జగిత్యాల మార్కండేయ టెంపుల్‌లో ఫిబ్రవరి 2 నుంచి బ్రహ్మోత్సవాలు

evarthalu
ప్రతీకాత్మక చిత్రం

|| ఫిబ్రవరి 2 నుంచి భక్త మార్కండేయ దేవాలయం 47వ బ్రహ్మోత్సవాలు ||


ఈవార్తలు, జగిత్యాల న్యూస్: తెలంగాణలోని జగిత్యాల జిల్లా కేంద్రంలో భక్త మార్కండేయ దేవాలయం బ్రహ్మోత్సవాలకు సిద్ధం అవుతోంది. 46 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ ఆలయంలో ఫిబ్రవరి 2వ తేదీ నుంచి 6వ తేదీ వరకు ఆలయంలో 47వ పంచాహ్నిక శివ కల్యాణ బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 3వ తేదీన శివ పార్వతుల కల్యాణ మహోత్సవం నిర్వహించనున్నట్లు పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలోని శ్రీ భక్త మార్కండేయ దేవాలయ కమిటీ తెలిపింది. కుజ, రాహు, శని దోషాలు తొలగడానికి, వంశంలో కల్యాణ పరంపర జరగడానికి, వివాహ ఆటంకం ఉన్నవారు ఈ కల్యాణంలో పాల్గొంటే ఫలితం ఉంటుందని వెల్లడించింది.


బ్రహ్మోత్సవాల్లో తొలి రోజు మినహా అన్ని రోజుల్లో అన్నదాన కార్యక్రమం ఉంటుందని వివరించింది. 2వ తేదీన సామూహిక విష్ణు సహస్రనామం, 3న సామూహిక లలిత సహస్రనామ పారాయణం, శివపార్వతుల కల్యాణం, 4న సామూహిక శివ సహస్ర నామాలు,  5న సామూహిక శ్రీరామరక్ష స్తోత్రం, 6వ తేదీన పల్లకి సేవ, ఏకాంత సేవ నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ పేర్కొంది. 18వ తేదీన మహాశివరాత్రి సందర్భంగా శతఘటాభిషేకాలు, గండదీపం, భజనలు ఉంటాయని తెలిపింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని, కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరింది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్