రికార్డు ధర పలికిన బాలాపూర్ లడ్డు.. రూ.30 లక్షలు వెచ్చించి సొంతం చేసుకున్న శంకర్ రెడ్డి

తెలంగాణలోని బాలాపూర్ గణేష్ లడ్డూ రికార్డు స్థాయి ధర పలికింది. ఏటా ఇక్కడ స్వామి వారికి పెట్టే లడ్డూను వేలం వేస్తుంటారు. 1980 నుంచి ఇక్కడ స్వామి వారిని ఏర్పాటు చేసి పూజలు నిర్వహిస్తుంటారు. పోటీలో ఉన్నది తక్కువ మందే అయినప్పటికీ పోటీ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. పోటీలో ఉన్న కొద్దిమంది లడ్డూ కోసం తీవ్ర స్థాయిలో పోటీపడ్డారు. దీంతో భారీ మొత్తానికి లడ్డు వేలం సాగింది. చివరకు రూ.30 లక్షల వెయ్యి రూపాయలకు కొలను శంకర్ రెడ్డి ఈ లడ్డును సొంతం చేసుకున్నారు.

Balapur Ganesh Laddu, Kolana Shankar Reddy

బాలాపూర్ గణేష్ లడ్డూ, కొలను శంకర్ రెడ్డి

తెలంగాణలోని బాలాపూర్ గణేష్ లడ్డూ రికార్డు స్థాయి ధర పలికింది. ఏటా ఇక్కడ స్వామి వారికి పెట్టే లడ్డూను వేలం వేస్తుంటారు. 1980 నుంచి ఇక్కడ స్వామి వారిని ఏర్పాటు చేసి పూజలు నిర్వహిస్తుంటారు. 1984 నుంచి స్వామివారికి నైవేద్యంగా పెట్టే లడ్డూను వేలం వేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ లడ్డును దక్కించుకోవడాన్ని చాలా మంది భక్తులు ప్రతిష్టాత్మకంగా భావిస్తుంటారు. దేశ వ్యాప్తంగా ఈ లడ్డు వేలాన్ని ఆసక్తిగా భక్తులు తిలకిస్తుంటారు. మంగళవారం బాలాపూర్ గణేశుడి లడ్డు వేలాన్ని నిర్వహించారు. గతంలో మాదిరిగానే రికార్డ్ స్థాయిలో ఈ ఏడాది లక్షలాది రూపాయలకు స్వామి వారి లడ్డూను భక్తులు వేలంలో దక్కించుకున్నారు. గతంలో పలికిన ధరలను చెరిపేస్తూ సరికొత్త రికార్డులను సృష్టిస్తూ ఈ ఏడాది స్వామి వారి లడ్డూ వేలం సాగింది. కొత్తగా తీసుకువచ్చిన రూల్ ప్రకారం ముందుగా గడిచిన ఏడాది లడ్డూ అమ్ముడుపోయిన ధర డబ్బులు డిపాజిట్ చేస్తేనే ఈసారి వేలంలో పాల్గొనే అవకాశం కల్పించారు. అందుకే చాలా తక్కువ మంది ఈ డబ్బులు డిపాజిట్ చేసి వేలంలో పాల్గొన్నారు. గతేడాది 27 లక్షలకు లడ్డూ వేలంలో అమ్ముడుపోయింది. దీంతో ఆ రూ.27 లక్షలు డిపాజిట్ చేసిన కొద్దిమంది మాత్రమే ఈ వేలంలో పాల్గొన్నారు. గత ఏడాది ఆక్షన్ లో పాల్గొన్న దయానంద రెడ్డి కూడా ఈసారి రూ.27 లక్షలు చెల్లించి వేలంలో పాల్గొన్నారు. పోటీలో ఉన్నది తక్కువ మందే అయినప్పటికీ పోటీ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. పోటీలో ఉన్న కొద్దిమంది లడ్డూ కోసం తీవ్ర స్థాయిలో పోటీపడ్డారు. దీంతో భారీ మొత్తానికి లడ్డు వేలం సాగింది. చివరకు రూ.30 లక్షల వెయ్యి రూపాయలకు కొలను శంకర్ రెడ్డి ఈ లడ్డును సొంతం చేసుకున్నారు. 

బాలాపూర్ లడ్డూ వేలం 1984 నుంచి జరుగుతూ వస్తోంది. తొలిసారి నిర్వహించిన వేలంలో ఒక భక్తుడు రూ.450 రూపాయలకు లడ్డూను దక్కించుకున్నారు. అలా మొదలైన బాలాపూర్ లడ్డూ వేలం పాట ఏటా సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. గతేడాది 21 కిలోల లడ్డు రూ.27 లక్షలకు దాసరి దయానంద రెడ్డి వేలంలో పాడుకున్నారు. ఇప్పుడు రూ.30 లక్షల వెయ్యి రూపాయలకు శంకర్ రెడ్డి సొంతం చేసుకున్నారు. గడిచిన ఏడాది దాసరి దయానంద రెడ్డి రూ.27 లక్షలకు లడ్డూను దక్కించుకోగా, అంతకుముందు ఏడాది వంగేటి లక్ష్మారెడ్డి రూ.24 లక్షల 60 వేల రూపాయలకు దక్కించుకున్నారు. 2021లో మర్రి శశాంక్ రెడ్డి, రమేష్ యాదవ్ రూ.18.90 లక్షలకు ఈ లడ్డును కైవసం చేసుకున్నారు  ఏటా కనీసం రెండు నుంచి మూడు లక్షలు అత్యధిక ధరకు ఈ లడ్డూను వేలంలో భక్తులు దక్కించుకుంటున్నారు. ఈ లడ్డు ప్రసాదాన్ని తీసుకోవడం ద్వారా అన్ని విధాల కలిసి వస్తోందన్న నమ్మకంతో ఈ లడ్డూ కోసం భక్తులు పోటీ పడుతుంటారు. దీంతో లక్షలాది రూపాయలకు ఈ లడ్డు వేలం చేరుతోంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్