పొరపాటున పదేళ్ల జైలు శిక్ష.. బాధితుడికి రూ.419 కోట్ల పరిహారం చెల్లింపునకు ఆదేశం

నేరం చేయకపోయినా ఒక వ్యక్తి పదేళ్లపాటు జైలు శిక్షను అనుభవించాడు. చివరికి సదరు వ్యక్తి ఏ తప్పు చేయలేదని తేలడంతో కోర్టు విడుదల చేసింది. పదేళ్లపాటు అన్యాయంగా జైలు శిక్ష అనుభవించిన బాధితుడికి కోర్టు మేలు చేకూర్చేలా నిర్ణయం తీసుకుంది. పదేళ్లపాటు జైలు గోడలకు పరిమితమైన సదరు బాధితుడికి 50 మిలియన్‌ డాలర్ల నష్ట పరిహారం చెల్లించాల్సిందిగా న్యాయస్థానం ఆదేశించింది. అమెరికాలోని చికాగో ఫెడరల్‌ జ్యూరీ కోర్టు ఈ సంచలన తీర్పును ఇచ్చింది.

Court judgment

కోర్టు తీర్పు

సాక్ష్యాలు, ఆధారాలు ఆధారంగా అనేక కేసుల్లో కోర్టులు తీర్పులు ఇస్తుంటాయి. కొన్నిసార్లు సాక్ష్యాధారాలను సమర్పించడంలో ఎదురయ్యే ఇబ్బందులతో నిరపరాధులకు కూడా శిక్ష పడుతుంటుంది. అటువంటి ఘటనే అమెరికాలోని చోటు చేసుకుంది. ఆఖరికి నిరపరాధి అయిన వ్యక్తికి శిక్ష విధించామని తెలుసుకున్న కోర్టు బాధితుడికి రూ.419 కోట్లు పరిహారం ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నేరం చేయకపోయినా ఒక వ్యక్తి పదేళ్లపాటు జైలు శిక్షను అనుభవించాడు. చివరికి సదరు వ్యక్తి ఏ తప్పు చేయలేదని తేలడంతో కోర్టు విడుదల చేసింది. పదేళ్లపాటు అన్యాయంగా జైలు శిక్ష అనుభవించిన బాధితుడికి కోర్టు మేలు చేకూర్చేలా నిర్ణయం తీసుకుంది. పదేళ్లపాటు జైలు గోడలకు పరిమితమైన సదరు బాధితుడికి 50 మిలియన్‌ డాలర్ల నష్ట పరిహారం చెల్లించాల్సిందిగా న్యాయస్థానం ఆదేశించింది. అమెరికాలోని చికాగో ఫెడరల్‌ జ్యూరీ కోర్టు ఈ సంచలన తీర్పును ఇచ్చింది. 

19 ఏళ్ల వయసున్న వ్యక్తిని హత్య చేశాడన్న అభియోగాలపై మార్సెల్‌ బ్రౌన్‌ అనే వ్యక్తిని 2008లో పోలీసులు అరెస్ట్‌ చేశారు. దీనిపై అప్పట్లో విచారణ జరిపిన న్యాయస్థానం అతడిని దోషిగా నిర్ధారిస్తూ 35 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అతడితో బలవంతంగా నేరాంగీకారం చేయించారని చెబుతూ 2018లో బ్రౌన్‌ తరపు న్యాయవాదులు కోర్టుకు సాక్ష్యాధారాలు సమర్పించారు. దీంతో అతడిపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టేస్తూ బ్రౌన్‌ను విడుదల చేయాలని తీర్పును ఇచ్చింది. ఈ క్రమంలోనే బాధితుడు తనను తప్పుడు కేసులో జైల్లో పెట్టడాన్ని సవాల్‌ చేస్తూ బ్రౌన్‌ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై విచారణ చేసిన చికాగో ఫెడరల్‌ కోర్టు తాజాగా కీలక తీర్పును ఇచ్చింది. తప్పుడు కేసులో బ్రౌన్‌ను అరెస్ట్‌ చేసినందుకుగాను 10 మిలియన్‌ డాలర్లు, పదేళ్లపాటు జైలు శిక్ష అనుభించేలా చేసినందుకుగాను మరో 40 మిలియన్‌ డార్లు అతడికి చెల్లించాలని కోర్టు ఆదేశించింది. అంటే మొత్తంగా 50 మిలియన డాలర్లు (భారత కరెన్సీలో 419 కోట్లు)చెల్లించాలని ఆదేశించింది. దీనిపై బ్రౌన్‌ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇన్నాళ్లపాటు జైలు జీవితాన్ని అనుభవించిన తనకు, తన కుటుంబానికి మేలు జరిగిందంటూ బ్రౌన్‌ వ్యాఖ్యానించాడు. ఈ తీర్పు ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది. తప్పు చేయని వారికి శిక్ష విధిస్తే ఎటువంటి నష్టపరిహారాన్ని చెల్లించాల్సి ఉంటుందనే దానికి ఈ కేసు ఉదాహరణగా నిలుస్తుందని పలువురు పేర్కొంటున్నారు. 


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్