తెలంగాణలో రేవంత్ రెడ్డి నికృష్ట పాలన.. కేటీఆర్ సెటైర్లు

సీఎం రేవంత్ రెడ్డి పాలనపై భారతీయ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి పాలన అధ్వానంగా సాగుతోందని ఆరోపించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా శుక్రవారం కేటీఆర్ రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. తల్లికి బువ్వ పెట్టనోడు-చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తా అన్నట్లుగా ఉందని కేటీఆర్ విమర్శించారు. తెలంగాణలో 420 హామీలు ఇచ్చి గంగలో కలిపి - ఢిల్లీ పురవీధుల్లో కొత్త నాటకం మొదలు పెట్టిండని పేర్కొన్నారు.

ktr

కేటీఆర్ 

సీఎం రేవంత్ రెడ్డి పాలనపై భారతీయ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి పాలన అధ్వానంగా సాగుతోందని ఆరోపించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా శుక్రవారం కేటీఆర్ రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. తల్లికి బువ్వ పెట్టనోడు-చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తా అన్నట్లుగా ఉందని కేటీఆర్ విమర్శించారు. తెలంగాణలో 420  హామీలు ఇచ్చి గంగలో కలిపి - ఢిల్లీ పురవీధుల్లో కొత్త నాటకం మొదలు పెట్టిండని పేర్కొన్నారు. తెలంగాణలో సాగుతున్న నికృష్ట పాలన - ఢిల్లీలో కూడా  చేయిస్తానని బయలుదేరిన పులకేశి అంటూ కేటీఆర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఉచిత కరెంటు ఇచ్చింది ఎవరికని ప్రశ్నించిన కేటీఆర్.. గ్యాస్ సబ్సిడీ ఎవరికి ఇచ్చారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నెలకు రూ.2500 ఇస్తున్న మహిళలు ఎవరన్న కేటీఆర్.. తులం బంగారం ఇచ్చిన ఆడబిడ్డలు ఎవరని పేర్కొన్నారు. రాష్ట్రంలోని రైతులకు రైతు భరోసా రూ.7500 ఇచ్చిందెక్కడని ప్రశ్నించిన కేటీఆర్.. ఆసరా ఫించన్లు రూ.4000 చేసిందెక్కడని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని విద్యార్థులకు రూ.5 లక్షల విద్యా భరోసా ఎక్కడ అమలు చేశారని ప్రశ్నించిన కేటీఆర్.. విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటీలు ఎందుకు ఇవ్వలేదని విమర్శించారు. 

పేరు గొప్ప ఊరుదిబ్బ అన్నట్టుగా రాష్ట్రంలో పరిస్థితి ఉందని, ఇక్కడ ఇచ్చిన హామీలకు దిక్కులేదు గాని అక్కడ ఢిల్లీ ప్రజలకు గ్యారంటీలు ఇస్తున్నావా.? కేటీఆర్ విమర్శించారు. ఈడ ఇచ్చిన హామీలకు దిక్కు లేదు గానీ, ఢిల్లీలో ఇస్తున్న హామీలకు గ్యారంటీ ఇస్తున్నావా అంటూ విమర్శించారు. ఢిల్లీ గల్లీల్లో కాదని, దమ్ముంటే మీ ఢిల్లీ గులాంతో అశోక్ నగర్ గల్లీల్లో  ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చింది చెప్పాలని డిమాండ్ చేశారు. నవ్విపోదురు గాక నాకేంటి సిగ్గు అన్నట్లుగా రేవంత్ వ్యవహారం ఉందని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్