసనం పెరుగుతోంది. గత కొన్నాళ్లుగా స్మార్ట్ఫోన్ ఎక్కువ సమయం వినియోగిస్తున్న వారి సంఖ్య పెరుగుతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా స్మార్ట్ ఫోన్ ను అన్ని వర్గాల ప్రజలు వినియోగిస్తున్నారు. ఒకప్పుడు యువత, ఉద్యోగులకు మాత్రమే పరిమితమైన స్మార్ట్ ఫోన్స్. ఇప్పుడు అన్ని వర్గాల వారికి అందుబాటులోకి వచ్చాయి. అయితే భారతీయుల్లో పరిమితికి మించి వినియోగిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు స్మార్ట్ ఫోన్ లేకుండా ఉండలేకపోతున్న పరిస్థితి ఉంది. అయితే భారతీయుల్లో ఇది మరింత ఇబ్బందికరంగా ఉన్నట్లు చెబుతున్నారు. భారతీయులు గంటలు తరబడి స్మార్ట్ ఫోన్ తో గడుపుతున్నట్లు పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. తాజా అధ్యయనం ప్రకారం భారతదేశంలో సుమారు 1.2 బిలియన్ స్మార్ట్ ఫోన్ యూజర్లు ఉన్నారు. అలాగే మరో 950 మిలియన్ ఇంటర్నెట్ యూజర్లు ఉన్నారు. తక్కువ ధరలో అందుబాటులో ఉండే మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్ ప్యాకేజీలు దేశంలో డిజిటలైజేషన్ ను వేగంగా పెంచుతున్నాయి. అయితే ఈ సౌకర్యాల కారణంగా చాలామంది భారతీయులు స్మార్ట్ ఫోన్లకు బానిసలై గంటల తరబడి స్మార్ట్ ఫోన్లలో నిమగ్నమైపోతున్నారు. గ్లోబల్ మేనేజ్మెంట్ సంస్థ ఈవై తాజాగా నిర్వహించిన అధ్యయనం ప్రకారం భారతీయులు మునుపెన్నడూ లేనంతగా స్మార్ట్ ఫోన్లను వినియోగిస్తున్నారని వెళ్లడైంది. ఈ పరిశోధన ప్రకారం భారతీయులు రోజుకు ఐదు గంటలు సోషల్ నెట్వర్కింగ్, గేమింగ్, వీడియోలు చూడడం వంటి కార్యకలాపాల్లో గడుపుతున్నారు. ఇంటర్నెట్ అందుబాటులోకి రావడం, డిజిటల్ యాక్సెస్ సులభతరం కావడం వల్ల మీడియా వినియోగం రూపాంతరం చెందుతుందని ఈ అధ్యయనం తెలియజేసింది.
డిజిటల్ ప్లాట్ఫామ్ విస్తరణ కారణంగా భారతదేశంలో మీడియా, ఎంటర్టైన్మెంట్ రంగంలో టీవీని దాటి డిజిటల్ మీడియా ముందంజలో ఉంది. 2024 నాటికి భారత డిజిటల్ మీడియా మార్కెట్ 2.5 ట్రిలియన్ల కు చేరుకుంటుందని ఈవై అధ్యయనం వెల్లడించింది. అంతేకాకుండా భారతీయులు రోజుకు తమ స్క్రీన్ టైంలో సుమారు 70 శాతం సమయం సోషల్ నెట్వర్కింగ్, వీడియోలు చూడడం, గేమింగ్ బంటి డిజిటల్ కార్యకలాపాలకు కేటాయిస్తున్నారని తేలింది. అంటే రోజుకు దాదాపు 5 గంటల సమయాన్ని ఈ కార్యకలాపాలకు వెచ్చిస్తున్నారు. తాజా పరిశోధన ప్రకారం భారతదేశంలోనే అతిపెద్ద డిజిటల్ మార్కెట్ గా మారింది. 2024 నాటికి భారతీయులు 1.1 ట్రిలియన్ గంటలు డిజిటల్ మీడియా వినియోగం చేశారు. రోజువారి మొబైల్ స్క్రీన్ టైం పరంగా భారతదేశ బ్రెజిల్, ఇండోనేషియా తర్వాత మూడో స్థానంలో ఉంది. డిజిటల్ మీడియా వినియోగం పెరుగుతుండగా టీవీ, ప్రింట్, రేడియో వంటి సాంప్రదాయ మీడియా ఆదాయం, మార్కెట్ షేర్ రెండు 2024 నాటికి తగ్గిపోయినట్లు ఈ అధ్యయనం తెలియజేస్తోంది.
ఈ గణాంకాలు డిజిటల్ యోగంలో మీడియా ధోరణిలలో గణనీయమైన మార్పులను సూచిస్తుంది. హైడల్ బెర్గ్, కులం యూనివర్సిటీ పరిశోధకులు స్మార్ట్ఫోన్ అధిక వినియోగంతో ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం ఉంటుందని అధ్యయనం చేశారు. 25 మంది యువకులను పరిశీలించి మూడు రోజులు పాటు స్మార్ట్ఫోన్ వాడకాన్ని తగ్గించడం వల్ల ఈ మార్పులు ఉన్నట్లు గమనించారు. ఎమ్మారై స్కాన్ ద్వారా మెదడు కార్యకలాపాలను విశ్లేషించారు. మెదడు రివార్డ్ సిస్టంలో మార్పు వచ్చినట్లు గుర్తించారు. ఫోన్ వాడకాన్ని తగ్గించడం వల్ల డొకోమో సమతుల్యంగా పనిచేసే ఒత్తిడి తగ్గుతున్నట్లు తేల్చారు. ఆసక్తులు, కోరికల నియంత్రణకు సంబంధించి డిజిటల్ డీటెక్స్ ద్వారా మానసిక శాంతి పెరుగుతుందని నిర్ధారించారు. ఒత్తిడి, ఆందోళన స్థాయిలు తగ్గి మానసిక స్థితిలో మెరుగుదల కనిపించింది. పనుల్లో ఏకాగ్రత, సామర్థ్యం మెరుగు కావడం ద్వారా ఏకాగ్రత ప్రోడక్టివిటీ పెరుగుతున్నట్లు తేల్చారు. అందువల్ల మానసిక ఆరోగ్యం కోసం మూడు రోజులపాటు స్మార్ట్ ఫోన్ వాడకాన్ని తగ్గించడం మంచిది అని నిపుణులు సూచిస్తున్నారు. ఫోన్ వాడకం తగ్గించడం ద్వారా నిద్ర నాణ్యత మెరుగుపడుతున్నట్లు తేల్చారు. ఒత్తిడి, నిద్రలేమి, ఏకాగ్రత లోపం ఉంటే వారానికి కనీసం మూడు రోజులు ఫోన్ వాడకాన్ని తగ్గించి చూడాలని ఈ పరిశోధకులు చెబుతున్నారు.