సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'గుట్టలను మట్టి చేసి భూదాహం తీర్చుకోవడం కాదు రేవంత్ - గుట్టల్లా పేరుకుపోయిన ధాన్యం రాశుల వైపు చూడు' అంటూ సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కేటీఆర్ ట్విట్ చేశారు. బుధవారం చేసిన ఈ ట్వీట్ లో అనేక విషయాలపై ఆయన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
కేటీఆర్
సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'గుట్టలను మట్టి చేసి భూదాహం తీర్చుకోవడం కాదు రేవంత్ - గుట్టల్లా పేరుకుపోయిన ధాన్యం రాశుల వైపు చూడు' అంటూ సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కేటీఆర్ ట్విట్ చేశారు. బుధవారం చేసిన ఈ ట్వీట్ లో అనేక విషయాలపై ఆయన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గాలి మోటార్లో మూటలు మోసుడు కాదన్న కేటీఆర్.. కొనేవారు లేక పేరుకుపోయిన ధాన్యం మూటల వైపు చూడు అంటూ ఎద్దేవా చేశారు. ఢిల్లీ ముందు మోకరిల్లడం కాదు - పండించిన పంటకు భద్రత లేక గొల్లుమంటున్న రైతన్నల మొహం వైపు చూడు అంటూ సీఎం రేవంత్ రెడ్డిని కేటీఆర్ నిలదీశారు. నీ కళ్ళ బుల్లి మాటలతో కాలయాపన చేయడం కాదు - ధాన్యం కొనడానికి ముందుకు రాని మిల్లర్ల ముచ్చట ఏందో చూడు అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు.
నీ మూసి ముసుగులు కాదు - కళ్ళంలో కాంతా ఎప్పుడు వేస్తారో తెలియక కన్నీరు పెడుతున్న రైతన్నల కన్నీళ్ళ వైపు చూడు అంటూ సూచించారు. పొద్దు, మాపు ఢిల్లీ యాత్రలు కాదు - పల్లె పల్లెల్లో, వాడవాడల్లో వడ్లు కొనండి మొర్రో అంటూ మొత్తుకుంటున్న రైతూ ఆవేదన వైపు చూడు అంటూ సూచించారు. నీ కాసులు కక్కుర్తి - నీ కేసుల కుట్రలు కాదు - పండిన పంటకు గిట్టుబాటు ధర దక్కక కాకా వికలం అవుతున్న రైతు బతుకు వైపు చూడు అంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దొడ్డు వడ్లకు బోనస్ ఎగ్గొడితివి అంటూ విమర్శించిన కేటీఆర్.. సన్న వడ్లకు సున్నం పెడితే అంటూ సుతి మెత్తగా చురకలు అంటించారు. ఎగ్గొట్టడం మీద ఉన్న శ్రద్ధ రైతులకు ఆసరాగా నిలబడడం వైపు లేదు అంటూ విమర్శించారు. ప్రభుత్వం రైతుల పట్ల వ్యవహరిస్తున్న తీరును ఈ ట్వీట్లో కేటీఆర్ తీవ్రస్థాయిలో ఎండగట్టారు. ప్రభుత్వం రైతుల పండించిన పంటలను కొనుగోలు చేయకపోవడంతో వారు పడుతున్న ఆవేదనను ఈ ట్వీట్లో కేటీఆర్ తెలియజేశారు.