అదరగొట్టిన అంబానీ చాక్లెట్ కంపెనీ షేర్లు.. పదివేల పెట్టుబడి తొమ్మిది లక్షల రాబడి

ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక రంగాల్లోని చాలా కంపెనీల్లో పెట్టుబడులు పెట్టింది. అటువంటి వాటిలో లోటస్ చాక్లెట్ కంపెనీ ఒకటి. ఈ కంపెనీ తన షేర్ హోల్డర్లకు భారీ లాభాలను తాజాగా అందించింది. లోటస్ చాక్లెట్ కంపెనీ షేర్ ధర 2021 సెప్టెంబర్ లో రూ.35 ఉండగా, ఆప్పటి నుంచి ఇప్పటి వరకు 5,062 శాతం పెరిగి ప్రస్తుతం రూ.1807 కు చేరుకుంది. ఈ పెరుగుదలలో ఎక్కువ భాగం గత నాలుగు నెలల్లోనే వచ్చింది. ఈ నాలుగు నెలల్లో ఈ స్టాక్ 404 శాతం పెరిగింది.

Mukesh Ambani

ముఖేష్ అంబానీ

పదివేల రూపాయలు పెట్టుబడి పెడితే కొద్ది రోజుల్లోనే తొమ్మిది లక్షల రూపాయల ఆదాయాన్ని సముపార్జించి పెట్టిన కంపెనీ అది. వందలాది మంది జీవితాలు ఒక్కసారిగా ఆ కంపెనీ షేర్ విలువ పెరగడంతో మారిపోయింది. ఆ కంపెనీ భారత దేశ కుబేరుడు ముఖేష్ అంబానీ నేతృత్వంలోని లోటస్ చాక్లెట్ కంపెనీ. ఈ చాక్లెట్ కంపెనీలో పెట్టుబడులు పెట్టిన ఎంతోమందికి ఊహించిన రీతిలో లాభాలు అందాయి. షేర్లు విలువ ఒక్కసారిగా పెరిగిపోవడంతో కోటీశ్వరులు అయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక రంగాల్లోని చాలా కంపెనీల్లో పెట్టుబడులు పెట్టింది. అటువంటి వాటిలో లోటస్ చాక్లెట్ కంపెనీ ఒకటి. ఈ కంపెనీ తన షేర్ హోల్డర్లకు భారీ లాభాలను తాజాగా అందించింది. లోటస్ చాక్లెట్ కంపెనీ షేర్ ధర 2021 సెప్టెంబర్ లో రూ.35 ఉండగా, ఆప్పటి నుంచి ఇప్పటి వరకు 5,062 శాతం పెరిగి ప్రస్తుతం రూ.1807 కు చేరుకుంది. ఈ పెరుగుదలలో ఎక్కువ భాగం గత నాలుగు నెలల్లోనే వచ్చింది. ఈ నాలుగు నెలల్లో ఈ స్టాక్ 404 శాతం పెరిగింది.

రిలయన్స్ రిటైల్ వెంచర్స్(RRVL)ఎఫ్ఎంసిజి విభాగం అయిన రిలయన్స్ కన్జ్యూమర్ ప్రోడక్ట్ 2023 మార్చిలో రూ.74 కోట్లు ఖర్చుపెట్టి లోటస్ చాక్లెట్లు 51% వాటాను కొనుగోలు చేసింది. అప్పటి నుంచి ఈ కంపెనీ షేర్లు జెట్ స్పీడ్ దూసుకుపోతున్నాయి. మూడేళ్ల కిందట లోటస్ చాక్లెట్ స్టాక్ సుమారు రూ.35 వద్ద ట్రేడ్ అయింది. ఐదు సంవత్సరాల కిందట రూ.16 దగ్గర ఉంది. 2021 సెప్టెంబర్ 6న ఈ షేర్ విలువ రూ.35.15 వద్ద ముగిసింది. 2003 సెప్టెంబర్ లో ఈ షేర్ ధర కేవలం రెండు రూపాయలు మాత్రమే. ఒక వ్యక్తి 21 ఏళ్ల క్రితం ఈ స్టాక్ లో పదివేలు ఇన్వెస్ట్ చేసి దానిని అలాగే వదిలేస్తే ఇప్పుడు దాని విలువ రూ9 లక్షలపైగా చేరింది. లోటస్ చాక్లెట్ భారతదేశంలోని ప్రీమియం చాక్లెట్లు, కోకో ఉత్పత్తులను తయారు చేస్తుంది. స్థానిక బేకరీల నుంచి బహుళ జాతి కంపెనీల వరకు విస్తృత కస్టమర్లు దీని సొంతం. దేశంలో చాక్లెట్, మిఠాయిల పరిశ్రమ రూ.25 వేల కోట్లను అధిగమిస్తుంది అంచనా. దీనిలో చాక్లెట్ ది మూడింట రెండు వంతులు వాటా. ఈ పరిశ్రమ వచ్చే నాలుగేళ్లలో రూ.35 వేల కోట్లకుపైగా వృద్ధి చెందుతుందని మార్కెట్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. షేర్లు కొనుగోలు చేసినప్పుడు మార్కెట్ రిస్క్ కు అనుగుణంగా వ్యవహరించాల్సి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.  చేసినప్పుడు


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్