యూట్యూబర్ హర్ష సాయిపై సజ్జనార్ ఆగ్రహం.. అన్ ఫాలో చేయాలంటూ పిలుపు.!

సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్స్ కొందరు డబ్బుల కోసం బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేస్తూ ఎంతో మంది జీవితాలను నాశనం చేస్తున్నారు. దీనిపై గడిచిన కొద్ది రోజుల నుంచి తెలంగాణ ఆర్టీసీ నుండి సజ్జనార్ తీవ్రస్థాయిలో స్పందిస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ పై ఆయన సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేస్తున్నారు. గతంలో విశాఖకు చెందిన నానిపై యాక్షన్ తీసుకోవాలంటూ స్థానిక పోలీసులకు సలహా కూడా ఇచ్చారు. సజ్జనార్ సూచనలు మేరకు విశాఖ పోలీసులు నానిని అరెస్టు చేశారు. తాజాగా మరో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్పై సజ్జనార్ ఫైర్ అయ్యారు. ఆ యూట్యూబ్ హర్ష సాయి. హర్ష సాయి బెట్టింగ్ యాప్ ప్రమోషన్ గురించి గతంలో మాట్లాడిన వీడియోను ఐపీఎస్ అధికారి సజ్జనార్ ఎక్స్ లో పోస్ట్ చేశారు.

 Sajjanar, Harsha Sai

సజ్జనార్, హర్ష సాయి

సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్స్ కొందరు డబ్బుల కోసం బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేస్తూ ఎంతో మంది జీవితాలను నాశనం చేస్తున్నారు. దీనిపై గడిచిన కొద్ది రోజుల నుంచి తెలంగాణ ఆర్టీసీ నుండి సజ్జనార్ తీవ్రస్థాయిలో స్పందిస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ పై ఆయన  సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేస్తున్నారు. గతంలో విశాఖకు చెందిన నానిపై యాక్షన్ తీసుకోవాలంటూ స్థానిక పోలీసులకు సలహా కూడా ఇచ్చారు. సజ్జనార్ సూచనలు మేరకు విశాఖ పోలీసులు నానిని అరెస్టు చేశారు. తాజాగా మరో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్పై సజ్జనార్ ఫైర్ అయ్యారు. ఆ యూట్యూబ్ హర్ష సాయి. హర్ష సాయి బెట్టింగ్ యాప్ ప్రమోషన్ గురించి గతంలో మాట్లాడిన వీడియోను ఐపీఎస్ అధికారి సజ్జనార్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. చేస్తున్నదే తప్పు.. అదేదో సంఘ సేవ చేస్తున్నట్టు ఎంత గొప్పలు చెప్పుకుంటున్నాడో చూడండి అంటూ ఆ పోస్టుకు కామెంట్ చేశారు. తాను బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయకుంటే ఎవరో ఒకరు చేస్తారని ఈయన చేస్తున్నాడని చెప్పడం దారుణం అంటూ వ్యాఖ్యానించారు.

బుద్ధుందా అసలు ఎంతోమంది అమాయకుల ప్రాణాలు ఆన్లైన్ బెట్టింగ్లకు బలైతుంటే కనీసం పశ్చాత్తాపం లేదు అంటూ వ్యాఖ్యానించారు సజ్జానార్. వేలకు డబ్బే ముఖ్యమని, డబ్బే సర్వస్వమని వ్యాఖ్యానించారు. ఎవరు ఎక్కడ పోయినా సమాజం, బంధాలు, బంధుత్వాలు చిన్న భిన్నమైన సంబంధం లేనట్టుగా ఉంటారని పేర్కొన్నారు. ఈయనకు 100 కోట్ల నుంచి 500 కోట్ల వరకు ఆఫర్ చేశారట, అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో ఆలోచించండి అంటూ సజ్జనార్ పేర్కొన్నారు. మీ ఫాలోయింగ్ మార్కెట్లో పెట్టి కోట్లకు కోట్లు సంపాదిస్తున్న ఇలాంటి వాళ్ళు నా మీరు ఫాలో అవుతోంది అంటూ పేర్కొన్న ఆయన.. వెంటనే ఈ బెట్టింగ్ ఇన్ఫ్లుయెన్సర్లను అన్ ఫాలో చేయండి అంటూ సూచించారు. వారి అకౌంట్లను రిపోర్టు కొట్టండి అని సూచించారు. ఆన్లైన్ బెట్టింగ్ భూతాన్ని అంతమొందించడంలోనూ మీ వంతు బాధ్యత నిర్వర్తించండి అని సజ్జనార్ ఆ పోస్టులో రాసుకొచ్చారు. ఇవే కాకుండా ఇతర సైబర్ నేరాలపై కూడా ప్రజలకు అవగాహన కల్పించేలా సజ్జనార్ అనేక పోస్టులను చేస్తున్నారు. 

ఇదిలా ఉంటే హర్ష సాయి దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఎంతో ఫేమస్. నిరుపేదలకు ఆర్థికంగా సహాయం చేస్తూ సామాజిక మాధ్యమాల్లో భారీగా ఫాలోవర్షను సంపాదించారు. విభిన్న భాషల్లో ఆయనకు అనేక అకౌంట్లు ఉన్నాయి. లక్షలాది రూపాయలు దాతృత్వం చేస్తుంటారన్న ప్రచారాన్ని పొందారు. అయితే ఇప్పటివరకు హర్ష సాయి సాయం చేస్తున్న మొత్తం గురించి చెప్పుకున్నారు తప్ప ఆయన ఎలా సంపాదిస్తున్నారు అన్నదానం గురించి ఎవరు ఆలోచించలేదు. తాజాగా సజ్జనార్ పోస్టుతో ఆయన సంపాదన ఎటువంటి మార్గాల్లో వస్తోంది అన్నదానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మరి ఈ ఐపీఎస్ అధికారి పిలుపుపై సోషల్ మీడియా ఫాలోవర్స్ ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్