దేశ రాజధానిగా ఢిల్లీ కొనసాగింపుపై కాంగ్రెస్ పార్టీ ఎంపీ శశిథరూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ రాజధానిగా ఢిల్లీ కొనసాగాల్సి ఉందా.? అంటూ ఆయన సందేహాన్ని వ్యక్తం చేశారు. దేశ రాజధానిలో వాయు కాలుష్యం గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ మేరకు ఆయన కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. తన అభిప్రాయాన్ని ట్విట్టర్ వేదికగా ఆయన పంచుకున్నారు.
ఎంపీ శశిథరూర్
దేశ రాజధానిగా ఢిల్లీ కొనసాగింపుపై కాంగ్రెస్ పార్టీ ఎంపీ శశిథరూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ రాజధానిగా ఢిల్లీ కొనసాగాల్సి ఉందా.? అంటూ ఆయన సందేహాన్ని వ్యక్తం చేశారు. దేశ రాజధానిలో వాయు కాలుష్యం గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ మేరకు ఆయన కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. తన అభిప్రాయాన్ని ట్విట్టర్ వేదికగా ఆయన పంచుకున్నారు. ఢిల్లీలో తీవ్రమైన వాయు కాలుష్యం, పొగ మంచు ప్రభావంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 494 కి పడిపోయింది. అనేక ప్రాంతాల్లో ఇది ఏకంగా 500 మార్కును దాటిపోయింది. ఆరేళ్లలో కాలుష్యం ఈ స్థాయికి చేరడం ఇది రెండోసారి మాత్రమే. ఈ నేపథ్యంలో ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై సర్వత్ర ఆందోళన వ్యక్తం అవుతుంది. ఇటువంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ శశిథరూర్ ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలో రెండో అత్యంత కలుషితమైన నగరంగా గుర్తింపు పొందిన డాకా కంటే ఢిల్లీలో ఐదు రెట్లు అధ్వానంగా పరిస్థితి ఉందంటూ ఆయన వ్యాఖ్యానించారు. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ మారిందని శశిథరూర్ పేర్కొన్నారు. ఇక్కడ ప్రమాదకర కాలుష్యకారకాలు నాలుగు రెట్లు పెరిగిపోయాయని వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితిని ఏళ్ల తరబడి చూస్తున్న కేంద్ర ప్రభుత్వం మాత్రం సమస్యను పరిష్కరించడంలో విఫలం అవ్వడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. దేశ రాజధానిని ఎవరూ పట్టించుకోవడం లేదంటూ అసహనాన్ని వ్యక్తం చేసిన ఆయన.. నవంబర్ నుంచి జనవరి మధ్య ఈ నగరం నివాస యోగ్యంగా ఉండట్లేదని పేర్కొన్నారు. మిగిలిన సమయాల్లోనూ అంతంతమాత్రంగానే జీవనం సాగించగలుగుతున్నామని, ఇలాంటి పరిణామాల మధ్య ఢిల్లీని ఇంకా దేశ రాజధానిగా కొనసాగించాలా అంటూ ఆయన ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఎంపీ శశిథరూర్ చేసిన ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. ఈ ట్వీట్లో మోస్ట్ పొల్యూటెడ్ మేజర్ సిటీ ర్యాంకింగ్స్ తో కూడిన జాబితాను ఆయన పోస్ట్ చేశారు.
ఇదిలా ఉంటే ఢిల్లీలో వాయు కాలుష్యంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కళ్ళల్లో మంటలు, గొంతులో గరగర, శ్వాస ఆడక పోవడం తదితర సమస్యలతో ఢిల్లీలోని ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పొగ మంచు కారణంగా ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించని పరిస్థితి నెలకొంది. తీవ్ర వాయు కాలుష్యంతో ఢిల్లీలో ఇప్పటికే పలు విమానాలు, రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తాజాగా ఢిల్లీలో వాయు కాలుష్యం పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఢిల్లీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. రోజురోజుకు వాయు నాణ్యత క్షీణిస్తున్న అధికారుల అలసత్వం ప్రదర్శించడం వల్ల తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది. పరిస్థితి విషమించిన గ్రాఫ్ - 4 నిబంధనలు అమ్మలలో అధికారులు జాప్యం చేస్తున్నారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఏక్యూఐ 450 దిగివకు వచ్చిన గ్రాఫ్ 4 నిబంధనలనే కొనసాగించాలని ఆదేశించింది. ఇకపోతే వాయు కాలుష్యం తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ఢిల్లీ ప్రభుత్వం పది, పన్నెండు తరగతులకు కూడా ఆన్లైన్లోనే తరగతులు నిర్వహించాలని ఆదేశించింది. మంగళవారం నుంచి ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తామని ఢిల్లీ సీఎం అతిశి వెల్లడించారు. ఏది ఏమైనా ఢిల్లీలో నెలకొన్న వాతావరణ పరిస్థితులు, పెరుగుతున్న కాలుష్యం ప్రజలతోపాటు ప్రభుత్వాలను కూడా ఆందోళనకు గురి చేస్తున్నాయి.