అణ్వస్త్ర ప్రయోగంపై రష్యా కీలక ప్రకటన.. అదే జరిగితే వెనుకాడబోమని స్పష్ఠీకరణ

ప్రాశ్చాత్య దేశాల సహకారంతో ఉక్రెయిన్ రష్యాపై విరుచుకుపడుతోందనీ రష్యా అనుమానాన్ని వ్యక్తం చేస్తోంది. గడిచిన కొద్దిరోజులుగా ఉక్రెయిన్ చేస్తున్న డ్రోన్ దాడులతో రష్యా విలవిల్లాడుతోంది. ఈ నేపథ్యంలోనే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రాశ్చాత్య దేశాలు మరిన్ని ఆయుధాలను ఇస్తే ప్రత్యర్థిని ఓడిస్తామంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కి కోరిన నేపథ్యంలో రష్యా తీసుకున్న నిర్ణయం ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. అణ్వస్త్ర స్పందన విషయంలో రష్యా అత్యంత కీలక మార్పులను చేసింది.

Russian President Vladimir Putin

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 

సుమారు మూడేళ్లుగా ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఇరుదేశాల మధ్య జరిగిన ఈ యుద్ధంలో వందలాది మంది ప్రాణాలను కోల్పోయారు. కోట్లాది రూపాయల నష్టం వాటిల్లింది. ఇప్పటికీ శాంతి చర్చలు కొలిక్కి రాకపోవడంతో యుద్ధం కొనసాగుతూనే ఉంది. గత కొద్దిరోజులుగా రష్యాపై ఉక్రెయిన్ విరుచుకుపడుతోంది. ప్రాశ్చాత్య దేశాల సహకారంతో ఉక్రెయిన్ రష్యాపై విరుచుకుపడుతోందనీ రష్యా అనుమానాన్ని వ్యక్తం చేస్తోంది. గడిచిన కొద్దిరోజులుగా ఉక్రెయిన్ చేస్తున్న డ్రోన్ దాడులతో రష్యా విలవిల్లాడుతోంది. ఈ నేపథ్యంలోనే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రాశ్చాత్య దేశాలు మరిన్ని ఆయుధాలను  ఇస్తే ప్రత్యర్థిని ఓడిస్తామంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కి కోరిన నేపథ్యంలో రష్యా తీసుకున్న నిర్ణయం ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. అణ్వస్త్ర స్పందన విషయంలో రష్యా అత్యంత కీలక మార్పులను చేసింది. ఇప్పటి వరకు రష్యా లేదా దాని మిత్ర దేశాలను లక్ష్యంగా చేసుకొని బాలిస్టిక్ క్షపణిని ప్రయోగిస్తే అణ్వాయుధాలను వాడేందుకు రష్యా సిద్ధపడుతుంది అన్నది ఆ దేశ అణు ప్రయోగ విధానంగా వస్తోంది. కానీ, డ్రోన్ దాడులతో ఉక్రెయిన్ రష్యాను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న నేపథ్యంలో అణ్వాయుధ వినియోగం విషయంలో కొన్ని మార్పులను చేసుకుంది. కొత్తగా చేపట్టిన సవరణల ప్రకారం వ్యూహాత్మక ఆయుధాలు, వైమానిక, హైపర్ సోనిక్, క్రూయిజ్ క్షిపణులతోపాటు డ్రోన్ దాడులు చేసిన అణ్వస్త్రాలను వాడేందుకు తగిన నిర్ణయం తీసుకుంటుంది. సన్నిహిత దేశమైన బెలారస్ పై దాడికి దిగిన రష్యా అణ్వాయుధాలను ఉపయోగిస్తుంది. ఇది ఉక్రెయిన్ కు సాయం చేస్తున్న ప్రాశ్చాత్య దేశాలకు గట్టి హెచ్చరికని రష్యా అధ్యక్ష భవనం క్రిమ్లిన్ ప్రకటించింది. అణ్వాయుధాలే కాక ఇతర మార్గాల్లో దాడులకు దిగిన స్పందన ఎలా ఉంటుందో చెప్పేందుకు ఈ మార్పులు చేసినట్లు వివరించింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ దేశ భద్రత మండలి సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. అణు ప్రయోగం విషయంలో తీసుకున్న మార్పులు గురించి ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. తమపై దాడి చేస్తున్న అణ్వస్త్రాలు లేని దేశానికి 

అణ్వస్త్రాలు ఉన్న మరో దేశం అండగా నిలుస్తోందంటూ మండిపడ్డారు  దీనిని ఆ రెండు దేశాలు కలిపి చేస్తున్న దాడిగానే చూస్తామని ప్రకటించారు. ప్రాశ్చాత్య దేశాలు సరఫరా చేసిన దీర్ఘ శ్రేణి ఆయుధాలతో తమ మీద దాడి చేసేందుకు ఉక్రెయిన్ కు అనుమతిస్తే నాటో కూటమి కూడా యుద్ధంలో చేరినట్లేనని భావిస్తామని ఈ సమావేశంలో పుతిన్ వెల్లడించినట్లు తెలిసింది. పుతిన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు అణ్వాయుధ వినియోగం విషయంలో తీసుకున్న నిర్ణయాలు ప్రస్తుతం ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఈ తరహా నిర్ణయంతో రష్యా ఏ క్షణంలో ఎటువంటి దాడులకు పాల్పడుతుందో అన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమౌతుంది  గడిచిన మూడేళ్లుగా జరుగుతున్న ఈ యుద్ధం భవిష్యత్తులో ఎటువంటి వైపు దారితీస్తుందో అన్న ఆందోళన పలువురిలో వ్యక్తం అవుతోంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్