సంక్రాంతి పండుగ నేపథ్యంలో సొంతూళ్ళకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వే శాఖ, ఆర్టీసీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రైల్వే శాఖ సంక్రాంతి పండుగ కోసం 26 ప్రత్యేక రైళ్లను శుక్రవారం నుంచి నడపనుంది. ఈ రైలు సేవలు శుక్రవారం నుంచే ప్రారంభం కానున్నట్లు రైల్వే అధికారులు ఇప్పటికే వెల్లడించారు. ఆర్టీసీ అధికారులు కూడా ప్రయాణికుల సౌకర్యార్థం 6432 ప్రత్యేక బస్సు సర్వీసులను నడపనున్నారు. సంక్రాంతి పండుగ కోసం రైల్వే శాఖ 26 ప్రత్యేక రైళ్లను నడుపుతోంది.
ప్రతికాత్మక చిత్రం
సంక్రాంతి పండుగ నేపథ్యంలో సొంతూళ్ళకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వే శాఖ, ఆర్టీసీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రైల్వే శాఖ సంక్రాంతి పండుగ కోసం 26 ప్రత్యేక రైళ్లను శుక్రవారం నుంచి నడపనుంది. ఈ రైలు సేవలు శుక్రవారం నుంచే ప్రారంభం కానున్నట్లు రైల్వే అధికారులు ఇప్పటికే వెల్లడించారు. ఆర్టీసీ అధికారులు కూడా ప్రయాణికుల సౌకర్యార్థం 6432 ప్రత్యేక బస్సు సర్వీసులను నడపనున్నారు. సంక్రాంతి పండుగ కోసం రైల్వే శాఖ 26 ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఈ రైలు సేవలు ఈనెల 10 నుంచి 17 వరకు అందుబాటులోకి రానున్నాయి. సికింద్రాబాద్ - ఆర్సికిరే, విశాఖపట్నం - చర్లపల్లి, బెంగళూరు - కాల బురిగి మధ్య ప్రత్యేక రైలు రాకపోకలు సాగిస్తాయని రైల్వే అధికారులు ప్రకటించారు. ఈ మార్గాల గుండా సొంత ఊర్లకు వెళ్లే ప్రయాణికులు ఏ రైలు సేవలను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు పేర్కొన్నారు. అలాగే, తెలంగాణ వ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా 6432 బస్సు సర్వీసులను నడపనున్నట్లు తెలంగాణ ఆర్టిసి అధికారులు ప్రకటించారు. ఈ నెల 10, 11, 12 తేదీల్లో ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచనుంది. తిరుగు ప్రయాణంలో వారికోసం ఈనెల 19, 20 తేదీల్లో తగిన ఏర్పాట్లు చేసినట్లు ఎండి సజ్జనార్ వెల్లడించారు. ఈ బస్సు సర్వీసులు ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఆరాంఘర్, ఎల్బీనగర్ క్రాస్ రోడ్స్, కెపిహెచ్బి, బోయినపల్లి, గచ్చిబౌలి నుంచి ఈ ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు అధికారులు వెల్లడించారు. స్పెషల్ బస్సులు మినహా రెగ్యులర్ బస్సుల్లో సాధారణ చార్జీలే అమల్లో ఉంటాయని, మహిళలకు ఉచిత బస్సు రవాణా సదుపాయం అమల్లో ఉంటుందని అధికారులు వెల్లడించారు. ప్రత్యేక బస్సుల పూర్తి సమాచారం కోసం తెలంగాణ ఆర్టీసీ అధికారులు కాల్ సెంటర్ 040-69440000, 040 - 23450033 నెంబర్లకు సంప్రదించాలని వెల్లడించారు.