||ప్రతీకాత్మక చిత్రం|| సంక్రాంతి పండుగ సందర్భంగా పట్టణం నుంచి పల్లె బాట పడుతున్నారా.. అయితే ఇల్లు భద్రం అంటున్నారు సైబరాబాద్ పోలీసులు. ఇంట్లో విలువైన వస్తువులు, బంగారం, వెండి డబ్బులు భద్రపరచడం మర్చిపోవద్దు అంటూ ఓ వీడియో ద్వారా సందేశం పంపారు. ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ.. విలువైన వస్తువులను బ్యాంక్ లాకర్ లో భద్రపరిచి, దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ లో ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని, ఇంట్లో సీసీ కెమెరాలు, సెన్సార్ లాకులు, మోషన్ సిసి కెమెరా, సెక్యూరిటీ అలారం, సెంట్రల్ లాక్ గల తాళాన్ని వెయ్యడం మర్చిపోవద్దని హైదారాబాద్ పోలీసుల తెలిపారు.