సూపర్ సిక్స్ హామీల అమలపై ప్రశ్నించిన షర్మిల.. సీఎం చంద్రబాబుపై ధ్వజం

రాష్ట్రంలో సూపర్ సిక్స్ హామీలను అమలు చేయడంలో కోటమి ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందంటూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైయస్ షర్మిల పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజలను మోసం చేసేలా కూటమి పాలన సాగుతోందని ఆరోపించారు. ఈ మేరకు శుక్రవారం ట్విట్టర్ వేదికగా ఆమె కూటమి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఏరు దాటే దాకా ఓడ మల్లన్న.. దాటాక బోడి మల్లన్న’’ సామెతను తలపిస్తోంద ముఖ్యమంత్రి చంద్రబాబు తీరు ఉందన్నారు.

YS Sharmila

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైయస్ షర్మిల 

రాష్ట్రంలో సూపర్ సిక్స్ హామీలను అమలు చేయడంలో కోటమి ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందంటూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైయస్ షర్మిల పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజలను మోసం చేసేలా కూటమి పాలన సాగుతోందని ఆరోపించారు. ఈ మేరకు శుక్రవారం ట్విట్టర్ వేదికగా ఆమె కూటమి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఏరు దాటే దాకా ఓడ మల్లన్న.. దాటాక బోడి మల్లన్న’’ సామెతను తలపిస్తోంద ముఖ్యమంత్రి చంద్రబాబు తీరు ఉందన్నారు. ఎన్నికల్లో సూపర్ సిక్స్ అంటూ ఆర్భాటం చేసిన బాబు గారు అమలుకొచ్చేసరికి ఆదాయం పెరిగితేనే అంటూ మడతపేచి పెట్టారని విమర్శించారు. అప్పులు దొరకవని, ఆదాయం పెంచుకోవాలని, తలసరి ఆదాయం పెరగాలని, మనుషులు మన ఆస్తి అంటూ వింత వింత మాటలు చెప్తున్నారని ఆరోపించారు. ఆడలేక మద్దెల దరువన్నట్లుంది బాబుగారి వ్యవహారమని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై చంద్రబాబు గారిని సూటిగా ప్రశ్నిస్తున్నామన్నారు. ఎన్నికల్లో సూపర్ సిక్స్ హామీలు ఇచ్చే ముందు తెలియదా రాష్ట్రం రూ.10 లక్షల కోట్ల అప్పుల్లో ఉందని..? షర్మిల ప్రశ్నించారు.

సూపర్ సిక్స్ హామీలు అమలు చేయాలంటే తెలియదా ఏటా రూ.2 లక్షల కోట్లు అవసరం ఉందని..? పేర్కొన్నారు.  రాష్ట్ర బడ్జెట్ మొత్తం డైవర్ట్ చేసినా ఇంకా నిధుల కొరత ఉంటుందని తెలియదా..? విమర్శించారు. కేంద్రానికి మీరొక్కరే కాదని, తెలిసినప్పుడు ఎందుకు మద్దతు ఇచ్చారు ? షర్మిల ప్రశ్నించారు.  రాష్ట్రాన్ని సహాయ పడనప్పుడు మోడీతో చెట్టాపట్టాలు దేనికోసమని ప్రశ్నించారు. ప్రజలు ఓట్లేసి అధికారం ఇస్తే, ఏదో ఉద్ధరిస్తారని నమ్మకం పెట్టుకుంటే, హామీలను తుంగలో తొక్కి, విజన్ల పేరుతో , వృద్ధి రేట్ల సాకుతో కాలయాపన తప్పా.. బాబు గారి పనితనం శూన్యమని షర్మిల ఆరోపించారు. ఎప్పటికైనా రాష్ట్రానికి సంజీవని ప్రత్యేక హోదా అని షర్మిల మరోసారి స్పష్టం చేశారు. హోదాతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని, నిధులు పారాలన్నా, పరిశ్రమలు స్థాపన జరగాలన్నా, ప్రజల ఆదాయం పెరగాలన్నా ప్రత్యేక హోదా అవసరమన్నారు. యువతకు ఉద్యోగాలు రావాలన్నా, హోదా ఒక్కటే శరణ్యమని షర్మిల స్పష్టం చేశారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్