పొగమంచు, పొల్యూషన్‌తో దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఉత్తరాది రాష్ట్రాల ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. ఢిల్లీ, యూపీ, పంజాబ్, హర్యానా , ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు దట్టమైన పొగమంచు విజుబులిటీ పూర్తిగా తగ్గింది.
ఢిల్లీ
- దేశ రాజధానిని కప్పేసిన కాలుష్యం
- పలు ఉత్తరాది రాష్ట్రాలో ఇదే పరిస్థితి
- 150 విమానాలు రద్దు.. ముందు ఏముందో తెలియని పరిస్థితి
న్యూఢిల్లీ: పొగమంచు, పొల్యూషన్‌తో దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఉత్తరాది రాష్ట్రాల ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. ఢిల్లీ, యూపీ, పంజాబ్, హర్యానా , ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు దట్టమైన పొగమంచు విజుబులిటీ పూర్తిగా తగ్గింది. మనిషికి మనిషే కనిపించని పరిస్థితి ఏర్పడింది. ఇంకా వాహనాల పరిస్థితి దారుణం.. రహదారులు మొత్తం మంచు పొగకమ్మేయడంతో వాహనాలు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు విజుబులిటీ లేకపోవండంతో పలు విమానాలు రద్దు అయ్యాయి. కొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ కట్టడికి గ్రాఫ్ 4 చర్యలు అమలు చేస్తున్నారు అధికారులు. వాతావరణశాఖ ప్రకారం.. ఉత్తరప్రదేశ్, బీహార్‌లలో చాలా దట్టమైన పొగమంచు ఏర్పడటంతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే, ప్రభుత్వ- ప్రైవేటు కార్యాలయాల్లో 50 శాతం ఉద్యోగులతో నిర్వహణ, మిగతా వారికి వర్క్ ఫ్రం హోమ్ ఇచ్చేలా ఆదేశాలు జారీ చేసింది ఢిల్లీ సర్కార్. పొల్యూషన్ సర్టిఫికెట్ లేని వాహనాలకు నో ఫ్యూయల్‌ను అమలు చేస్తోంది. అత్యవసర సేవల వాహనాలు మినహా ఢిల్లీలోకి డీజిల్ వాహనాలను రానివ్వడం లేదు. అలాగే, గడువు ముగిసిన వాహనాలపై నిషేధం అమలు చేస్తున్నారు. ఢిల్లీ- ఎన్సీఆర్ పరిధిలో నిర్మాణ పనులపై నిషేధం అమల్లో ఉంది. దీంతో ఉపాధి కోల్పోతున్న కార్మికులకు రూ.10 వేల సాయం అందించాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది.