తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుల గణన చేసేందుకు సిద్ధమవుతోంది. కుల గణన చేయాలన్న ఆలోచన వెనుక సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్ దాగి ఉంది అన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి చాలా సీరియస్ గానే తీసుకున్నారు. వీలైనంత వేగంగా ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకు అనుగుణంగానే అధికారులకు ఆదేశాలను రేవంత్ రెడ్డి జారీ చేశారు. ఇందుకోసం డెడికేటెడ్ కమిషన్ ను ఏర్పాటు చేస్తూ సీఎం నిర్ణయం తీసుకున్నారు. కుల గణన అనగానే అనేక రకాల ఇబ్బందులు ఉంటాయి.
సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుల గణన చేసేందుకు సిద్ధమవుతోంది. కుల గణన చేయాలన్న ఆలోచన వెనుక సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్ దాగి ఉంది అన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి చాలా సీరియస్ గానే తీసుకున్నారు. వీలైనంత వేగంగా ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకు అనుగుణంగానే అధికారులకు ఆదేశాలను రేవంత్ రెడ్డి జారీ చేశారు. ఇందుకోసం డెడికేటెడ్ కమిషన్ ను ఏర్పాటు చేస్తూ సీఎం నిర్ణయం తీసుకున్నారు. కుల గణన అనగానే అనేక రకాల ఇబ్బందులు ఉంటాయి. న్యాయపరమైన చిక్కులు ప్రక్రియను ముందుకు వెళ్ళనీయకుండా అడ్డుకుంటుంటాయి. ఈ తరహా ఇబ్బందులు రాకుండా ఉండాలన్న ఉద్దేశంతోనే సీఎం రేవంత్ రెడ్డి ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెబుతున్నారు. గతంలో కెసిఆర్ నిర్వహించిన సకల జనుల సర్వే కంటే భిన్నంగా ఈ కుల గణన ప్రక్రియను పూర్తి చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం భావిస్తోంది. తెలంగాణలోని ప్రతి ఇంటికి వెళ్లి ఈ గణన చేపట్టనున్నారు. ఈ కుల గణన ప్రక్రియ ద్వారా ఎంతమంది ఏ ఏ కులాలకు చెందిన వాళ్లు ఉన్నారు అన్న అంశాలని గుర్తించనున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా ఈ కుల గణనపై దేశవ్యాప్తంగా సంవిధాన్ సన్ సభలు నిర్వహిస్తున్నారు. రాహుల్ ఆలోచనలకు అనుగుణంగానే రేవంత్ రెడ్డి కుల గణన ప్రక్రియను ప్రారంభించినట్లు చెబుతున్నారు.
కులగానన ప్రక్రియను వీలైనంత వేగంగా పూర్తి చేయడం ద్వారా రాజకీయంగాను లబ్ధి పొందవచ్చు అన్న భావనలో రేవంత్ రెడ్డి ఉన్నారు. చట్టపరంగా కూడా ఎలాంటి సమస్యలు రాకుండా ఉండేందుకు ప్రత్యేకంగా కమిషన్ ను ఏర్పాటు చేశారు. బీసీలు ఎంతమంది ఉన్నారో లెక్కించి వారికి జనాభా దామాషా పద్ధతిలో అవకాశాలను కల్పించడమే లక్ష్యంగా ఈ కుల గణన చేపడుతున్నట్లు చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి అగ్రవర్ణాల్లో మద్దతు తక్కువగా ఉంది. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు బలమైన మద్దతుదారులుగా ఉన్నారు. బీసీలు కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిస్తే పూర్వ వైభవం వస్తుందని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. కుల గణన ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయగలిగితే బీసీలు కూడా కాంగ్రెస్ పార్టీ వైపు తిరుగుతారన్న ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం ఉంది. ఈ లెక్కలన్నీ చూసుకునే రేవంత్ రెడ్డి కుల గణన అంశాన్ని తెరపైకి తీసుకువచ్చినట్లు చెబుతున్నారు. మరి రేవంత్ రెడ్డి వేసుకుంటున్న ఈ లెక్కలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలిస్తాయా.? లేదా.? అన్నది భవిష్యత్తు నిర్ణయించనుంది.