తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై భారతీయ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఆయన రేవంత్ పై అసహనాన్ని వెళ్ళగక్కారు. ఆదాని వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో చలో రాజ్ భవన్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సందించారు. వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు బయలుదేరినట్టు రేవంత్ వ్యవహారం ఉందన్నారు.
ఆటో డ్రైవర్లకు సంఘీభావంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై భారతీయ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఆయన రేవంత్ పై అసహనాన్ని వెళ్ళగక్కారు. ఆదాని వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో చలో రాజ్ భవన్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సందించారు. వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు బయలుదేరినట్టు రేవంత్ వ్యవహారం ఉందన్నారు. అదానీకి అన్ని రకాలుగా తోడు, నీడగా ఉంటూ ఆయన కోసం కష్టపడుతున్న రేవంత్ రెడ్డి.. అదానీకి వ్యతిరేక ర్యాలీ తీయాలనుకుంటున్నాడని విమర్శించారు. జైపూర్ లో సరిగ్గా అతిథి మర్యాదలు జరగలేదోనో, ఢిల్లీ లో అప్పోయింట్మెంట్ దక్కలేదనో గానీ మొత్తానికి కొత్త నాటకానికి శ్రీకారం చుట్టాడు మన చిట్టినాయుడు అంటూ ఆరోపించారు. భాయ్, భాయ్ అని వందల, వేల కోట్లు పంచుకున్న ముఖ్యమంత్రి.. ఇప్పుడు అదానీ వ్యతిరేక ర్యాలీ తీస్తున్నాడంట అనే విమర్శించారు కేటీఆర్. నవ్వి పోదురు నాకేటి సిగ్గు అని రేవంత్ రెడ్డిని చూసే రాసుంటారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. మిమ్మల్ని ఎన్నుకున్నంత మాత్రం ప్రజలు మరీ అంత తెలివి తక్కువ వాళ్ళనుకుంటున్నావా.? రేవంత్ రెడ్డి అంటూ ప్రశ్నించారు. మళ్లీ మళ్లీ మోసం చెయ్యచ్చులే అనుకుంటున్నావా? దొంగే దొంగ అనడం నేడు కామన్ అయిపోయిందని కేటీఆర్ ట్విట్టర్ వేదికగా రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు.
ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలని కోరిన కేటీఆర్..
ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారం కోరుతూ ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి అసెంబ్లీ/మండలికి ఆటోల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బయలుదేరి వచ్చారు. వీరంతా ఖాకీ దుస్తులు ధరించి వారికి సంఘీభావాన్ని తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఎనిమిది లక్షల మంది ఆటో డ్రైవర్లకు ఎన్నో హామీలు ఇచ్చిందన్నారు. ఆ హామీలు ఏవీ అమలు కాలేదని, ఇప్పటి వరకు 93 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలకు పాల్పడ్డారని కేటీఆర్ విమర్శించారు. గత అసెంబ్లీ సమావేశాల్లోనే ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్ల జాబితాను అందించామని, రాష్ట్ర ప్రభుత్వానికి దున్నపోతు మీద వాన పడ్డట్లే ఉందన్నారు. ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి ఇస్తామన్న రూ.12 వేల రూపాయలను వెంటనే ఇవ్వాలని, ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పారని దానిని వెంటనే ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. ఆటో డ్రైవర్లు ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దన్న కేటీఆర్.. బీఆర్ఎస్ తరఫున వారి కోసం పోరాడతామన్నారు. ఆటో డ్రైవర్లకు సంఘీభావంగా తాము ఆటోల్లో అసెంబ్లీకి వెళ్తున్నామని, వారి యూనిఫాములు ధరించి వచ్చామన్నారు. ఆటో డ్రైవర్ కు ప్రభుత్వం తక్షణమే మేలు చేయాలన్నారు.