తెలంగాణలో మూసీ నది కేంద్రంగా రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ప్రస్తుతం ఈ వ్యవహారంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కొద్దిరోజుల కిందట సీఎం రేవంత్ రెడ్డి విసిరిన సవాల్ కు అనుగుణంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మూసీ నది బాట పెట్టారు. మూసి పరివాహక ప్రాంతంలోని నివాసితులకు అండగా ఉండేందుకు అనుగుణంగా రాత్రి వారి ఇళ్లల్లో బస చేశారు.
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో మూసీ నది కేంద్రంగా రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ప్రస్తుతం ఈ వ్యవహారంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి మధ్య మాటల తూటాలు పెడుతున్నాయి. కొద్దిరోజుల కిందట సీఎం రేవంత్ రెడ్డి విసిరిన సవాల్ కు అనుగుణంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మూసీ నది బాట పెట్టారు. మూసి పరివాహక ప్రాంతంలోని నివాసితులకు అండగా ఉండేందుకు అనుగుణంగా రాత్రి వారి ఇళ్లల్లో బస చేశారు. స్థానికులతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మూసీ నిద్రలో భాగంగా అంబర్ పేటలోని తులసీ రామ్ నగర్ బస్తీలో పర్యటించిన కిషన్ రెడ్డి లక్ష బుల్డోజర్ల తెచ్చిన పేదల ఇల్లు కూల్చలేరని స్పష్టం చేశారు. బలవంతంగా కూల్చాలని చూస్తే ఇప్పుడున్న జైళ్ళు సరిపోవని వెల్లడించారు. నిరుపేదల ఇళ్లను కూల్చబోమని హామీ ఇస్తే.. మూసి ప్రక్షాళనకు సహకరిస్తామని వెల్లడించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ బెదిరింపులకు భయపడేది లేదన్న కిషన్ రెడ్డి.. నిరుపేదలకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. కిషన్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు.
కిషన్ రెడ్డి వ్యాఖ్యలు అర్థరహితమంటూ ఘాటుగానే వ్యాఖ్యానించారు. బీజేపీ నేతల బస్తీ నిద్రపై స్పందించిన సీఎం రేవంత్.. కిషన్ రెడ్డి టార్గెట్‌గా ఘాటు విమర్శలు చేశారు. సబర్మతి ప్రక్షాళనపై కిషన్ ఎందుకు ప్రశ్నించలేదని సీఎం రేవంత్ రెడ్డి నిలదీశారు. గుజరాత్ మోడల్ దేశానికి ఆదర్శమంటున్నారని, మరి మూసీ ప్రాజెక్ట్‌కు మాత్రం ఎందుకు అడ్డుపడుతున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మూసీ ప్రాజెక్ట్ వద్దంటున్నారంటే.. గుజరాత్ మోడల్ ఫెయిల్ అయ్యిందా.? అని సీఎం ప్రశ్నించారు. మూసీని బాగుచేయడం బీజేపీకి ఇష్టం లేదన్న రేవంత్ రెడ్డి.. మహారాష్ట్ర ప్రజలను మోసం చేసేలా షిండేను వాడుకున్నారని ఎద్దేవా చేశారు. మహారాష్ట్రలో షిండేను వాడుకుంటున్నట్టుగా తెలంగాణలో కిషన్‌రెడ్డిని బిజెపి వాడుకుంటుందంటూ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఈ వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.