||బొర్రా సురేందర్ రెడ్డి||
(రంగారెడ్డి, ఈ వార్తలు ప్రతినిధి, అక్కినేపల్లి పురుషోత్తమరావు)
అసెంబ్లీ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి.. సారు, కారు, నూరు నినాదంతో ముందుకు వెళ్తోందని, మహేశ్వరం నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డికి లక్ష ఓట్ల మెజారిటీ ఖాయమని భారత రాష్ట్ర సమితి మీర్ పేట 28వ వార్డు యువజన సంఘం అధ్యక్షుడు బొర్రా సురేందర్ రెడ్డి అన్నారు. ఆయన ఈవార్తలు ప్రతినిధితో మాట్లాడుతూ వివిధ వార్డులలో తిరుగుతూ ఇంటింటికి వెళ్లి కారు గుర్తుకు ఓటు వేసి అభివృద్ధి సంక్షేమాన్ని ఆశీర్వదించాలని కోరుతున్నట్లు తెలిపారు. మహేశ్వరం నియోజకవర్గమీర్ పేట మున్సిపల్ కార్పొరేషన్ 28వ డివిజన్ లో ఒక విడత ప్రచారం ముగించి రెండో విడతకు సన్నద్ధమవుతున్నట్లు వెల్లడించారు. అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అభివృద్ధి చేస్తే, మహేశ్వరం నియోజకవర్గం శాసన సభ్యురాలు పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిని ఒప్పించి కోట్లాది రూపాయల నిధులు తెప్పించి అభివృద్ధిని పరుగులు పెట్టించారని వివరించారు. మళ్లీ ఆమెను ఆశీర్వదిస్తే అభివృద్ధి నిధులు వరదల పారుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజల నుండి వస్తున్న స్పందన చూస్తే ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో సారూ కారూ నూరూ అనే నినాదంతో ముందుకు వెళుతున్నామని అన్నారు. ఈసారి మహేశ్వరం శాసనసభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి లక్ష ఓట్ల మెజార్టీతో గెలవడం ఖాయమని ఇందుకు నిదర్శనం గత ఆదివారం రాత్రి స్వాగత్ గ్రాండ్ హోటల్ సిల్వర్ డ్రాప్ స్కూల్ సమీపంలో జరిగిన భారీ బహిరంగ సభకు యువకులు కదం తొక్కడం ఇసుకవేస్తే రాలనంత జనం సభలో పాల్గొనడమే ఆమె విజయానికి రాచబాట వేసింది అని ఇక డిసెంబర్ 3 నాడు మెజార్టీ లెక్క చూసుకోవడమే మిగిలిందని సురేందర్ రెడ్డి అన్నారు.