ఏపీలో కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి చేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే తొలి దశలో కొన్ని కార్పొరేషన్లకు చైర్మన్ లను, డైరెక్టర్లను ప్రభుత్వం నియమించింది. వీటిలో మెజారిటీ భాగం టిడిపి దక్కించుకోగా, కొన్ని స్థానాలకు జనసేన నేతలు దక్కించుకున్నారు. ఒకటి, రెండు మాత్రమే బిజెపి దక్కించుకుంది. మిగిలిన నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున నేపథ్యంలో.. మరో తలనొప్పి వ్యవహారం వారికి ఇబ్బందులు కలిగిస్తోంది.
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
ఏపీలో కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి చేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే తొలి దశలో కొన్ని కార్పొరేషన్లకు చైర్మన్ లను, డైరెక్టర్లను ప్రభుత్వం నియమించింది. వీటిలో మెజారిటీ భాగం టిడిపి దక్కించుకోగా, కొన్ని స్థానాలకు జనసేన నేతలు దక్కించుకున్నారు. ఒకటి, రెండు మాత్రమే బిజెపి దక్కించుకుంది. మిగిలిన నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున నేపథ్యంలో.. మరో తలనొప్పి వ్యవహారం వారికి ఇబ్బందులు కలిగిస్తోంది. నామినేటెడ్ పోస్టులు కోసం తెలుగు తమ్ముళ్లు తీవ్రంగా ఆశపడుతున్నారు. నామినేటెడ్ పదవుల కోసం ఎప్పటి వరకు వచ్చిన దరఖాస్తులు 30 వేలకు పైగానే ఉన్నట్లు సమాచారం. ఇవన్నీ టిడిపి నుంచి వచ్చినవి మాత్రమే. సీఎం చంద్రబాబు మంగళగిరిలో పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన ప్రతిసారి వందల సంఖ్యలో దరఖాస్తులు అదనంగా వచ్చి చేరుతున్నాయి. మంత్రులు, ఆ పార్టీ ముఖ్య నేతలు నిర్వహిస్తున్న వినతుల స్వీకరణ కార్యక్రమంలో కూడా ఇటువంటి దరఖాస్తుల అధికంగా వస్తున్నాయి. ప్రస్తుతం ఆయా కార్పొరేషన్ల చైర్మన్లు, పాలక మండలి సభ్యులు పదవులు అన్ని కలిపి 2000లోపే ఉన్నాయి. వీటిలో చైర్మన్ పదవులు సుమారు 150 వరకు ఉంటే, పాలక మండలి సభ్యుల పదవులు 1500 నుంచి 1800 వరకు ఉంటాయి. వీటిలో కొన్నింటిని కూటమి మిత్ర పక్షాలకు పంపిణీ చేయాల్సి ఉంది. అంతర్గత ఒప్పందం ప్రకారం మొత్తం నామినేటెడ్ పదవుల్లో జనసేన, బిజెపిలకు ఇరవై శాతం ఇవ్వడానికి అంగీకారం కుదురునట్లు చెబుతున్నారు. తొలి జాబితాలో మిత్రపక్షాలకు కొన్ని ఇచ్చారు. 20 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించారు. ఇందులో మూడు చైర్మన్ పదవులు జనసేనకు, ఒకటి బిజెపికి, మిగిలినవి టిడిపికి లభించాయి. మిగిలిన వాటికోసం ప్రస్తుతం టిడిపి నేతలు తీవ్రంగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. అదే సమయంలో జనసేనకు చెందిన ముఖ్య నాయకులు కూడా తమకు కావాలంటూ కొన్ని కీలక కార్పొరేషన్ చైర్మన్ పదవుల కోసం పట్టుబడుతుండడంతో సమస్య క్లిష్టతరం అవుతోంది.
అయితే తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం మాత్రం దరఖాస్తులన్నిటిని క్షుణ్ణంగా పరిశీలించి కొందరికి అవకాశాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. పార్టీ కష్ట కాలంలో ఉండగా గట్టిగా పనిచేసిన వారికి, కేసుల్లో ఇరుక్కున్న వారికి, దాడులకు గురైన వారికి, జైలకు వెళ్లిన వారికి, ఆస్తులు నష్టపోయిన వారికి ఈ నామినేటెడ్ పోస్టులు అప్పగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భావిస్తున్నారు. సుదీర్ఘకాలం పార్టీలో పని చేస్తూ ఎంతకాలం అవకాశాలు రానివారి పేర్లను కూడా పరిశీలిస్తున్నారు. జడ్పిటిసిలు, ఎంపీపీ అధ్యక్షులు, ఎంపీటీసీలు, మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, సహకార సంఘాల అధ్యక్షులు, సర్పంచులు వంటి పదవుల్లో వేల మందికి అవకాశాలు లభిస్తాయి. ఏదో ఒకరకంగా అందరిని సర్దుబాటు చేయాలన్న ప్రయత్నాల్లో టిడిపి అగ్రనాయకత్వం ఉంది. అయితే ఆశావహుల సంఖ్య అధికంగా ఉండడంతో అసంతృప్తి జ్వాలలు రేగే అవకాశం ఉందని పార్టీ నాయకత్వం భావిస్తోంది. ఒకవైపు పార్టీలోనే కాకుండా ఓటమి పార్టీ నేతల్లో కూడా అసంతృప్తి జ్వాలలు ఎగిసపడే అవకాశం ఉందని భావిస్తున్నారు. వీటన్నింటిని ఎలా సద్దుమణిగించాలని అంశంపై దృష్టి సారిస్తూనే ఆయా పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి చేయాలని టిడిపి అగ్రనాయకత్వం భావిస్తుంది. కొద్దిరోజుల్లోనే ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.