కేంద్ర బలగాల ఆధీనంలోకి ఆర్జీ కర్ ఆసుపత్రి.. సుప్రీంకోర్టు ఆదేశంలో రంగంలోకి బలగాలు

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్ కతాలో వైద్య విద్యార్థిని హత్యాచార ఘటనకు కారణమైన ఆర్జి కర్ ఆసుపత్రిపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసును సుమోటోగా తీసుకున్న సుప్రీంకోర్టు విచారణ సాగిస్తోంది. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం కీలక ఆదేశాలను జారీ చేసింది. వైద్య విద్యార్థులకు న్యాయం చేయాలని దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ కేసును సిబిఐ కూడా విచారిస్తోంది.

 CISF forces at RG Kar Hospital

ఆర్జి కర్ ఆసుపత్రి వద్ద సిఐఎస్ఎఫ్ బలగాలు

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్ కతాలో వైద్య విద్యార్థిని హత్యాచార ఘటనకు కారణమైన ఆర్జి కర్ ఆసుపత్రిపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసును సుమోటోగా తీసుకున్న సుప్రీంకోర్టు విచారణ సాగిస్తోంది. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం కీలక ఆదేశాలను జారీ చేసింది. వైద్య విద్యార్థులకు న్యాయం చేయాలని దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ కేసును సిబిఐ కూడా విచారిస్తోంది. ఈ క్రమంలో కేసు విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఆర్జీ కర్ ఆసుపత్రి ప్రాంగణాన్ని కేంద్ర బలగాలు తమ ఆధీనంలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ వద్దకు కేంద్ర బలగాలు బుధవారం ఉదయం భారీగా చేరుకున్నాయి. విమానాశ్రయాలు, పార్లమెంట్ కు రక్షణగా ఉండే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సిఐఎస్ఎఫ్) ఉన్నతాధికారులు హాస్పిటల్ వద్ద గస్తీ కాసేందుకు చేరుకున్నారు. వీరంతా ఈ కేసు విచారణ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు ఆసుపత్రిని తమ పరిధిలో ఉంచుకోనున్నారు. భారీ బందోబస్తు మధ్య ఆసుపత్రిలో ప్రస్తుతం వైద్య సేవలు కొనసాగుతున్నాయి. సుప్రీంకోర్టు విచారణ చేపట్టిన మరుసటి రోజే ఈ పరిణామం చోటు చేసుకోవడం ఆసక్తిని కలిగిస్తోంది. అత్యాచారం ఘటన తర్వాత ఆసుపత్రి వద్ద భారీగా నిరసనలు చోటు చేసుకుంటున్న తరుణంలో కేంద్ర బలగాలను మోహరించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.

ఆసుపత్రికి చేరుకున్న అనంతరం సీనియర్ సిఐఎస్ఎఫ్ అధికారి కే ప్రతాప్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విధులు నిర్వర్తించేందుకు ఆసుపత్రికి వచ్చినట్లు వెల్లడించారు. తమ పని తాము చేస్తామని, మిగతా విషయాలను సీనియర్ అధికారులు తెలియజేస్తారని వెల్లడించారు. కాగా ఆగస్టు 15 తెల్లవారుజామున ఒక గుంపు ఆసుపత్రిపై దాడి చేసి రెండు అంతస్తులోని వైద్య పరికరాలు, సామాగ్రిని ధ్వంసం చేయడంపై సుప్రీంకోర్టు బెంగాల్ పోలీసులకు చీవాట్లు పెట్టింది. ఆసుపత్రి విధ్వంసానికి పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యమే కారణమని మండిపడింది. హత్యాచారానికి సంబంధించిన ఆధారాలను తొలగించే ఉద్దేశంతోనే ఈ దాడిని చేయించారన్న విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర బలగాలు ఆధీనంలో ఆసుపత్రి, కాలేజీ ఉండాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశించింది. అందుకే అనుగుణంగా బలగాలు ఆసుపత్రికి చేరుకున్నాయి. ఇదిలా ఉంటే మరోవైపు ఆర్జీ కార్ హాస్పిటల్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ కు పాలిగ్రాఫ్ పరీక్ష (లైవ్ డిటెక్టర్ పరీక్ష) చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. కేసును విచారిస్తోన్న సిబిఐ అధికారులు పాలిగ్రాఫ్ టెస్ట్ కు సిద్ధమైనట్లు చెబుతున్నారు. ఆగస్టు 9వ తేదీన వైద్యశాల సెమినార్ హాల్లో వైద్యురాలి మృతదేహం పడి ఉన్న విషయం తెలిసిందే. ఈ ఘటన తర్వాత రెండు రోజులకు ప్రిన్సిపాల్ రాజీనామా చేశారు. ఇప్పటికే పలుమార్లు ఆయనను సిబిఐ విచారించింది. ప్రస్తుతం ఆయన వైపు అనేక వేళ్ళు చూపిస్తున్న నేపథ్యంలో ఈ పాలిగ్రాఫ్ టెస్ట్ తరవాత కేసులో పురోగతి లభించే అవకాశం ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్