దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కలకత్తాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో వైద్య విద్యార్థినిపై అత్యాచార ఘటనకు సంబంధించిన తీర్పు వెలువడింది. ఈ కేసులో నిందితుడు సంజయ్ రాయ్ ను దోషిగా నిర్ధారిస్తూ సిల్దా కోర్టు శనివారం సంచలన తీర్పును ఇచ్చింది. ఈ కేసులో సంజయ్ రాయ్ కు సోమవారం శిక్షను ఖరారు చేయనుంది కోర్టు. ఈ కేసు పై గతేడాది నవంబర్ 12 నుంచి సిల్దా కోర్టు విచారణ ప్రారంభించింది. కేసు విచారణలో భాగంగా దాదాపు 100 మందికి పైగా సాక్షులను విచారించింది.
నిందితుడు సంజయ్, హాస్పిటల్
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కలకత్తాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో వైద్య విద్యార్థినిపై అత్యాచార ఘటనకు సంబంధించిన తీర్పు వెలువడింది. ఈ కేసులో నిందితుడు సంజయ్ రాయ్ ను దోషిగా నిర్ధారిస్తూ సిల్దా కోర్టు శనివారం సంచలన తీర్పును ఇచ్చింది. ఈ కేసులో సంజయ్ రాయ్ కు సోమవారం శిక్షను ఖరారు చేయనుంది కోర్టు. ఈ కేసు పై గతేడాది నవంబర్ 12 నుంచి సిల్దా కోర్టు విచారణ ప్రారంభించింది. కేసు విచారణలో భాగంగా దాదాపు 100 మందికి పైగా సాక్షులను విచారించింది. అత్యంత వేగంగా కేసు విచారణ పూర్తి చేసిన కోర్టు తుది తీర్పును వెలువరించింది. గడిచిన ఏడాది ఆగస్టు 9న ఆర్జీకర్ ఆసుపత్రిలో మహిళా డాక్టర్ పై అత్యాచారం జరిగింది. అనంతరం ఆమెను హత్య చేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో కోల్కతా హైకోర్టు ఆదేశాలతో సిబిఐ విచారణ చేపట్టింది. కేసు దర్యాప్తులో భాగంగా నిందితుడు సంజయ్ రాయ్కు పాలిగ్రాఫ్ టెస్టు నిర్వహించారు. ఆయనతోపాటు ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ తోపాటు పలువురుని సిబిఐ ప్రశ్నించింది. ఈ ఘటనకు నిరసనగా ఆర్థిక హాస్పిటల్లో నిరసన తెలుపుతున్న ఆందోళనకారులపై దాడి ఘటన సంచలనం రేపింది. ఈ అంశంపై పశ్చిమ బెంగాల్ సర్కార్ హైకోర్టును తీవ్ర స్థాయిలో మందలించింది ఇది అప్పట్లో సంచలనాన్ని సృష్టించింది. మరోవైపు డాక్టర్ అత్యాచార ఘటన రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టించింది. ఘటనకు బాధ్యత వహిస్తూ సీఎం మమతా బెనర్జీ రాజీనామా చేయాలని విపక్షాలు పెద్ద ఎత్తున డిమాండ్ చేశాయి.
ఈ క్రమంలోనే ర్యాలీలు నిర్వహించారు. అత్యాచార ఘటనను నిరసిస్తూ నిర్వహించిన ర్యాలీలో సీఎం మమతా బెనర్జీ కూడా పాల్గొనడం గమనార్హం. ఈ సందర్భంగా ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరు నిజాలు బయటకు రాకుండా చేస్తున్నారంటూ ఆమె అసహనం కూడా వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే విచారణను వేగవంతంగా పూర్తి చేసి కోర్టు శిక్ష కూడా విధించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇదెలా ఉండగా ఈ కేసును సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. దేశంలో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేలా చేపట్టాల్సిన చర్యలపై నిపుణులతో నేషనల్ టాస్క్ ఫోర్సును ఏర్పాటు చేసింది. ఈ కేసు విచారణను చేపట్టిన సిబిఐ నిందితులకు మరణశిక్ష విధించాలని సిఫార్సు చేసింది. సిబిఐ సిఫార్సు చేసినట్టుగా నిందితులు సంజయ్ రాయ్ కు మరణశిక్ష విధిస్తారా.? లేదా.? అన్నది సోమవారం తేలనుంది. ఇదిలా ఉంటే హత్యాచార గతంలో మృతిచెందిన వైద్యురాలి తండ్రి సంచలన ఆరోపణలు చేశారు. సిబిఐ తమకు విచారణ విషయాలను వెల్లడించలేదని, కేసు పురోగతి అడిగిన చెప్పలేదంటూ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే కోర్టు తీర్పును వెలువరించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఏది ఏమైనా బాధితురాలికి న్యాయం చేసేలా కోర్టు తీర్పును ఇస్తారని అందరూ భావిస్తున్నారు.