దేశంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) క్రికెట్ మ్యాచ్‌లు ఆసక్తికరంగా సాగుతున్నాయి. దేశంలో ఎక్కడ మ్యాచ్ జరిగినా వేలాది మంది క్రికెట్ అభిమానులు తరలివస్తున్నారు. మ్యాచ్ జరిగే ప్రతిచోట భద్రత పటిష్టంగా ఉంటుంది. అయితే, కొద్దిరోజులు నుంచి భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఇటీవల పహల్‌గామ్ ఉగ్రదాడి తరువాత బోర్డర్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2025 సీజన్‌లో భద్రతా చర్యలు మరింత కట్టుదిట్టం చేశారు. దీనికి కారణం గగనతలంలో భద్రత కోసం వజ్ర సూపర్ షాట్ అనే యాంటీ డ్రోన్ వ్యవస్థను ఐపీఎల్ స్టేడియం వద్ద ప్రవేశపెట్టారు. ఐపీఎల్‌లో భద్రత పెంచడం కోసం బీసీసీఐ, భద్రతా బృందాలు అన్ని స్టేడియాల్లో కట్టుదిట్టమైన తనిఖీలు, అధునాతన సాంకేతికతలను ఉపయోగిస్తున్నాయి.
ప్రతీకాత్మక చిత్రం
దేశంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) క్రికెట్ మ్యాచ్‌లు ఆసక్తికరంగా సాగుతున్నాయి. దేశంలో ఎక్కడ మ్యాచ్ జరిగినా వేలాది మంది క్రికెట్ అభిమానులు తరలివస్తున్నారు. మ్యాచ్ జరిగే ప్రతిచోట భద్రత పటిష్టంగా ఉంటుంది. అయితే, కొద్దిరోజులు నుంచి భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఇటీవల పహల్‌గామ్ ఉగ్రదాడి తరువాత బోర్డర్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2025 సీజన్‌లో భద్రతా చర్యలు మరింత కట్టుదిట్టం చేశారు. దీనికి కారణం గగనతలంలో భద్రత కోసం వజ్ర సూపర్ షాట్ అనే యాంటీ డ్రోన్ వ్యవస్థను ఐపీఎల్ స్టేడియం వద్ద ప్రవేశపెట్టారు. ఐపీఎల్‌లో భద్రత పెంచడం కోసం బీసీసీఐ, భద్రతా బృందాలు అన్ని స్టేడియాల్లో కట్టుదిట్టమైన తనిఖీలు, అధునాతన సాంకేతికతలను ఉపయోగిస్తున్నాయి. ఈ క్రమంలోనే వజ్ర సూపర్ షాట్ యాంటీ డ్రోన్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాయి. దీంతో క్రికెట్ అభిమానులు ఎటువంటి భయం లేకఉండా మ్యాచ్‌లను ఆస్వాదించేలా తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ సరికొత్త సాంకేతికత అభిమానులకు, ఆటగాళ్లకు సురక్షితమైన వాతావరణాన్ని అందించనుందని నిపుణులు చెబుతున్నారు.
వజ్ర సూపర్ షాట్ గురించి కూడా ప్రస్తుతం పెద్ద చర్చ జరుగుతోంది. వజ్ర సూపర్ షాట్ చెన్నైకు చెందిన బిగ్ బ్యాంగ్ బూమ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్(బీబీబీఎస్) అభివృద్ధి చేసిన అత్యాధునిక యాంటీ డ్రోన్ వ్యవస్థ. దీని ద్వారా చుట్టూ నాలుగు కిలో మీటర్లు పరిధిలో అనధికార డ్రోన్లు కదలికలను గుర్తించి వాటి సమాచార వ్యవస్తను అడ్డుకునేలా దీన్ని రూపొందించారు. ఇక ఈ వజ్ర సూపర్ షాట్ చాలా తేలికైన టెక్నాలజీ. కాబట్టి, దీన్ని సులభంగా తీసుకువెళ్లవచ్చు. ఐపీఎల్ వంటి పెద్ద ఈవెంట్లకు ఇది బాగా సరిపోతుంది. ఇక ఈ టెక్నాలజీ మొదటిసారిగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్జ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో వినియోగించారు. పహల్‌గామ్‌లో జరిగిన ఉగ్ర దాడి తరువాత ఎటువంటి ప్రమాదమైన సంభవించే అవకాశం ఉందన్న ఆందోళనలతో దీన్ని ఉపయోగిస్తున్నారు. ప్రతి మ్యాచ్‌కు పెద్ద సంఖ్యలో అభిమానులు హాజరు కావడంతోపాటు దేశ, విదేశాలకు చెందిన ఎంతో మంది ఆటగాళ్లుమ్యాచ్‌లు ఆడుతున్నారు.ఈ నేపథ్యంలో వారి భద్రతకు అధిక ప్రాధాన్యతను ఐపీఎల్ యాజమాన్యం ఈ సరికొత్త వస్ర సూపర్ షాట్‌ను రంగంలోకి దించారు.