స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వివిధ రకాల పథకాలను అమలు చేస్తుంటుంది. ముఖ్యంగా ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలనుకునే వారికి వివిధ రకాల స్కీమ్స్ ఎస్బిఐ అందిస్తోంది. అయితే గడిచిన కొన్నాళ్లుగా మంచి ఫిక్స్డ్ డిపాజిట్లను ఆకర్షిస్తున్న ఒక స్కీంను ఎస్బిఐ తాజాగా నిలిపివేసింది. డబ్బు పొదుపు చేయాలనుకునే వారికి సాధారణంగా ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలనుకుంటారు. అటువంటి వారికి ఎస్బిఐ అమలు చేస్తున్న అమృత్ కలష్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులో మంచి వడ్డీలు వస్తుండడంతో భారీగా ఫిక్స్డ్ డిపాజిట్లు వచ్చేవి. అయితే అనుభయంగా ఈ స్కీమ్ ను ఎస్బిఐ నిలిపివేసింది. కొద్దిరోజుల కిందట ఈ స్కీమ్ గడువు ముగిసింది. సాధారణంగా గడువు ముగిసిన తర్వాత పొడిగిస్తుంటారు.
ప్రతీకాత్మక చిత్రం
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వివిధ రకాల పథకాలను అమలు చేస్తుంటుంది. ముఖ్యంగా ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలనుకునే వారికి వివిధ రకాల స్కీమ్స్ ఎస్బిఐ అందిస్తోంది. అయితే గడిచిన కొన్నాళ్లుగా మంచి ఫిక్స్డ్ డిపాజిట్లను ఆకర్షిస్తున్న ఒక స్కీంను ఎస్బిఐ తాజాగా నిలిపివేసింది. డబ్బు పొదుపు చేయాలనుకునే వారికి సాధారణంగా ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలనుకుంటారు. అటువంటి వారికి ఎస్బిఐ అమలు చేస్తున్న అమృత్ కలష్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులో మంచి వడ్డీలు వస్తుండడంతో భారీగా ఫిక్స్డ్ డిపాజిట్లు వచ్చేవి. అయితే అనుభయంగా ఈ స్కీమ్ ను ఎస్బిఐ నిలిపివేసింది. కొద్దిరోజుల కిందట ఈ స్కీమ్ గడువు ముగిసింది. సాధారణంగా గడువు ముగిసిన తర్వాత పొడిగిస్తుంటారు. కానీ ఎస్బిఐ తాజాగా గొడుగును పొడిగించకపోగా స్కీంను ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి నిలిపివేసింది. రిజర్వ్ బ్యాంకు కీలక వడ్డీరేట్లు తగ్గించడం వల్ల బ్యాంకులు కూడా వడ్డీ రేట్లు తగ్గించాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే అధిక వడ్డీని ఇచ్చే ఈ పథకాన్ని ఎస్బిఐ నిలిపివేసినట్లు చెబుతున్నారు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందించిన అమృత కలష్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీం ద్వారా సాధారణ పెట్టుబడిదారులకు ఏడాదికి 7.10 శాతం వడ్డీని, 400 రోజుల డిపాజిట్ పై సీనియర్ సిటిజనులకు 7.60 శాతం వడ్డీని అందిస్తూ వచ్చింది. ఎక్కువ వడ్డీ లభిస్తుండడంతో చాలామంది ఈ స్కీం లో చేరారు. ముఖ్యంగా మధ్యతరగతి వర్గాలకు చెందిన ఎంతోమంది ఈ స్కీమును సద్వినియోగం చేసుకున్నారు. ప్రతినెలా కొంత మొత్తం చొప్పున ఫిక్స్డ్ డిపాజిట్ చేసే వారి సంఖ్యలోనే ఈ స్కీమ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. కొత్తగా ఇందులో ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలనుకుని సిద్ధమైన ఎంతోమందికి ఈ పథకాన్ని నిలిపివేశారు అన్న వార్త ఆందోళనకు గురి చేస్తుంది. ఇకపై ఈ స్కీం అందుబాటులో ఉండదని తెలియడంతో కష్టమర్లు ఒకసారిగా ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే ఎంతోమంది బ్యాంకులకు వెళ్లి ఈ పథకం గురించి ఆరా తీస్తున్నారు. మళ్లీ దీనిని ప్రవేశపెట్టే అవకాశం ఉందా లేదా అన్నదానిపై బ్యాంకు అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఉన్నపలంగా ఒక్కసారి ఈ స్కీమ్ ను నిలిపివేయడం పట్ల వారంతా అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీరేట్లు మళ్లీ పెంచితే దీనిని పునరుద్ధరించే అవకాశం ఉందన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. కొన్ని బ్యాంకు అధికారులు కూడా ఇదే విషయాన్ని చెబుతుండడంతో ఆశావహ దృక్పథంతో ఎంతోమంది చూస్తున్నారు.