తెలంగాణ తల్లి అంటే తెలంగాణ ప్రజల భావోద్వేగమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. డిసెంబర్ 9వ తేదీ తెలంగాణ ప్రజలకు పర్వదినంగా ఆయన అభివర్ణించారు. తెలంగాణ ఏర్పాటు పునాది పడిన రోజు అని, అమరుల త్యాగాలకు అనుగుణంగా సోనియా గాంధీ తెలంగాణ ప్రకటన చేశారన్నారు. 60 ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలను సోనియా గాంధీ నెరవేర్చారని ఆయన కొనియాడారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల శక్తి స్వరూపుని తెలంగాణ తల్లి అని అభివర్ణించిన రేవంత్ రెడ్డి.. లక్ష సాధన వైపు నడిపించిన తల్లిగా పేర్కొన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ తల్లి అంటే తెలంగాణ ప్రజల భావోద్వేగమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం నుంచి ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఆయన ఉదయం మాట్లాడారు. డిసెంబర్ 9వ తేదీ తెలంగాణ ప్రజలకు పర్వదినంగా ఆయన అభివర్ణించారు. తెలంగాణ ఏర్పాటు పునాది పడిన రోజు అని, అమరుల త్యాగాలకు అనుగుణంగా సోనియా గాంధీ తెలంగాణ ప్రకటన చేశారన్నారు. 60 ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలను సోనియా గాంధీ నెరవేర్చారని ఆయన కొనియాడారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల శక్తి స్వరూపుని తెలంగాణ తల్లి అని అభివర్ణించిన రేవంత్ రెడ్డి.. లక్ష సాధన వైపు నడిపించిన తల్లిగా పేర్కొన్నారు. తెలంగాణ నేల స్వేచ్ఛ కోసం పిడికిలి బిగించిన ఉజ్వల జ్వాల అని, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల శక్తి తెలంగాణ తల్లి అంటూ ఉద్వేగబరితంగా ప్రసంగించారు. తెలంగాణ తల్లి రూపకల్పనలో సంస్కృతి, సాంప్రదాయాలను తీసుకొచ్చామని, మెడకు కంటే, గుండు పూసల హారంతో తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పన జరిగిందన్నారు. సమ్మక్క, సారలమ్మ, చాకలి ఐలమ్మ స్పూర్తితో విగ్రహాన్ని రూపొందించినట్లు పేర్కొన్నారు.
చేతిలో వరి, జొన్నలు, సజ్జలతో తెలంగాణ విగ్రహం రూపొందించినట్లు తెలిపారు. పుట్టుక నీది, చావు నీది అన్న కాలోజీ మాటల స్ఫూర్తితో యువత ఉద్యమించిందని, అగ్నికీలల్లో దేహాలు మండినా తెలంగాణ సాధన కోసం యువత వెనుకడుగు వేయలేదు అన్నారు. తెలంగాణ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం చరిత్రలో నిలిచిపోయే ఘట్టంగా ఆయన అభివర్ణించారు. ఏటా డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం అధికారికంగా నిర్వహిస్తామన్నారు రేవంత్.. రెడ్డి చరిత్ర ఉన్నంతవరకు తెలంగాణ తల్లి నిలిచిపోవాలని ఆకాంక్షించారు. అందరితోనూ చర్చించి తెలంగాణ తల్లి రూపంపై నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. తల్లి ప్రతిరూపమే పెట్టుకోవాలన్న అభిప్రాయంతోనే ఈ నిర్ణయానికి వచ్చినట్లు వెల్లడించారు. బహుజన తల్లిని ఆవిష్కరిస్తున్నామని, ఇది కొందరికి నచ్చడం లేదని ఆరోపించారు. ఒక కుటుంబం, ఒక వ్యక్తి తెలంగాణ అనే భావన మంచిది కాదని, ఈ ఒక్క రాజకీయాలు పక్కన పెడదామన్నారు. రేపటి నుంచి రాజకీయ అంశాలు ప్రస్తావిద్దామని, కెసిఆర్, కిషన్ రెడ్డి, బండి సంజయ్ అభివృద్ధి అభివృద్ధి ఆహ్వానిస్తున్నామన్నారు. ఈ భూ ప్రపంచంలో ఏ జాతికైనా గుర్తింపు ఆ జాతి అస్తిత్వమేనని, ఆస్తిత్వానికి మూలం సంస్కృతి అని పేర్కొన్నారు.