ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన రేవంత్ రెడ్డి సర్కార్.. డీఏ భారీగా పెంపు.!

ఆర్టీసీ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉద్యోగులకు డిఏ పెంచుతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలోని వందలాది మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. ఆర్టీసీ యాజమాన్యంతో చర్చించి ఆర్టీసీ ఉద్యోగులకు 2.5 శాతం డీఏ ప్రకటిస్తున్నట్టు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. తాజాగా పెంచిన డిఏ వల్ల ఆర్టీసీపై ప్రతినెల రూ.3.6 కోట్ల భారం పడనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ ఉద్యోగులకు వేలాదిమందికి లబ్ధి చేకూరుతుంది.

symbolic image

ప్రతీకాత్మక చిత్రం

ఆర్టీసీ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉద్యోగులకు డిఏ పెంచుతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలోని వందలాది మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. ఆర్టీసీ యాజమాన్యంతో చర్చించి ఆర్టీసీ ఉద్యోగులకు 2.5 శాతం డీఏ ప్రకటిస్తున్నట్టు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. తాజాగా పెంచిన డిఏ వల్ల ఆర్టీసీపై ప్రతినెల రూ.3.6 కోట్ల భారం పడనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ ఉద్యోగులకు వేలాదిమందికి లబ్ధి చేకూరుతుంది. ఈ నిర్ణయం పట్ల ఉద్యోగులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. గడిచిన కొన్నాళ్లుగా ఆర్టీసీ ఉద్యోగులు డిఏ పెంపు కోసం ఎదురుచూస్తూ వస్తున్నారు. ప్రభుత్వంపై గడిచిన కొన్నాళ్లుగా ఉద్యోగులు ఒత్తిడి చేస్తూ వస్తున్నారు. ఎట్టకేలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉద్యోగులకు అనుకూలంగా ఈ నిర్ణయాన్ని తీసుకుంది. మరోవైపు మహాలక్ష్మి పథకం ప్రారంభించిన తర్వాత ఇప్పటివరకు 150 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణించారని, దీనివల్ల ఉద్యోగులపై పని ఒత్తిడి పెరిగిన వారు నిరంతరం శ్రమిస్తున్నారని మంత్రి పొన్నం ఈ సందర్భంగా వెల్లడించారు. మహిళా ప్రయాణికుల సంఖ్య భారీగా పెరగడంతో ఆర్టీసీ బస్సులకు డిమాండ్ పెరిగింది.

మహిళా సమైక్య సంఘాల చేత బస్సులు కొనిపించి ఆర్టీసీలో అద్యప్రాతిపదికన బస్సులు నడిపిస్తూ మహిళల ఆదాయాన్ని ఆర్జించేలా చేయాలని భావిస్తున్నట్లు మంత్రి పొన్నం పేర్కొన్నారు. పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కతో పాటు అధికారులతో పలుమార్లు ఈ అంశంపై చర్చించారు. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా మొదటిసారి మహిళ సంఘాల చేత ఆర్టీసీ బస్సులు అద్దె ప్రాతిపదికన పెట్టి బస్సులకు యజమానులను చేస్తూ మహిళా సాధికారత దశగా తెలంగాణ ప్రభుత్వం విజయం సాధించింది. రాష్ట్ర ప్రభుత్వం కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా పెట్టుకొని వివిధ పథకాలను అమలులోకి తీసుకు వస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. మరోవైపు మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇందిరా మహిళా శక్తి ద్వారా 600 బస్సులు మహిళా సమైక్య సంఘాల ద్వారా ఆర్టీసీతో అద్దె ప్రాతపదికన ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం మొదటి దశలో మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని 150 బస్సులను సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క ప్రారంభించనున్నారు. ఇందుకోసం అధికారులు ఏర్పాటులో పూర్తి చేశారు. ఏందిరా మహిళ శక్తి బస్సులు మొదటి దశలో 150 మండలాల్లో ప్రతి మండలానికి ఒక మండల సమైక్య సంఘం ద్వారా ఒక బస్సు ప్రారంభం కానుంది. ఈ పైలట్ ప్రాజెక్టు పాత ఉమ్మడి జిల్లాలైన వరంగల్, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్నగర్ జిల్లాలను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి మహిళా సంఘాలను భాగస్వామ్యం చేశారు. మండల మహిళా సమైక్యల ద్వారా కొనుగోలు చేసిన ఇందిరా మహిళ ఆర్టీసీ బస్సులు ద్వారా బస్సుల డిమాండ్ నేపథ్యంలో ప్రయాణీకులకు ఉపశమనం కలుగుతుంది. దీనివల్ల మహిళా ప్రయాణీకులకు ఇబ్బందులు తొలగతాయని ప్రభుత్వం భావిస్తోంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్