హైదరాబాద్ కిడ్నీ రాకెట్ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సరూర్నగర్ లోని అలకనంద ఆసుపత్రిపై ఆకస్మికంగా దాడి చేసిన పోలీసులు తొమ్మిది మందిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ముఠాలో కీలకంగా వ్యవహరించి పరారీలో ఉన్న ఇద్దరు వైద్యులు, నలుగురు బ్రోకర్ల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఒక కారు, ఐదు లక్షల నగదు, పది ఫోన్లు, సర్జరీ సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిరుపేదలను లక్ష్యంగా చేసుకుని కిడ్నీ కిలాడీలు రెచ్చిపోయినట్లు పోలీసుల విచారణలో తేలింది.
ప్రతీకాత్మక చిత్రం
హైదరాబాద్ కిడ్నీ రాకెట్ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సరూర్నగర్ లోని అలకనంద ఆసుపత్రిపై ఆకస్మికంగా దాడి చేసిన పోలీసులు తొమ్మిది మందిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ముఠాలో కీలకంగా వ్యవహరించి పరారీలో ఉన్న ఇద్దరు వైద్యులు, నలుగురు బ్రోకర్ల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఒక కారు, ఐదు లక్షల నగదు, పది ఫోన్లు, సర్జరీ సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిరుపేదలను లక్ష్యంగా చేసుకుని కిడ్నీ కిలాడీలు రెచ్చిపోయినట్లు పోలీసుల విచారణలో తేలింది. 2023 నుంచి ఇప్పటివరకు దాదాపు 90 కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కిడ్నీ దాకలో, గ్రహీతలతోపాటు వైద్యులు, సహాయకులను తీసుకువచ్చే ఈ ముఠా కిడ్నీ రాకెట్ నడిపించినట్లు గుర్తించారు. ఒక్కో కిడ్నీ మార్పిడి స్వస్థత చికిత్సకు రూ.55 లక్షలకుపైగానే తీసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.
ఈ వ్యవహారాన్ని విచారిస్తున్న పోలీసులకు దిమ్మతిరిగే విషయాలు వెల్లడవుతున్నాయి. హైదరాబాద్ జనని ఆసుపత్రికి చంద్ర డాక్టర్ సిద్దం శెట్టి అవినాష్ కు విశాఖపట్నం చెందిన లక్ష్మణ్ పరిచయమయ్యాడు. కిడ్నీ రాకెట్ కు సహకరిస్తే ఒక్కో కిడ్నీ మార్పిడి చేస్తా చికిత్సకు 2.5 లక్షలు ఇస్తామని, దాతలు, గ్రహీతలు, వైద్య బృందాన్ని తామే తీసుకొస్తామని ఆఫర్ ఇవ్వడంతో కిడ్నీ రాకెట్ కు సహకారాన్ని అందించాడు. అవినాష్కు చెందిన జనని ఆసుపత్రిలో 2023 ఏప్రిల్ నుంచి 2024 జూన్ వరకు 40 నుంచి 50 వరకు కిడ్నీ మార్పిడి చెస్త చికిత్సలు జరిగాయి. 10 సమస్యలతో జనని ఆసుపత్రి 2024 జూన్ లో మూసేసిన అవినాష్.. అనంతరం సరూర్నగర్ లోని అలకనంద ఆసుపత్రి ఎండి సుమంత్ తో టై అప్ పెట్టుకున్నాడు. తరువాత ఒక్కో కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ కు అవినాష్ కు లక్ష, సుమంత్ లక్షన్నర చొప్పున పంచుకున్నారు. అలకనంద ఆసుపత్రిలో గడిచిన ఏడాది డిసెంబర్లోనే దాదాపు 20కి పైగా కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలు జరిగినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే నగరంలోని జనని, అలకనంద, అరుణ ఆస్పత్రులతోపాటు మరికొన్ని ఆసుపత్రిలో మొత్తంగా 90 కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు చేసినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. కిడ్నీ శస్త్ర చికిత్సలు నిర్వహించే దందాలో ఆరితేరిన విశాఖకు చెందిన పవన్, అతని అనుచరుడు పూర్ణ సహాయంతో వేరు రాష్ట్రాల నుంచి వైద్యులు, సహాయకులను తీసుకువచ్చి కిడ్నీ రాకెట్ నిర్వహించారని పోలీసులు చెబుతున్నారు. ప్రధాన ముద్దాయి పవన్ కొండల్లో దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోనూ కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలు జరిగినట్లు తేల్చారు. మరోవైపు పవన్ ముఠా ఒక్కో మార్పుడికి కిడ్నీ గ్రహీతల నుంచి 55 లక్షలకు పైగా వసూలు చేసి.. దాతకు ఐదు లక్షలు, ఆసుపత్రి నిర్వహకుడు అవినాష్ కు రెండున్నర లక్షలు, ఆపరేషన్ చేసిన వైద్యులకు 10 లక్షలు, థియేటర్ సహాయకులకు ఐదుగురికి 30,000 చొప్పున పంచేవారని పోలీసుల విచారణలో తేలింది. పరారీలో ఉన్న పవన్ కోసం గాలిస్తున్న పోలీసులు కిడ్నీ రాకెట్ కేసును ఛాలెంజ్ గా తీసుకున్నారు. ఏది ఏమైనా కిడ్నీ రాకెట్ వ్యవహారంలో ప్రస్తుతం సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ వ్యవహారంలో ఎంతమంది బాధితులు మోసపోయారు అన్న దానిపై స్పెషల్ టీమ్ ప్రస్తుతం దర్యాప్తు చేస్తోంది.