||ఎమ్మెల్యేకు వినతి పత్రం ఇస్తున్న వీవోఎలు||సరిపడా జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నామని, వేతనాలు పెంచేలా చొరవ తీసుకోవాలని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కు VOAలు వినతి పత్రం సమర్పించారు. 'రాష్ట్రంలో (SERP) గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థలో సుమారు 18 వేల మంది VOAలు పని చేస్తున్నారు. వారికి CM KCR నెలకు ఒక్కొక్కరికి రూ. 3,900/- లు గౌరవ వేతనము ఇస్తున్నారు. అందుకు వారికి మన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. గ్రామీణ ప్రాంతాలలో మహిళా సంఘాలను బలోపేతం చేస్తూ, వారు తీసుకునే ఋణాలను సక్రమంగా తిరిగి చెల్లించే విధముగా బాధ్యతలు వహిస్తూ, ప్రభుత్వ పథకాలను మహిళలకు చేరవేర్చడంలో కూడా శక్తివంచన లేకుండా కృషిచేస్తున్నాము. అలాగే ప్రభుత్వ కార్యక్రమాలపైన వివిధ సర్వేలు చేసి, ప్రభుత్వానికి అందిస్తూ, వివిధ ప్రభుత్వ కార్యక్రమాలకు మహిళలను సమీకరించడంలో కూడా కీలకంగా పనిచేస్తున్నాము. మాకు ఇచ్చే రూ.3,900/- లు గౌరవ వేతనాలు, పెరిగిన నిత్యావసర ధరల కారణంగా దేనికి సరిపోక, కుటుంబ పోషణకు చాలా ఇబ్బందులు పడుచున్నాము' అని తెలిపారు.
తగిన చర్యలు తీసుకొని, ప్రభుత్వముతో మాట్లాడి VOAలకు కనీసం రూ.15,000/- గౌరవ వేతనము ఇప్పించాలని కోరారు. వాటితో పాటు..
1) విఓఎలకు ప్రస్తుతం ఇస్తున్న రూ.3,900/- ల గౌరవ వేతనముతో, మరో రూ.11,100/- లు అదనముగా కలిపి రూ.15,000/- లుగా పెంచాలి.
2) విఓఎలకు ఆరోగ్య బీమా మరియు మరణిస్తే 10 లక్షల రూపాయల బీమా సౌకర్యం కల్పించాలి.
3) విఓఎలకు ఒకే రకమైన యూనిఫామ్ ఇవ్వాలి.
4) విఓఎలందరికి ఉద్యోగ భద్రత కల్పించాలి.
5) విఓఎలందరికి సెర్చ్ నుండి ఐడి కార్డులు ఇవ్వాలి.
6) విఓఎలందరిని సెర్చ్ ఉద్యోగులుగా గుర్తించాలి. అని ఎమ్మెల్యేకు విన్నవించారు.