దక్షిణ కొరియాలో ఘోర విమాన ప్రమాదం.. ల్యాండింగ్ గేర్ వైఫల్యంతో 179 మంది మృతి

దక్షిణ కొరియాలోని మయాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ల్యాండింగ్ గేర్ వైఫల్యం చెందడంతో విమానం ప్రమాదానికి గురై 179 మంది మృతి చెందడానికి కారణమైంది. థాయ్ రాజధాని బ్యాంకాక్ నుంచి బయలుదేరిన డి జేజు ఎయిర్ ఫ్లైట్ కు చెందిన బోయింగ్ శ్రేణి విమానం ల్యాండ్ అవుతూ అదుపు తప్పింది. ఈ క్రమంలోనే రక్షణ గోడను ఢీకొని మంటల్లో చిక్కుకొని పేలిపోయింది. విమానం ల్యాండ్ కావడానికి ప్రయత్నించిన సమయంలో ల్యాండింగ్ గేర్ సమస్యతోనే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా అధికారులు నిర్ధారణకు వచ్చారు.

A fan that burned in an accident

ప్రమాదంలో కాలిపోయిన అభిమానం

దక్షిణ కొరియాలోని మయాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ల్యాండింగ్ గేర్ వైఫల్యం చెందడంతో విమానం ప్రమాదానికి గురై 179 మంది మృతి చెందడానికి కారణమైంది. థాయ్ రాజధాని బ్యాంకాక్ నుంచి బయలుదేరిన డి జేజు ఎయిర్ ఫ్లైట్ కు చెందిన బోయింగ్ శ్రేణి విమానం ల్యాండ్ అవుతూ అదుపు తప్పింది. ఈ క్రమంలోనే రక్షణ గోడను ఢీకొని మంటల్లో చిక్కుకొని పేలిపోయింది. విమానం ల్యాండ్ కావడానికి ప్రయత్నించిన సమయంలో ల్యాండింగ్ గేర్ సమస్యతోనే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా అధికారులు నిర్ధారణకు వచ్చారు. ఇద్దరు సిబ్బంది మినహా మిగిలిన వారంతా మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ విమానం అప్పటికే ల్యాండింగుకు ప్రయత్నించి విఫలమైందని అధికారులు వెల్లడించారు. ఈ విమానం నేలపైకి దిగిన తర్వాత రన్ వే చివరికి వస్తున్న సమయంలో కూడా వేగాన్ని నియంత్రించుకోవడంలో విఫలమైంది. దీంతో ఎయిర్ పోర్ట్ గోడను ఢీకొనడంతో విమానంలో ఇంధనం ఒక్కసారిగా మండిపోయి మంటలు వ్యాపించినట్లు చెబుతున్నారు. విమానం నేలపైకి దిగే సమయంలో ల్యాండింగ్ గేర్, టైర్లు పనిచేయడం లేదని కొందరు ప్రత్యక్ష సాక్షులు చెప్పినట్లు అధికారులు వెల్లడించారు. ఏదైనా పక్షిని ఢీకొనడం వల్లే అవి పని చేయకపోయి ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిని బలపరిచేలా విమానం లాండింగ్ కు యత్నించిన సమయంలో ఒక ఇంజిన్ నుంచి ఒక్కసారిగా నిప్పులు బయటికి వచ్చిన దృశ్యాలను స్థానిక మీడియా ఛానల్ ప్రసారం చేసింది.

దక్షిణ కొరియా ఫైర్ చీఫ్ లీ జియోంగు మాట్లాడుతూ విమానం ఇంజన్ ను పక్షి ఢీకొనడం, వాతావరణ పరిస్థితులు కారణంగా లాండింగ్ గేర్ లో సమస్యకు కారణమై ఉండొచ్చని పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన వీడియో దృశ్యాల్లో కూడా విమానం రన్ వేపై అదుపుతప్పి దూసుకెళ్తూ గోడను ఢీకొనే సమయానికి ల్యాండింగ్ గేర్ వెనక్కి ఉన్నట్లు భావిస్తున్నారు. జరిగిన ప్రమాదానికి థాయిలాండ్ కు చెందిన జెజు ఎయిర్ సంస్ధ క్షమాపణలు తెలిపింది. ప్రమాద నివారణకు తమ శక్తి వంచన లేకుండా ప్రయత్నించినట్లు వెల్లడించింది. బాధిత కుటుంబాలకు సాయం చేస్తామని పేర్కొంది. దక్షిణ కొరియాలో 1997లో జరిగిన విమాన ప్రమాదంలో 228 మంది మృతి చెందారు. ఆ తరువాత ఇదే అతిపెద్ద ప్రమాదంగా చెబుతున్నారు. ఈ ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో 175 మంది  ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది విమానంలో ఉన్నారు. ఇద్దరు సిబ్బందిని ప్రాణాలతో కాపాడారు. 179 మంది మృతి చెందినట్లు ఏజెన్సీ వెల్లడించింది. ఈ ఘటనలో విమానం మొత్తం పూర్తిగా కాలిపోయిందని అధికారులు ధ్రువీకరించారు. ఈ విమాన ప్రమాదంపై తాత్కాలిక అధ్యక్షుడు చోయ్ సాంగ్ స్పందించారు. తక్షణమే అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఇంటీరియర్, ల్యాండ్ మినిస్టర్లకు, పోలీసులు, అగ్ని మాపక శాఖకు మార్గదర్శకాలు జారీ చేశారు. మయాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అన్ని విమానాల రాకపోకలను ఈ ప్రమాదం వల్ల రద్దు చేశారు. ప్రస్తుతం ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్