ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో సీనియర్ నేతలకు షాక్.. సీట్లు వారికే.!

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు కొద్దిరోజుల్లో జరగనున్నాయి. ఏపీలో ఖాళీ అయిన ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఒకటి బిజెపికి, ఒకటి జనసేనకు కేటాయించిన టిడిపి మూడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇప్పటికే జనసేన అభ్యర్థిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు పేరు ఖరారు అయింది. బిజెపి అభ్యర్థిని ఖరారు చేయాల్సి ఉండగా.. టిడిపి కూడా ముగ్గురు అభ్యర్థులను ఖరారు చేసింది. అయితే ఎమ్మెల్సీ స్థానాలను ఆశించిన సీనియర్లకు ఆ పార్టీ అధిష్టానం షాక్ ఇచ్చింది. తొలినుంచి ఎమ్మెల్సీ సీటు తనకు దక్కుతుందని భావించిన యనమల రామకృష్ణుడు, పిఠాపురం ఎమ్మెల్యే స్థానాన్ని త్యాగం చేసిన వర్మ, బుద్ధ వెంకన్న, అబ్దుల్ నజీర్, మరి కొంతమంది సీనియర్ నేతలు తమకు అవకాశాలు దక్కుతాయని భావించారు.

TDP MLC candidates

టిడిపి ఎమ్మెల్సీ అభ్యర్థులు

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు కొద్దిరోజుల్లో జరగనున్నాయి. ఏపీలో ఖాళీ అయిన ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఒకటి బిజెపికి, ఒకటి జనసేనకు కేటాయించిన టిడిపి మూడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇప్పటికే జనసేన అభ్యర్థిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు పేరు ఖరారు అయింది. బిజెపి అభ్యర్థిని ఖరారు చేయాల్సి ఉండగా.. టిడిపి కూడా ముగ్గురు అభ్యర్థులను ఖరారు చేసింది. అయితే ఎమ్మెల్సీ స్థానాలను ఆశించిన సీనియర్లకు ఆ పార్టీ అధిష్టానం షాక్ ఇచ్చింది. తొలినుంచి ఎమ్మెల్సీ సీటు తనకు దక్కుతుందని భావించిన యనమల రామకృష్ణుడు, పిఠాపురం ఎమ్మెల్యే స్థానాన్ని త్యాగం చేసిన వర్మ, బుద్ధ వెంకన్న, అబ్దుల్ నజీర్, మరి కొంతమంది సీనియర్ నేతలు తమకు అవకాశాలు దక్కుతాయని భావించారు. అయితే వీరందరికీ అధిష్టానం షాక్ ఇచ్చింది. ముఖ్యంగా కావలి గ్రీష్మ, బీటీ నాయుడు, బీద రవిచంద్ర యాదవ్ పేర్లను అధిష్టానం ఖరారు చేసింది. దీంతో సీనియర్ నేతలు అంతా ఈ నిర్ణయం పట్ల తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. బాగా మాజీ ఎమ్మెల్సీ దువ్వాడ రామారావు కూడా తనకు అవకాశం దక్కుతుందని ఆశించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు క్రియాశీలకంగా పనిచేయడంతోపాటు పార్టీ కార్యక్రమాలను పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాం అన్న విషయాన్ని ఆయన చెబుతున్నారు. అలాగే ప్రతిపక్షంలో ఉండగా పార్టీ కోసం పనిచేయడంతో పాటు పార్టీ వాయిస్ను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లిన నేత బుద్ధ వెంకన్న. తనకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎమ్మెల్సీ అవకాశము దక్కుతుందని ఆయన భావించారు. అయితే ఆయనకు కూడా అధిష్టానం అనుక్యంగా షాక్ ఇచ్చింది. ఎమ్మెల్సీ స్థానాలపై ఆశలు పెట్టుకున్న నాయకులు ఏదైనా నిర్ణయం తీసుకుంటారన్న భయంతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు వెంటనే వారితో మాట్లాడారు. ఎంపిక చేసిన అభ్యర్థులకు చంద్రబాబు స్వయంగా ఫోన్ చేసే చెప్పినట్లు చెబుతున్నారు. వీరంతా సోమవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. 

ఇదిలా ఉంటే పిఠాపురంలో అసెంబ్లీ స్థానాన్ని త్యాగం చేసిన వర్మకు ఎమ్మెల్సీ సీటు రాకుండా చేయడంలో పవన్ కళ్యాణ్ గట్టిగానే కృషి చేసినట్లు చెబుతున్నారు. ఒకవేళ ఆయనకు ఎమ్మెల్సీ సీటు ఇస్తే ఇక్కడ రెండో పవర్ పాయింట్ పెరుగుతుందన్న ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ ఆయనకు రాకుండా అడ్డుపడ్డారని చెబుతున్నారు. అందుకు అనుగుణంగానే వర్మకు ఎమ్మెల్సీ సీటు ఇవ్వలేదని ప్రచారం జరుగుతుంది. గడిచిన ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ కోసం సీటు త్యాగం చేసిన వర్మకు తొలి ఎమ్మెల్సీ సీటు ఇస్తానని చంద్రబాబు నాయుడు వాగ్దానం చేశారు. ఆయన రాజకీయ భవిష్యత్తుకు హామీ ఉంటుందని పేర్కొన్నారు. అయితే ఇప్పటి వరకు ఆ హామీని అమలు చేసే దిశగా చర్యలు చేపట్టకపోవడం పట్ల సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా టిడిపి అగ్ర నాయకత్వం సీనియర్లకు షాక్ ఇచ్చి.. అస్మధీయులకు ఎమ్మెల్సీ స్థానాలను కట్టబెట్టుకుందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా టిడిపి ఎమ్మెల్సీ అభ్యర్థుల్లో ఒకరైన బీద రవిచంద్ర మంత్రి లోకేష్ కు అత్యంత సన్నిహితులు కావడంతో ఆయన పేరు ఖరారు చేశారు. లోకేష్ పాదయాత్ర సమయంలో రవిచంద్ర కీలకంగా వ్యవహరించారు. రాయలసీమ ప్రాంతం నుంచి ఒకరికైనా అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో షూటింగ్ ఎమ్మెల్సీ బీటీ నాయుడుకు అవకాశం ఇచ్చారు. మూడో స్థానాన్ని టిడిపి సీనియర్ నేత మాజీ స్పీకర్ ప్రతిభ భారత కుమార్తె గ్రీష్మను ఎంపిక చేశారు. దీనిపట్ల సీనియర్ నేతలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్