ఏపీలో నిరుద్యోగులకు షాక్.. మెగా డీఎస్సీ విడుదల వాయిదా.!

ఏపీలోనే నిరుద్యోగులు ఎప్పుడు ఎప్పుడు అని ఎదురుచూస్తున్న మెగా డీఎస్సీ విడుదల ప్రక్రియ వాయిదా పడినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో సుమారు 16 వేలకుపైగా ఖాలీలను భర్తీ చేసేందుకు ఏపీ ప్రభుత్వం బుధవారం డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసినందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈనెల ఆరో తేదీన మెగా డీఎస్సీ విడుదల చేస్తామని గతంలోనే ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే టెట్ ఫలితాలు కూడా విడుదలయ్యాయి.

Mega DSC Release Postponed

మెగా డీఎస్సీ వాయిదా

ఏపీలోనే నిరుద్యోగులు ఎప్పుడు ఎప్పుడు అని ఎదురుచూస్తున్న మెగా డీఎస్సీ విడుదల ప్రక్రియ వాయిదా పడినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో సుమారు 16 వేలకుపైగా ఖాలీలను భర్తీ చేసేందుకు ఏపీ ప్రభుత్వం బుధవారం డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసినందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈనెల ఆరో తేదీన మెగా డీఎస్సీ విడుదల చేస్తామని గతంలోనే ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే టెట్ ఫలితాలు కూడా విడుదలయ్యాయి. దీంతో గడిచిన ఏడేళ్ళుగా డీఎస్సీ కోసం ఎదురుచూస్తున్న ఆ సమయం రానే వచ్చిందని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న తరుణంలో మరోసారి వారికి షాక్ ఇచ్చే నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంది. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయకపోవడంతో ఈ ప్రక్రియ మరింత జాప్యం జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. బుధవారం విడుదల చేయవలసిన మెగా డీఎస్సీ ప్రకటనను అనివార్య కారణాలవల్ల వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ ప్రకటనతో లక్షలాదిమంది నిరుద్యోగులు నిరాశలో కూరుకుపోయారు.

సోమవారమే టెట్ ఫలితాలను అధికారులు ప్రకటించారు. ఈ ఫలితాల ప్రకటన సందర్భంలోనే బుధవారం టెట్ విడుదల ఉంటుందని అధికారులు వెల్లడించారు. అయితే అనూహ్యంగా బుధవారం ఈ ప్రకటన వాయిదా వేసినట్లు అధికారులు ప్రకటించడంతో నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. వాయిదా వేస్తున్నట్లు మాత్రమే ప్రకటించిన అధికారులు మళ్లీ ఎప్పుడు నోటిఫికేషన్ విడుదల చేస్తామనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు. ఇదే ఇప్పుడు అభ్యర్థుల ఆందోళనకు కారణం అవుతోంది. ప్రస్తుతానికి తాత్కాలికంగా వాయిదా వేసినట్లు మాత్రమే అధికారులు ప్రకటించారు. అయితే అధికారుల ప్రకటనకు కీలకమైన కారణం ఉందని చెబుతున్నారు. అదే ఎస్సీ రిజర్వేషన్ల అంశం. ఎస్సీ వర్గీకరణ అమలు చేసే వరకు ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల కు నోటిఫికేషన్ విడుదల చేయకూడదని ఎమ్మార్పీఎస్ డిమాండ్ చేస్తోంది. ఎస్సీ వర్గీకరణ పై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో వర్గీకరణ పూర్తయ్యే వరకు డీఎస్సీ ప్రకటన ఇవ్వడానికి వీలు లేదని స్పష్టం చేసింది ఎంఆర్పిఎస్. ఈ క్రమంలోనే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాదిగ సమావేశమయ్యారు.

ఈ సమావేశంలో డీఎస్సీ ప్రకటన వాయిదా వేయాలని ఆయన కోరినట్లు తెలిసింది. అందుకు అనుగుణంగానే ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెబుతున్నారు. డీఎస్సీ నియామకాల్లో ఎస్సీ రిజర్వేషన్ల అంశం కొలిక్కి రాకపోవడం, దీనిపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉండడంతోనే నోటిఫికేషన్ ప్రక్రియ ఆలస్యం అవుతున్నట్లు చెబుతున్నారు. ఈ ప్రక్రియ పూర్తయ్యేంతవరకు నోటిఫికేషన్ వెలువడే అవకాశం లేదని చెబుతున్నారు. ఇదే కారణం అయితే మాత్రం మరింత జాప్యం జరిగే అవకాశం ఉందన్న ఆందోళనను అభ్యర్థులు వ్యక్తం చేస్తున్నారు. గడచిన ఏడేళ్ళుగా డీఎస్సీ నోటిఫికేషన్ లేకపోవడంతో లక్షలాదిమంది నిరుద్యోగులు ఆశగా నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారు. టెట్ పూర్తయిన తర్వాత డిఎస్సీ కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులను మోసం చేసేలా మరోసారి వాయిదా వేయడం పట్ల వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిరుద్యోగుల ఇబ్బందులను గుర్తించి వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరుతున్నారు. ఇదిలా ఉంటే కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత తొలి రోజునే 16,317 పోస్టులను భర్తీ చేసేలా మెగా డీఎస్సీ విడుదలకు సంబంధించిన ఫైల్ పై సీఎం చంద్రబాబు నాయుడు సంతకం చేశారు. ఖాళీలను భారీగానే ప్రభుత్వం చూపించడంతో నిరుద్యోగులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇందులో 6,371 ఎస్జీటీ పోస్టులు కాగా, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 7725 ఉన్నాయి. టీజీటీ 1781, పిజిటి 286, ప్రిన్సిపల్ పోస్టులు 52, పీఈటి పోస్టులు 132 లో ఉన్నాయి. మరోసారి నోటిఫికేషన్ విడుదల వాయిదా పడడంతో నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్