ఏపీలోనే రేషన్ కార్డు లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డును అందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఏటీఎం సైజులో కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయనున్నట్లు ఫోర్ సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఏప్రిల్ 30తో ఈ కేవైసీ ప్రక్రియ పూర్తయిన వెంటనే సీఎం చంద్రబాబు ఆమోదంతో ప్రస్తుతం ఉన్న కార్డుల స్థానంలో వీటిని జారీ చేయనున్నారు. ఇందులో క్యూఆర్ కోడ్ వంటి భద్రతా ఫీచర్లు ఉంటాయి. ప్రస్తుతం ఉన్న ఫ్యామిలీ రేషన్ కార్డునే సైజు తగ్గించి అన్ని వివరాలతో కొత్త కార్డులు జారీ చేయనున్నారు. కొత్త కార్డుల జారీ సమయంలోనే కుటుంబ సభ్యుల జోడింపు, తొలగింపు, స్పీట్ కార్డుల కోసం ఆప్షన్లు ఇస్తారు. గత ప్రభుత్వంలో మాదిరిగా ఎక్కడా వ్యక్తులు చిత్రాలు కార్డులపై ఉండబావని మంత్రి ప్రకటించారు. ఈ కేవైసీ పూర్తయిన తర్వాత ఎంతమందికి కార్డులు ఇవ్వాలనే దానిపై స్పష్టత రానుంది.
స్మార్ట్ రేషన్ కార్డు చూపిస్తున్న మంత్రి
ఏపీలోనే రేషన్ కార్డు లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డును అందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఏటీఎం సైజులో కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయనున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఏప్రిల్ 30తో ఈ కేవైసీ ప్రక్రియ పూర్తయిన వెంటనే సీఎం చంద్రబాబు ఆమోదంతో ప్రస్తుతం ఉన్న కార్డుల స్థానంలో వీటిని జారీ చేయనున్నారు. ఇందులో క్యూఆర్ కోడ్ వంటి భద్రతా ఫీచర్లు ఉంటాయి. ప్రస్తుతం ఉన్న ఫ్యామిలీ రేషన్ కార్డునే సైజు తగ్గించి అన్ని వివరాలతో కొత్త కార్డులు జారీ చేయనున్నారు. కొత్త కార్డుల జారీ సమయంలోనే కుటుంబ సభ్యుల జోడింపు, తొలగింపు, స్పీట్ కార్డుల కోసం ఆప్షన్లు ఇస్తారు. గత ప్రభుత్వంలో మాదిరిగా ఎక్కడా వ్యక్తులు చిత్రాలు కార్డులపై ఉండబావని మంత్రి ప్రకటించారు. ఈ కేవైసీ పూర్తయిన తర్వాత ఎంతమందికి కార్డులు ఇవ్వాలనే దానిపై స్పష్టత రానుంది. మరోవైపు రేషన్ బియ్యం అక్రమ రవాణా పై ఉక్కు పాదం మోపుతున్నట్లు మంత్రి వెల్లడించారు. బాధ్యులపై పిడి చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. అలాగే వాహనాలను సీజ్ చేస్తున్నారు. గత ప్రభుత్వం రూ.1600 కోట్లతో ఎండియు వాహనాలను కొనుగోలు చేసి దుర్వినియోగం చేసిందని ఇది పెద్ద కుంభకోణంగా మంత్రి పేర్కొన్నారు దీనిపై విచారణ చేపట్టినట్లు వెల్లడించారు త్వరలోనే ఒక నిర్ణయాన్ని ప్రకటిస్తామని మనోహర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ విధానం స్మార్ట్ గా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ కార్డుల వల్ల అవకతవకలకు అడ్డుకట్ట వేయవచ్చు అన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం వీటిని అందుబాటులోకి తీసుకువస్తోంది. కొద్దిరోజుల్లోనే ప్రక్రియను మొత్తం పూర్తిచేసి మే నుంచి కార్డులను మంజూరు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దీనిపై సీఎం చంద్రబాబు నాయుడుతో రెండు రోజుల్లో మంత్రి భేటీ కానున్నారు. ఈ సమావేశం తర్వాత దీనికి సంబంధించిన ప్రక్రియ ముందుకు వెళ్లే దానిపై కీలకమైన అడుగులు పడే అవకాశం ఉందని చెబుతున్నారు. పార్టీలకు సంబంధించిన నాయకులు ఫోటోలు లేకుండా, రంగులతో సంబంధం లేకుండా కార్డులను అందించాలన్న నిర్ణయం పట్ల సర్వత్ర హర్షణ వ్యక్తం అవుతుంది.
రెండో విడత దీపం-2 పథకం ప్రారంభం..
గడచిన ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్ల పంపిణీకి సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంటుంది. కొద్దిరోజుల్లోనే రెండో విడత దీపం 2 పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. మొదటి విడతలో 99.03 లక్షల మంది ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ పథకంలో భాగంగా లబ్ధిదారులకు ఖాతాల్లో రూ..760 ప్రభుత్వం నేరుగా జమ చేసింది. కొద్దిరోజుల్లోనే మిగిలిన మొత్తాలను జమ చేసేందుకు అనుగుణంగా చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలోనే మూడు నెలలు అదనంగా రెండు లక్షల గ్యాస్ కనెక్షన్లు నమోదయాయని ప్రభుత్వం గుర్తించింది. ఈకేవైసీ అర్హత విషయంలో ఎలాంటి సమస్యలు ఎదురైనా వాట్సాప్, ఆన్లైన్ ద్వారా నివృత్తి చేసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పిస్తోంది. ఈ క్రమంలోనే మంగళవారం నుంచి రెండో విడత దీపం 2 పథకాన్ని ప్రారంభించినట్లు మంత్రి వెల్లడించారు. దీపం 2 పథకంలో భాగంగా రెండో విడతలను లక్షలాదిమంది ప్రజలకు సబ్సిడీతో కూడిన గ్యాస్ ను అందించినట్లు ప్రభుత్వం ప్రకటించింది.