ఏపీ ప్రభుత్వం రెవెన్యూపరమైన సమస్యలను క్లియర్ చేసేందుకు సిద్ధమవుతుంది. ఇందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తోంది. ఈ మేరకు స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఈ వివరాలను వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా డిసెంబర్ 6వ తేదీ నుంచి గ్రామసభలు నిర్వహించి రెవిన్యూ పరమైన ఇబ్బందులను పరిష్కరించనున్నారు. ఈనెల ఎనిమిదో తేదీ వరకు ఈ సభలో నిర్వహించనున్నారు.
ప్రతీకాత్మక చిత్రం
ఏపీ ప్రభుత్వం రెవెన్యూపరమైన సమస్యలను క్లియర్ చేసేందుకు సిద్ధమవుతుంది. ఇందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తోంది. ఈ మేరకు స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఈ వివరాలను వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా డిసెంబర్ 6వ తేదీ నుంచి గ్రామసభలు నిర్వహించి రెవిన్యూ పరమైన ఇబ్బందులను పరిష్కరించనున్నారు. ఈనెల ఎనిమిదో తేదీ వరకు ఈ సభలో నిర్వహించనున్నారు. గ్రామ స్థాయిలో భూ తగాదాలు, రీ సర్వే అవకతవకలను పరిష్కరించడమే లక్ష్యంగా ఈ సదస్సులను నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం వర్గాలు చెబుతున్నాయి. ప్రతి మండలంలో, గ్రామంలో రోజుకు ఒకసారి సమావేశాలు నిర్వహించనున్నారు. చిన్న గ్రామాల్లో ఒక పూట, పెద్ద గ్రామాల్లో అయితే రోజంతా ఈ సభలో నిర్వహించేలా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తహసీల్దార్, రెవిన్యూ ఇన్స్పెక్టర్, వీఆర్వో, మండల సర్వేయర్ వంటి అధికారులు ఈ సమావేశాల్లో పాల్గొననున్నారు. అవసరమైతే ఇతర శాఖల అధికారులు కూడా ఈ సమావేశాలకు హాజరయ్యేలా ఆదేశాలను ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ సమావేశాలు నిర్వహణకు సంబంధించి పకడ్బందీ ఏర్పాట్లను ఇప్పటికే ప్రభుత్వం చేసింది.
ఈ సమావేశాల నేపథ్యంలో ప్రతి మండలానికి డిప్యూటీ కలెక్టర్ ను పర్యవేక్షణ అధికారిగా ప్రభుత్వం నియమించింది. గత ప్రభుత్వంలో భూముల అక్రమాల కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఈ ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ సమస్యలను పరిష్కరించేందుకు ఈ సభలో ఉపయుక్తంగా ఉంటాయని ప్రభుత్వ పెద్దలు యోచిస్తున్నారు. ఈ సభల ద్వారా సమస్యలను పరిష్కరించడమే లక్ష్యం అనే ప్రభుత్వ పెద్దలు పేర్కొంటున్నారు. సమస్యలకు సంబంధించిన డాక్యుమెంట్లు, దరఖాస్తులను ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు తీసుకుని వస్తే వీటికి సంబంధించి ఒక రసీదును అధికారులు ఇస్తారు. 45 రోజుల్లోగా ఆయా సమస్యలను పరిష్కరించేలా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. సభల అనంతరం రాష్ట్రస్థాయిలో పర్యవేక్షణ టీములు ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కరించే అనంతరం నివేదిక అందిస్తుంది. గ్రామస్థాయిలో ప్రజల సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా ఈ సభలను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే రెవిన్యూ అధికారులు ఈ సభలు నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లను పూర్తి చేశారు. వివాదాలకు తావు లేకుండా భూ సమస్యలను, సర్వేకు సంబంధించి ఉన్న ఇబ్బందులను పరిష్కరించుకునేందుకు ఈ సభలను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.