మార్కెట్లోకి నిద్రపుచ్చే రోబోలు.. దీని రేటు ఎంతో తెలుసా.!

కంటి నిండా నిద్ర ఉంటే అనేక అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చు. ఉరుకులు, పరుగుల జీవితం, సంపాదన యావలో పడి సరైన నిద్ర కూడా పోలేని పరిస్థితి ఎంతోమందికి ఉంది. ఇప్పటికీ ఎంతోమంది నిద్ర మాత్రలు వేసుకుంటే కానీ నిద్ర పట్టని పరిస్థితి. యువత అయితే సరైన నిద్ర కోసం అనేక ఇబ్బందులు పడాల్సిన దుస్థితి నెలకొంది. కలత నిద్రతో జరిగే కీడు కూడా ఎంతో ఉంది. తాజాగా నిద్రలేమి సమస్యతో గుండె జబ్బులు కూడా వస్తున్నాయని తెలిపింది. ఈ క్రమంలోనే హాయిగా నిద్రపెట్టే కొన్ని స్మార్ట్ గాడ్జెట్స్ కూడా మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. వీటిలో నిద్రపుచ్చే రోబో ప్రస్తుతం అందరిని ఆకట్టుకుంటుంది.

Sleep Robot

 స్లీప్ రోబో

కంటి నిండా నిద్ర ఉంటే అనేక అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చు. ఉరుకులు, పరుగుల జీవితం, సంపాదన యావలో పడి సరైన నిద్ర కూడా పోలేని పరిస్థితి ఎంతోమందికి ఉంది. ఇప్పటికీ ఎంతోమంది నిద్ర మాత్రలు వేసుకుంటే కానీ నిద్ర పట్టని పరిస్థితి. యువత అయితే సరైన నిద్ర కోసం అనేక ఇబ్బందులు పడాల్సిన దుస్థితి నెలకొంది. కలత నిద్రతో జరిగే కీడు కూడా ఎంతో ఉంది. తాజాగా నిద్రలేమి సమస్యతో గుండె జబ్బులు కూడా వస్తున్నాయని తెలిపింది. ఈ క్రమంలోనే హాయిగా నిద్రపెట్టే కొన్ని స్మార్ట్ గాడ్జెట్స్ కూడా మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. వీటిలో నిద్రపుచ్చే రోబో ప్రస్తుతం అందరిని ఆకట్టుకుంటుంది. మార్కెట్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఈ రోబో ప్రస్తుతం భారీగా విక్రమవుతోంది. ఈ రోబో అమ్మల మిమ్మల్ని జోకొట్టి, పాటలు పాడి, కథలు చెబుతుంది. అలాంటి వాటిలో ఒకటే ఈ సోమ్నాక్స్ స్లీప్ రోబో. ఇది మిమ్మల్ని నిద్రపోయే ముందు విశ్రాంతి తీసుకోవడానికి బాగా సహాయపడుతుంది.

ఈ రోబో  సంగీతం, కథలను వినిపిస్తూ నిద్రపుచ్చుతుంది. మెత్తగా, వెచ్చగా ఉండే వీటిని పక్కనే పట్టుకుని నిద్రపోతే ఎటువంటి భయం లేకుండా చాలా ధైర్యంగా ఉంటుంది. ఇందులో వివిధ ప్రకృతి శబ్దాలు, ఆహ్లాదకరమైన సంగీతం తో పాటు శ్వాస వ్యాయామాలు, ధ్యానం చేసేలా వ్యాల్యూ నియంత్రణలు, లైట్ నైట్ ఎంపికలు వంటి ఆప్షన్లు ఉన్నాయి. దీని ధర ప్రస్తుతం మార్కెట్లో 46,976 గా ఉంది. భారీ సంఖ్యలో ప్రస్తుతం మార్కెట్లో వీటివిక్రయాలు సాగుతున్నట్లు చెబుతున్నారు. వివిధ ఆన్లైన్ సంస్థలు కూడా వీటిని విక్రయిస్తున్నాయి. ముఖ్యంగా ఉన్నత వర్గాలకు చెందిన వారు వీటిని భారీగా కొనుగోలు చేస్తున్నట్లు చెబుతున్నారు. వీటిని కొనుగోలు చేస్తున్న వారిలో మహిళలు, పురుషులు ఉంటున్నారు. ఎక్కువగా ఉద్యోగాలు చేస్తున్న వారే వీటి పట్ల ఆసక్తిని చూపిస్తున్నారు. వీటిని కొనుగోలు చేసిన తర్వాత నిద్ర బాగుంటుందని చెబుతున్న వారి సంఖ్య అధికంగానే ఉంది. గతంతో పోలిస్తే నిద్ర భంగం వాటిల్లడం లేదని పలువురు పేర్కొంటున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్