ఉక్రెయిన్ తో యుద్ధంపై రష్యా ప్రధానికి ఒక మాట చెప్పండి.. భారత్ ను కోరిన అమెరికా

రష్యా, ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధానికి తెరదించేలా భారత్ కృషి చేయాలంటూ అమెరికా విజ్ఞప్తి చేసింది. కొద్దిరోజుల కిందట రష్యా పర్యటనకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోడీ పుతిన్ తో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో అమెరికా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ కీలక ప్రకటన చేశారు. రష్యాతో భారత్ కు ఉన్న సుదీర్ఘ బంధాన్ని వినియోగించుకొని ఉక్రెయిన్, రష్యా మధ్య కొన్నాళ్లుగా జరుగుతున్న యుద్ధాన్ని నిలుపుదల చేసేందుకు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

US State Department spokesman Matthew Miller

అమెరికా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్

రష్యా, ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధానికి తెరదించేలా భారత్ కృషి చేయాలంటూ అమెరికా విజ్ఞప్తి చేసింది. కొద్దిరోజుల కిందట రష్యా పర్యటనకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోడీ పుతిన్ తో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో అమెరికా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ కీలక ప్రకటన చేశారు. రష్యాతో భారత్ కు ఉన్న సుదీర్ఘ బంధాన్ని వినియోగించుకొని ఉక్రెయిన్, రష్యా మధ్య కొన్నాళ్లుగా జరుగుతున్న యుద్ధాన్ని నిలుపుదల చేసేందుకు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఐక్యరాజ్యసమితి చట్టాలను గౌరవించే విధంగా పుతిన్ కు సూచించాలని ఈ సందర్భంగా భారత్ ను ఆయన కోరారు. రష్యాతో భారతదేశానికి సుదీర్ఘమైన బంధం ఉందని ఇది అందరికీ తెలుసన్నారు. ఈ బంధాన్ని వినియోగించుకుని యుద్ధాన్ని నిలుపుదల చేసేందుకు భారతదేశాన్ని అమెరికా ప్రోత్సహిస్తుందన్నారు. రష్యాతో భారతదేశానికి ఉన్న పటిష్ట బంధం, ఆ దేశం వద్ద ఉన్న విశిష్ట స్థానాన్ని వినియోగించుకొని అధ్యక్షుడు పుతిన్ తో మాట్లాడాలని కోరుతున్నట్లు ఆయన వివరించారు.

చట్టవిరుద్ధమైన యుద్ధాన్ని ముగించి శాంతిస్థాపనకు కృషి చేయాలని కోరారు. ఐక్యరాజ్య సమితి నిబంధనను గౌరవించి ఉక్రెయిన్ ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వాన్ని గౌరవించాలని భారత్కు సూచించినట్లు మాథ్యూ మిల్లర్ వెల్లడించారు. భారత్ తో తమకు సత్సంబంధాలు ఉన్నాయని, అందుకే ఈ విషయంపై నిరంతరాయంగా ఒత్తిడి తెస్తున్నామని వివరించారు. కొన్ని నెలల తరబడి జరుగుతున్న యుద్ధం వల్ల ఆయా దేశాలకు చెందిన పౌరులతోపాటు ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయన్నారు. ఇదిలా ఉంటే భారత్ ప్రధాని నరేంద్ర మోడీ రష్యా పర్యటన పట్ల ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీ పెదవి విరిచారు. శాంతి స్థాపనకు విఘాతం కలిగించే చర్య అంటూ అవగాహన రాహిత్య వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ఉక్రెయిన్ పై యుద్ధాన్ని పరిష్కరించడంలో సహకరిస్తున్న మోడీకి ప్రధాని నరేంద్ర మోడీకి పుతిన్ కృతజ్ఞతలు తెలిపారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్